ఈ-కామెర్స్ బిజినెస్ లో తెలియవలసిన 10 ముఖ్యమయిన విషయాలు.

1
10 IMPORTANT THINGS IN E-COMMERCE

రఘు బాబు కి ఆత్రం ఎక్కువ. ఒక పని చేసే ముందు ముందు వెనుకా ఆలోచించకుండా రంగంలోకి దూకేస్తాడు. అలాంటి రఘు బాబు కి ఒక ఉదయం బాత్ రూం లో కాలకృత్యాలు తీర్చుకుంటుండగా ఈ-కామెర్స్ బిజినెస్ ఐడియా తట్టింది.
ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న “కబాలి సినిమా” రిలీజ్ డేట్ ప్రత్యేకంగా తనకి మాత్రమే తెలిసినట్టుగా ఆనందంగా గంతులేసాడు.అసలే మనోడికి ఆత్రం ఎక్కువ, దానికి తోడు  ఆలోచన వచ్చింది….ఇక ఆగుతాడా ? “ఆగడు ” సినిమా టైటిల్ సాంగ్ పాడుకుంటూ రంగంలోకి దూకాడు.

“ఎలా చేస్తావు రా ! నీకు ఇదివరకు దీని మీద అనుభవం లేదు గా” అని అడిగాడు రఘబాబు స్నేహితుడు
” ఈ-కామెర్స్ బిజినెస్ ఏముంది రా ! మన దగ్గర మనీ ఉంటే చాలు. డబ్బు పెట్టి మంచి వెబ్ సైట్ పెట్టుకుంటాము, మార్కెటింగ్ చేసుకుంటాము. దీనికి అనుభవం తో పని ఏముంది?  ఆలోచన ఉన్నవాడికి అనుభవంతో పని లేదు ” అని ఒక పంచ్ డైలాగ్ కొట్టాడు.

మంచి కంపెనీ కి డబ్బులు ఇచ్చి ఈ-కామెర్స్ వెబ్ సైట్ తయారుచేయించాడు. మంచి మూహూర్తం చూసి ఆన్ లైన్ లో బిజినెస్ స్టార్ట్ చేసాడు. ఒక వారం తరువాత మనోడికి అసలు సినిమా కనపడటం మొదలయింది.ఈ-కామెర్స్ బిజినెస్ లో నేర్చుకోవాలిసింది చాలా ఉంది అని అప్పుడు అర్ధమయింది.

మనలో రఘు బాబు లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఆలోచన రాగానే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఏ-కామెర్స్ బిజినెస్ మనం అనుకునే దాని కంటే చాలా కష్టంగా ఉంటుంది.

అందుకే…ఈ-కామెర్స్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మనకి తెలియాల్సిన 10 ముఖ్యమయిన విషయాలు మన స్మార్ట్ తెలుగు రీడర్ల కోసం.

కస్టమర్ ప్రోబ్లం:

మన వచ్చిన ఐడియా గొప్పదే…అది మనకి, మన ఫ్రెండ్స్ కి బానే ఉంటుంది. కానీ నిజంగా మన ఐడియా, మనం టార్గెట్ చేసిన కస్టమర్ ప్రోబ్లం ని నివారిస్తుందా అనేది చెక్ చేసుకోవాలి.

నేరుగా కలవండి :

రీసెర్చ్ అంటే చాలా మంది ఇంటర్నెట్ లో మొత్తం వెతికి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అది తప్పు. మీరు టార్గెట్ చేసిన మార్కెట్ లోని కంపెనీలను, కస్టమర్ లను నేరుగా కలవండి. వారి దగ్గర నుండి ఇన్ఫోర్మషన్ తీసుకోండి.

మార్కెటింగ్ ప్లాన్ :

ఈ రోజు మార్కెటింగ్ అంటే డబ్బు పెడితే దొరికే వస్తువులా చాలా మంది చూస్తున్నారు. బిజినెస్ లో అన్నిటికంటే కష్టమయిన పనే…మార్కెటింగ్. ఆ ప్లాన్ పక్కాగా ఉంటనే సెల్స్ బాగుంటాయి. టెక్నాలజీ మీద పెట్టె దృష్టి కి పదింతలు మార్కెటింగ్ మీద పెట్టండి.

వస్తువుల డెలివరీ :

చాలా ఈ-కామెర్స్ బిజినెస్లు ఎదురుకుంటున్న పెద్ద ప్రాబ్లమ్ ఇదే. సరయిన టైం లో డెలివరీ చేసే వ్యక్తులు, సంస్థలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ-కామెర్స్ బిజినెస్ కి డెలివరీ అనేది ఆయువు పట్టు లాంటిది. మీరు బిజినెస్ మొదలుపెట్టే ముందే దీని మీదే ప్లాన్ వేసుకోండి.

కంపెనీ నిర్వహణ :

బిజినెస్ మొదలుపెట్టే ఆత్రంలో చాలా మంది దీని గురించి ఆలోచించట్లేదు. బిజినెస్ చేయటానికి ఏదో ఒక కంపెనీ అవసరం కాబట్టి….పేరుకి ఏదో ఒకటి నడిపించేస్తున్నారు.కానీ కంపెనీ రెజిస్ట్రేషన్ లు ,నిర్వహణ చాలా ముఖ్యం.

టాక్స్ ల గురించి :

సగటు మనిషికి అర్ధం కానీ సబ్జెక్టు ఇది. కానీ ఆన్ లైన్ బిజినెస్ కోసం దీని గురించి బాగా తెలుసుకోవాలి. లాభ నష్టాలు, కంపెనీ ఆస్తులు, అప్పులు, పెట్టుబడులు…బిజినెస్ నిర్వహణ వ్యయాలు అన్ని దీనితోనే ముడి ఉన్నాయి.

లీడర్ షిప్ :

డబ్బు, తెలివి ఉన్నంత మాత్రాన బిజినెస్ లో విజయం సాధించలేము. అది కూడా ఈ రోజుల్లో ఇంకా కష్టం. ఒక టీం ని ముందుకు నడిపే నాయకత్వ లక్షణాలు అవసరం. ఆ లక్షణాలు అలవర్చుకోవాలి.

టెక్నాలజీ :

టెక్నాలజీ గురించి అందరికి తెలియదు. కానీ ఈ-కామెర్స్ బిజినెస్ లో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. అందుకే, లోపల ఉండే సబ్జెక్టు తెలియక పోయినా గాని దాని గురించి కొన్ని ప్రాధమిక విషయాలు తెలుసుకోవాలి . బయట టెక్నాలజీ పరంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనే విషయాల పైన అవగాహన ఉండాలి.

ఆన్ లైన్ మార్కెటింగ్ :

టెక్నాలజీ కేవలం ప్రోగ్రామింగ్ కె పరిమితం కాలేదు. ఆన్ లైన్ మార్కెటింగ్ అంటూ కొత్త డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. దీని గురించి కూడా అవగాహన పెంచుకోవటం చాలా ముఖ్యం.

కస్టమర్ సపోర్ట్ :

మనం బిజినెస్ విజయం అనేది ఎప్పుడు కస్టమర్ తృప్తి మీదే ఆధారపడి ఉంది. అందుకే కస్టమర్ సపోర్ట్ ముందే ప్లాన్ చేయండి. దానికి అవసరమయిన మానవ వనరులు, టెక్నాలజీ మీద పెట్టుబడి పెట్టండి.

మరి ఈ విషయాల పైన అవగాహన పెంచుకొని మీ ఈ-కామెర్స్ బిజినెస్ ని విజయవంతం చేసుకోండి.

Comment using Facebook for quick reply

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here