వెబ్ సైట్ కి పేరు ఎలా పెట్టాలి-పార్ట్ 1

0
WEBSITE KI PERU PART 1

సురేష్ ఇంట్లో ఒకటే సందడి. వాళ్ళ బాబు కి నామకరణం చేస్తున్నారు. ఏం పేరు పెడదామా అని అందరి మధ్య డిస్కషన్. ఏదో ఒక పేరు పెడితే ఎలా, జీవితాంతం పిలవాల్సిన పేరు.తిధులు,నక్షత్రాలు చూసి పెట్టాలి.

ఆ పక్కింట్లో ఉండే రమేష్ ఇంట్లోను పేరు మీద డిస్కషన్, వారం రోజులుగా తన్నుకుంటున్నాడు మంచి పేరు కోసం,ఫ్రెండ్స్ కొన్ని పేర్లు చెప్పారు,ఇంట్లో వాళ్ళు కొన్ని పేర్లు చెప్పారు. కాని రమేష్ కి ఏది నచ్చలేదు.

ఒక సెకండ్…..ఇక్కడ రమేష్ టెన్షన్ పడుతుంది వాళ్ళ బాబుకో పాపకో పేరు పెట్టడానికి కాదు, తను సొంతంగా స్టార్ట్ చేస్తున్న ఆన్ లైన్ బిజినెస్ వెబ్ సైట్ కి.

వెబ్ సైట్  పేరు కోసం ఇంత కష్టపడాలా, ఏదో ఒకటి పెట్టొచ్చుగా అనుకోకండి. మీ బిజినెస్ లేదా మీ సర్వీసెస్,వర్క్స్ మీద ఆ పేరు ఎఫెక్ట్ చాలా ఉంటది. అయినా మీ ఆలోచనలో పుట్టిన ఒక బిజినెస్ ఐడియా మీ పాప లాంటిందే .

ఇప్పటికీ చాలా మంది వెబ్ సైట్ కి పేరు పెట్టె ముందు ఏ మాత్రం ఆలోచించకుండా తమకు నచ్చిన విధంగా ఫాలో అవుతున్నారు.
అయితే ఆ పెట్టే పేరు మీ బిజినెస్ కి,లేదా వెబ్ సైట్ కి ఎంత మాత్రం ఉపయోగపడతాయో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

 

ఒక వెబ్ సైట్ కి పేరు పెట్టేముందు మనం ఆలోచించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.
అసలు ఈ వెబ్ సైట్ ఎందుకు?
ఈ వెబ్ సైట్ చేస్తున్న పని ఏంటి?అంటే వెబ్ సైట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశం మన పేరు లో ప్రతిబంబించాలి.

ఉదాహరణకి:
redbus.in పేరు చూడండి, బస్సు టికెట్స్ ఆన్ లైన్ లో రిజర్వేషన్ చేసుకునే ఒక వారధి. అందరకి సింపుల్ గా గుర్తుపెట్టుకునే విధంగా “ఎర్ర బస్సు” అని పేరు పెట్టారు, అలానే తము చేస్తుంది బస్సు మీద బిజినెస్ కాబట్టి బస్సు అనే పదం తమ పేరు లో ఉండేటట్టు చూసుకున్నారు.
అంటే ఆ వెబ్ సైట్ చూడని వాళ్ళకు ఆ పేరు వినగానే కనీసం ఇదేదో బుస్సులకి సంబంధించిన వెబ్ సైట్ అని తెలియజేస్తుంది.

అలానే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ-కామర్స్ సంస్థ అమజాన్ వ్యవస్థాపకుడు తన కంపెనీ పేరు “A” అనే అక్షరం తో స్టార్ట్ అవ్వాలని అనుకున్నాడు కాని ఆ పేరులో తన బిజినెస్ లేదా గోల్ తెలియచేయాలనుకున్నాడు.అందుకే అమజాన్ మాహ సముద్రం అంత పెద్దది గా తమ స్టోర్ కుడా అతి పెద్ద ఆన్ లైన్ స్టోర్ గా విస్తరించాలి అనే ఉద్దేశం తో Amazon పేరు పెట్టారు.

టెక్నికల్ బాష లో వెబ్ సైట్ పేరు ని “డొమైన్” అంటారు. మీరు ఎప్పుడయినా ఒక వెబ్ సైట్ కోసం ఏదయినా కంపెనీ ని గాని ,వెబ్ సైట్ డెవలప్ చేసేవాళ్ళని గాని వెబ్ సైట్ కావాలి  చేస్తారా అని అడిగితే ముందు వాళ్ళు అడిగే ప్రశ్న, డొమైన్ బుక్ చేసుకున్నారా అనే.అంటే వెబ్ సైట్ పేరు బుక్ చేసుకున్నారా అని.

మనకి ఒక వెబ్ సైట్ కావలి అంటే ముందు దానికి ఒక పేరు రిజిస్టర్ చేసుకోవాలి, “google.com” అనేది గూగుల్ సంస్థ యొక్క వెబ్ సైట్ పేరు. అలానే మీరు ఆన్ లైన్ షాపింగ్ చేస్తుంటే మీకు సుపరిచితమయిన ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ పేరు “flipkart.com”.

కాబట్టి వెబ్ సైట్ స్టార్ట్ చేసే ముందు మనం దాని పేరు రిజిస్టర్ చెయ్యాలి, పేరు ఎక్కడ రిజిస్టర్ చెయ్యాలి అని కన్ఫ్యూషన్ వొద్దు. ఆ పేర్లు రిజిస్టర్ చెయ్యటానికి కొన్ని సంస్థలు ఆన్ లైన్ లో ఉంటాయి. “godaddy.com” అనేది అలాంటి ఒక డొమైన్ రిజిస్టర్ కంపెనీయే.

మరి వెబ్ సైట్ పేరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ,అలానే ఆ పేరు సెలెక్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన టిప్స్ నా తదుపరి ఆర్టికల్ లో చూద్దాం.

మీ డౌట్స్ గాని అభిప్రాయాలూ గాని కింద కామెంట్స్ లో తెలుపండి.

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here