సాఫ్ట్ వేర్ కి భిన్నమయిన ఈ తరం జాబులు.

0
OPPORTUNITIES OTHER THAN SOFTWARE JOBS

“తింటే గారేలే తినాలి,వింటే భారతమే వినాలి” అనేవారు పెద్దలు.దానికి కొనసాగింపుగా “చేస్తే సాఫ్ట్ వేర్ జాబు మాత్రమే  చెయ్యాలి” అంటున్నారు ఈ రోజుల్లో యువత.

కొంత మంది యువత సివిల్స్ , బ్యాంకు జాబ్,గ్రౌప్స్ లాంటి గవర్నమెంట్ ఉద్యోగాలపయిన మక్కువ చూపిస్తున్నారు. అయితే చాలా మంది మటుకు చేస్తే సాఫ్ట్ వేర్ జాబ్ మాత్రమే చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు.సాఫ్ట్ వేర్ జాబు రాకపోతే కాలిగా అయినా కూర్చుంటున్నారు గాని, ఇంకో కెరీర్ ఎంచుకోట్లేదు.

మనోళ్ళు అమెరికా వెళ్లి సూపర్ మార్కెట్ , పెట్రోల్ బంకులలో పని చేయటానికి రెడీ అవుతారు గాని, ఇక్కడ మాత్రం జాబ్ రాకపోతే బడి పంతులుగా ఉద్యోగం చేయటానికి కుడా వెనకాడుతారు.అయితే ఆ తప్పు యువతీ కాదు. ఈ సొసైటీది.

సాఫ్ట్ వేర్ జాబ్ చేసే వాడిని ఏదో పెద్ద సైంటిస్ట్ కంటే గొప్పగా చూస్తారు…అదే శాలరీ వచ్చే వేరే ఉద్యోగస్తుడిని మటుకు కరివేపాకులా తీసేస్తారు. మనోళ్ళకి లైఫ్ లో “షో ” కావాలి. అందుకే ఇక్కడ యువతకి మనసులో ఏదో ఒక జాబ్ చెయ్యాలి అని ఉన్నాగాని, ఇంట్లో వారికి, చుట్టాలకి,చుట్టుపక్కల వారికి భయపడి రూంలో కూర్చుని జాబు చేసి వచ్చిన తోటి రూం మేట్ కి వంట చేస్తూ కాలం గడుపుతున్నారు.

అయితే మారుతున్న రోజులు బట్టి కొత్త కొత్త జాబ్ లు కుడా పుట్టుకువస్తున్నాయి. కొన్నిటికి ఇప్పటికే మంచి డిమాండ్ ఉండగా, మరి కొన్ని పరుగులు పెట్టె దిశగా సాగుతున్నాయి. చదువు అయిపోయి, ఎక్కడ సాఫ్ట్ వేర్ జాబ్ రాలేదు అని బాధపడేకంటే , ఈ జాబ్ లపైన కుడా  ఒక లుక్కేయండి.

ఫుడ్ డెలివరీ ఎంప్లాయ్ : రోజుకొక ఫుడ్ డెలివరీ స్టార్ట్ అప్ లు పుట్టుకొస్తున్నాయి. ఆర్డర్ రాగానే కస్టమర్ కి వేడి వేడి ఆహరం అందజేయాలి.అందుకు డెలివరీ చేసే వారి మీదే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఒక్కప్పుడు పిజ్జా డెలివరీ చేసే వారిని తక్కువగా చూసేవారు గాని, ఇప్పుడు ఆ డెలివరీ జాబ్ అనేది చాలా కీలకంగా మారింది. దాని మీద ఒక కన్నేయండి.

ఈవెంట్ మేనేజర్ : వీకెండ్ అయితే కచ్చితంగా సిటీలో ఏరియాకోక స్టార్ట్ అప్ కంపెనీ ఈవెంట్ లు జరుగుతున్నాయి. ఆ ఈవెంట్లు నిర్వహించే వారి కోసం ఈ స్టార్ట్ అప్ కమ్యూనిటీ ఎదురుచూస్తుంది. కాలేజీలో ఈవెంట్లు నిర్వహించిన అనుభవం ఉంటె మాత్రం మీ పంట పండినట్టే.

సోషల్ మీడియా మేనేజ్మెంట్ : చిన్న మరియు పెద్ద కంపెనీలకు సోషల్ మీడియాలో తమ ఉనికి చాటుకోవటం పెద్ద తలనొప్పి వ్యవహారం. మీకు ఆ సబ్జెక్టు మీద ఐడియా ఉంటె వారి పేజిలని నిర్వహించే బాధ్యత తీసుకోండి.

