ఆన్ లైన్ ట్రైనింగ్ తో ఆన్ లైన్ మనీ కోసం టాప్ 3 websites

1
MONEY WITH ONLINE TRAINING

మీరు స్కూల్ సబ్జెక్టు చెప్పే టీచర్ అయినా , కాలేజీ సబ్జెక్టు వివరించే మాస్టారు అయినా, ఐ.టి కోర్స్ అంతు చూసే కార్పొరేట్  ట్రైనర్ అయినా …ఆన్ లైన్ లో ట్రైనింగ్ ద్వారా మనీ సంపాదించాలి అనుకుంటే ఈ వెబ్ సైట్ల మీద ఒక లుక్కేయండి.

ప్రతి సైట్ లోను దాదాపు ఒకటే పద్ధతి…

  • మీరు మీ ప్రొఫైల్ తో రిజిస్టర్ అవుతారు.
  • ఆ వెబ్ సైట్ నిర్వాహకులకు నెల వారి కొంత మనీ (ఎంచుకున్న Package బట్టి )చెల్లిస్తారు.
  • మీకు “ట్రైనింగ్ క్వరీ”, అంటే స్టూడెంట్ నుండి ట్రైనింగ్ కావాలి అని మీ ప్రొఫైల్ కి రిక్వెస్ట్ వస్తుంది.
  • మీరు ప్రీమియం సభ్యులు అయితే…మీరే డైరెక్ట్ గా స్టూడెంట్ ఫోన్ నెంబర్ చూసి కాల్ చెయ్యొచ్చు.
  • ఒక వేళ మీరు ఫ్రీ సర్వీస్ మాత్రమే ఎంచుకుంటే, ప్రొఫైల్ మాత్రమే పెట్టుకోగలరు. స్టూడెంట్ కి మీ ప్రొఫైల్ నచ్చి తనంతట తాను కాల్ చేసే వరకు మీరు స్టూడెంట్ ని కాంటాక్ట్ చేయలేరు.
  • స్టూడెంట్ మీతో మాట్లాడిన తరువాత మీ ఫిజు ,మీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ నచ్చితే ఆన్ లైన్లో క్లాసు చెప్పించుకుంటాడు. మీరు డైరెక్ట్ గా మనీ స్టూడెంట్ దగ్గర నుండి తీసుకోవచ్చు.

ఒక్క అర్బన్ ప్రో వెబ్ సైట్ ద్వారా మాత్రం చాలా రోజులు ఆన్ లైన్ ట్రైనింగ్ ఇచ్చాను.మిగిలిన వాటి గురించి  నేను వినటమే కాని…..ప్రత్యేకంగా ఆ వెబ్ సైట్ ల పని తీరు అనుభవం లేదు. కాని ఈ వెబ్ సైట్లు ఇండియా పరంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు ఉన్న సర్వీసెస్.

MONEY WITH ONLINE TRAINING

UrbanPro.com

ఇండియాలో బాగా పాపులర్ అయిన ట్రైనింగ్ వెబ్ సైట్ . స్కూల్, కాలేజీ  సబ్జెక్టు లు మాత్రమే కాదు, డాన్సు , మ్యూజిక్ లాంటి కళలు, ఐ.టి కోర్స్లు  కుడా దీని ద్వారా మీరు చెప్పొచ్చు.

రెండేళ్ళ క్రితం ఈ వెబ్ సైట్ ద్వారా నేను one year  SEO సబ్జెక్టు ట్రైనింగ్ ఇచ్చాను.అప్పటికి ఇప్పటికి వెబ్ సైట్ చాలా మారిపోయింది.

దీనిలో నెల వారి మీరు కొంత మనీ subscription Fee కింద కట్టాలి.మొదట్లో కొద్దిగా తక్కువ మనీ వస్తాయి. క్రమ క్రమంగా మీకు పేరు, మీ ప్రొఫైల్ మీద స్టూడెంట్స్ కి నమ్మకం వచ్చాక మీకు ట్రైనింగ్లు  పెరుగుతాయి.

MyPrivateTutor.com

ఇండియాలో పాపులర్ అయిన ఇంకో సర్వీస్ ఇది. చాలా వరకు ఈ వెబ్ సైట్ కుడా లానే వర్క్ చేస్తుంది.

ప్రస్తుతం స్కూల్ కాలేజీ సబ్జెక్టు ల మీద ట్రైనింగ్ ఎక్కువగా నడుస్తున్నాయి.

ఐ.టి ట్రైనింగ్ అనేది ఇప్పుడిప్పుడే మొదలు అయ్యింది.జావా ,డాట్ నెట్ లాంటి కోర్స్లు ట్రైన్ చేయాలి అనుకుంటే దీనిలో చేరవచ్చు.

TutorVista.com

ప్రపంచ వ్యాప్తంగా పేరున్న వెబ్ సైట్.అయితే దీనిలో మీరు ఎప్పుడు పడితే అప్పుడు క్లాసు లు చెప్పటానికి లేదు. ఆ వెబ్ సైట్ వారు మీకు టైమింగ్ ఇస్తారు. ఆ టైం లో మీరు క్లాసు లు చెప్పాలి.

మీకు ఇంగ్లీష్ ,  లెక్కలు, ఫిజిక్స్,కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టు లు చెప్పే సత్తా ఉంటె…ఈ వెబ్ సైట్ ద్వారా అమెరికా మరియు విదేశాల దేశ స్టూడెంట్స్ కి ఆన్ లైన్ లో నే క్లాసులు చెప్పొచ్చు.

ఇది ఒక రకంగా జాబ్ లానే ఉంటుంది.దీనిలో మీరు రిజిస్టర్ అయితే…మీకు ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ జరుగుతుంది.

మీ టైం బట్టి కనీసం  4 గంటలు వ్యవధి నుండి నుండి 9 గంటలు క్లాస్ లు చెప్పాలి. మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైం అని ఎంచుకున్న ఆప్షన్  మీద  మీకు దీనిలో  పని గంటలు నిర్ణయిస్తారు .

అయితే దీనిలో చేరటానికి మనీ కట్టవలసిన అవసరం ఉందా,లేదా ? దీనిలో మనీ ఎలా ఇస్తారు అనేది నాకు కుడా తెలియదు.రీడర్స్ ఎవరయినా ఈ సర్వీస్ ఇదివరకు వాడి ఉంటె, మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి.

ఈ లాంటి మరి కొన్ని ఆన్ లైన్ మనీ ఆర్టికల్స్ కోసం ఫేస్ బుక్ పేజి LIKE చెయ్యండి.

ఆర్టికల్స్ Free గా మీ ఈమెయిలు కి చేరాలి అంటే ఈ కింద బాక్స్ లో మీ ఈ-మెయిల్ ఐ.డి, పేరు ఇవ్వండి.

[wp-subscribe]

Comment using Facebook for quick reply

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here