స్టూడెంట్స్ కోసం 5 జిమెయిల్ టిప్స్

5 GMAIL TIPS FOR STUDENTS

మనకు అందుబాటులో ఉన్న మెయిలింగ్ సర్వీస్ లన్నింటిలోనూ జిమెయిల్ టాప్ అని వేరేగా చెప్పవలసిన పని లేదు. యూసర్ల సౌకర్యార్ధం దీనిలో అనేక రకాలైన ఆప్షన్ లను అలాగే టూల్స్ ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది.

అయితే దాని యొక్క ఎంతో ఉపయోగకరమైన ఉత్పాదకతను అందించే ఫీచర్లను గురించి చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. బేసిక్ ఫీచర్లతో జిమెయిల్ ను వినియోగించడం మాత్రమే కాకుండా దానిలోని అనేక ఉపయోగకర ఫీచర్ల సహాయంతో మీ జీవితాన్ని ఎంతో సుఖప్రదం చేసుకునే వీలు కలుగుతుంది.

Gmail లో మీ ఎక్స్పీరియన్స్ ను మరింత మెరుగు పరుచుకోవడానికి, తమ రోజువారి జీవితాన్ని సులభతరం చేసుకోవడానికి కాలేజీ స్టూడెంట్ల కోసం వారికి ఉపయోగపడే కొన్ని ఉపయోగకరమైన టిప్స్ ను ఇప్పుడు తెలుసుకుందాము.

ఈ మెయిల్లను పంపించడం రిసీవ్ చేసుకోవడంలో అనుసరించవలసిన కొన్ని మెళకువలు ఆ పనిని ఎంతో సునాయాసంగా చేయగలిగేలా చేస్తాయి, ఈ మెళకువలు మీ మెయిలింగ్ పద్ధతిని విధానాన్ని కూడా మెరుగుపరుస్తాయి. గనుక తప్పక గమనించగలరు.

  • ఒక్కోసారి ఎంతో ఆత్రుతతో ఏం మెయిల్ అది ఎవరి నుంచి వచ్చింది అనే ఉత్సాహంతో మెయిల్ ను ఓపెన్ చేసినప్పుడు తెలుసుతుంది అది మనకు అంత ముఖ్యం ఎం కాదని, అటువంటప్పుడు సమయం వృధా అవ్వడం మాత్రమే కాకుండా మైండ్ కూడా distract అవుతుంది. అలా మీరు పెద్దగా ఇంపార్టెంట్ కావు అని అనుకునే మెయిల్స్ ను మీ inbox లోకి రానియ్యకుండా, తద్వారా మీకు నోటిఫికేషన్ ద్వారా disturbance ఉండకుండా మీరు mute అనే ఒక సింపుల్ ఆప్షన్ వాడటం ద్వారా అటువంటి distraction ల నుండి విముక్తి పొందగలరు.
  • మీరు organize చేస్తున్న లేదా ఇస్తున్న ఏదైనా ఒక చిన్న పార్టీ కో లేదా మరేదైనా ఒక మీటింగ్ కో ఆహ్వానాలను పంపటానికి మీకు Outlook ఏ మాత్రం అవసరం లేదు. Gmail లో కూడా అటువంటి ఒక ఫీచర్ ఉంది. కొత్త మెయిల్ ను కంపోసే చేసే సమయంలో Add Event Invitation అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీరు ఏదైనా ప్రత్యేక విశేషం దృష్ట్యా మీ కాంటాక్ట్ లిస్టు లో వారందికి invitation లను పంపగలరు.
  • Gmail ను మీరు కేవలం మెయిలింగ్ సర్వీస్ గా మాత్రమే వాడుతున్నారా! అయితే మీకు ఒక ఉపయోగకరమైన టిప్. Gmail ని మీరు Notepad లాగా కూడా వినియోగించుకోవచ్చును. మీరు జిమెయిల్ లో ఉన్నప్పుడు ఏదైనా రాయవలసిన అవసరం ఏర్పడితే దాని కోసం మీరు ప్రత్యేకంగా Notepad లేదా Wordpad లను గురించి వెతుక్కోవలసిన అవసరం ఎంత మాత్రము లేదు. ఒక కొత్త మెయిల్ ను కంపోసే చేసే మాదిరిగా మెయిల్ బాక్స్ ను ఓపెన్ చేసి టైపు చెయ్యండి Gmail దానిని డ్రాఫ్ట్ రూపంలో సేవ్ చేస్తుంది.
  • Gmail లో పైన కనిపించే వెబ్ క్లిప్ లను సైతం మీరు మీ ఇష్టానుసారం customize చేసుకోవచ్చును. Gmail సెట్టింగ్స్ మెనూలోకి వెళ్ళటం ద్వారా ఈ ఆప్షన్ మీకు లభిస్తుంది అక్కడ మీరు మీ ఇష్టాలు, అభిరుచులు ఆధారంగా ఎటువంటి యాడ్లను చూడాలనుకుంటున్నారు సెట్ చేసుకోవచ్చు.
  • Contact లిస్టులో వారిని గ్రూప్ లలో విభిజించి సేవ్ చేసుకొనే సదుపాయాన్ని సైతం Gmail కలుగ చేస్తుంది, ఈ ఫీచర్ ను ఉపయోగించుకొని మీరు పంపదలచుకొన్న మెయిల్లను ఒకే సమయంలో మీ ఆఫీస్ కోలీగ్స్ కి, లేదా స్నేహితులకు, లేదా కుటుంబ సభ్యలకు పంపించవచ్చును.

Gmail ను వాడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది కానీ తెలివిగా వాడేవారి సంఖ్య తక్కువే, కనుక మీరు తెలివిగా వాడుతున్నారో లేదో మీరే నిర్ణయించుకోండి.

*************************************************************************************************************************************

Telugu Video Course on Blogging “How to start a Blog “

బ్లాగింగ్ అనేది ఒకప్పుడు సరదా … ఇప్పుడు బతుకు తెరువు చూపించే ఒక డిజిటల్ మార్గం. మరి బ్లాగ్ స్టార్ట్ చెయ్యాలి అంటే ఎలా ?కోడింగ్ తో పని లేకుండా బ్లాగ్ ఎలా రూపొందించాలి ?బ్లాగ్ లో మనకి ఉపయోగపడే మంచి plugins ఏంటి ? ….

ఇలా బ్లాగ్ గురించి ప్రాక్టికల్ గా వివరిస్తూ నేను చెప్పిన వీడియో కోర్స్ ఆన్ లైన్ లో ఉంది . ఈ లింక్ లో క్లిక్ చేసి కోర్స్ లో చేరితే రిజిస్ట్రేషన్ వివరాలు మీ Email కి వస్తాయి. ఆ వివరాలతో వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి ఎప్పుడు కావలి అంటే అప్పుడు కోర్స్ చూసుకోవచ్చు.

కోర్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here