లాజిస్టిక్స్ ఎంప్లాయ్ : ఈ రోజు ఈ-కామర్స్ బిజినెస్ అనేది పెద్ద ఆర్ధిక వ్యవస్థలా మారుతుంది. మరి వస్తువులు నిర్వహించటానికి , డెలివర్ చేయటానికి, తీరిగి ప్రధాన కంపెనీలకు రిటర్న్ చేయటానికి ….లాజిస్టిక్స్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. మరి వాటిలో చేరే యువత కోసం ఆ కంపెనీలు ఎదురుచూస్తున్నాయి.

కంటెంట్ రైటర్ : ఇంగ్లీష్ లో మంచి ఆర్టికల్ రాసే స్కిల్ ఉంటె మటుకు…సాఫ్ట్ వేర్ జాబ్ కుడా చాలదు. ఇప్పుడు ఇండియాలో కంటెంట్ రైటర్ల కి ఉన్న డిమాండ్ మాములుగా లేదు.ప్రతి కంపెనీకి, వెబ్ సైట్ కి , బ్లాగ్ కి ఆర్టికల్స్ అవసరమవుతున్నాయి.

జిం ఇన్స్ట్రక్టర్: ఈ రోజు అందరు కరిగిపోతున్న తమ హెల్త్ ని  కాపాడుకోటానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు.దాని కోసం ప్రతి వీధిలో ఒక జిం ఏర్పడింది.మీకు ఫిట్నెస్ మీద , ఈ ఇండస్ట్రీ మీద పట్టు ఉంటె…ఫుల్ టైం జాబ్ కి కుడా మంచి భరోసా ఉంది.

డాన్సు అసోసియేట్: కాలేజీ ఫంక్షన్ లలో ఇరగదీసే డాన్సు వేసారా? అయితే ఆలోచించక్కర్లేదు. మంచి డాన్సు ఇన్స్టిట్యూట్ లో అసోసియేట్ గా జాయిన్ అవ్వచ్చు. డాన్సు షోలు పెరుగుతున్న ఈ రోజుల్లో , డాన్సు నేర్పెవారికి మంచి డిమాండ్ ఉంది.

సబ్జెక్టు ట్రైనర్: ఇంటర్ లో , డిగ్రీలలో ఉన్నపుడు మనలో చాలా మంది Tutions చెప్పుకునే చదువు సాగించిన వారు ఉన్నారు. అయితే అవే Tutions తో ఫుల్ టైం మనీ బానే సంపాదించవచ్చు. సిటీలో Tutions కోసం ఎదురు చూసే జనాభా చాలామందే ఉన్నారు.

ల్యాబ్ ఇన్స్ట్రక్టర్:చాలా మంది వేల ఫిజులు కట్టి క్లాసులకు వెళ్తారు కాని, ల్యాబ్ వంక కన్నెత్తి చూడరు.మీరు కోర్స్ నేర్చుకున్న ఇన్స్టిట్యూట్ లోనే ల్యాబ్ ఇన్స్ట్రక్టర్ గా చేరే అవకాశాలు ఉంటాయి. పనికి పని, కనీస ఖర్చులకు డబ్బులు, వర్క్ చేసిన సర్టిఫికేట్ కుడా పొందచ్చు.

స్మార్ట్ డ్రైవర్ : ఈ మాట చెప్పగానే చిన్న చూపు చూడవద్దు. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కి తీసిపోని శాలరీలు వస్తున్నాయి కొంతమందికి. ఉబెర్ , ఓల లాంటి కంపెనీల రాకతో కొంతమంది కాబ్ ఓనర్లు కార్లు కొని వాటిని నడిపే వారి కోసం చూస్తున్నారు. వీరిలో కొంతమంది డ్రైవింగ్ చేసే వారిని శాలరీ పద్దతిలో నియమించుకుంటున్నారు.

ఈ జాబులు ఎక్కడ దొరుకుతాయి అని పాత చింతకాయ పచ్చడిలాంటి ప్రశ్నలు వద్దు. గూగుల్ ఉండగా దిగులు దండగ….గూగుల్ లో , ఫేస్ బుక్ లో వెతకండి.జాబ్ కొట్టేయండి.

Like smarttelugu at facebook.com/smartteluguofficial.

[wp-subscribe]

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here