డబ్బే రాజు అనే వాక్యాన్ని మనందరం ఎప్పుడూ వింటూనే ఉంటాం. కాని దానికి అసలైన అర్ధం ఏంటో మీకు తెలుసా?
నిజానికి డబ్బు అంటే బిల్స్ లేదా coins కాదు, ఆ రోజుకు మీ బ్యాంకు అకౌంట్ లో మీకు ఖర్చుపెట్టుకోవడానికి అందుబాటులో ఉన్న మొత్తం. ప్రతి బిజినెస్ కు అవసరమైన అత్యంత ముఖ్యమైన వనరులలో డబ్బు కూడా ఒకటి.

మీకు బ్యాంకులో డబ్బు ఉండడం అవసరం:

బిజినెస్ కు డబ్బులతో వచ్చిన చిక్కు మనం డబ్బులను చాలా ఈజీ గా తీసుకుంటాము. ప్రతీ వారు లాభాలు రావాలనే ఆశిస్తారు, కాని డబ్బులను మాత్రం ఎదేచ్చగా ఖర్చు చేస్తారు. అక్కడ చాలా మంది లాభం మరియు నగదు రెండు వేరు వేరు విషయాలు అనే విషయాన్ని గ్రహించారు.
లాభం అనేది ఎకౌంటు పధ్ధతిలో ఒక భావన. ఇది అకౌంటింగ్ లోని అమ్మకాలు, ఖర్చులు లాంటి అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఇక కాష్ అనగా మనం బిల్లులను చెల్లించడానికి ఉపయోగించే మొత్తం.

ఈ నగదు అనే భావన కాస్త క్లిష్టమైనది. మీరే ఒక కొత్త బిజినెస్ ను ప్రారంభిస్తూ ఉన్నట్లైతే, మీరు మీ బిజినెస్ కు సంబందించిన వస్తు సేవలను తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఆ వస్తువును, లేదా సేవను ఎంత మొత్తానికి అమ్మగలరు, మీకు ఎంత లాభం వస్తుంది అనే అంశాలను గురించి తప్పక ఆలోచిస్తారు. బిజినెస్ లో ప్రతి ఒక్కరు అలానే లాభాలను గురించి ఆలోచిస్తారు, అది సహజం.

బిజినెస్ లో ఖర్చు పెట్టేవి లాభాలు కావు, డబ్బులు అనేది ప్రతి ఒక్కరు గ్రహించవలసిన విషయం. చాలా బిజినెస్ లు ఆస్థుల రూపంలో డబ్బులను దాచిపెడుతూ ఉండడం వలన, ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక సమస్యలలో చిక్కు కుంటాయి. వర్కింగ్ కాపిటల్ అనేది పర్తి బిజినెస్ లో చాలా ముఖ్యం.

నగదుకు లాభాలు హామీని ఇవ్వవు:

కాష్ ఫ్లో అనేది చాలా వరకు బిజినెస్ యొక్క పద్దతుల పైన ఆధారపడి ఉంటుంది.
వస్తువులతో బిజినెస్ చేసే బిజినెస్ లు తమ inventory లో నగదు ప్రభావాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది, అదే సేవ చేసే ఉద్దేశంతో బిజినెస్ లు అలాంటిదేమీ చెయ్యనక్కర్లేదు.
కనుక మీ బిజినెస్ లోకి నగదు flow మీ ఇండస్ట్రీ లోని పద్దతులపైన ఆధారపడుతుంది కాని మీరు ఎంత లాభం ఆర్జించారు అనే విషయం పైన కాదు.

చెల్లింపులను పొందేందుకు ఎదురు చూడటం:

బిజినెస్ కి మరియు బిజినెస్ కి జరిగే లావాదేవీలలో సాధారణంగా ముందు వస్తు సేవలను పొందిన తరువాత డబ్బులను చెల్లిస్తారు. చాలా సార్లు లావాదేవీలు జరిగిన సమయంలో ఇన్వాయిస్ పుస్తకాలలో నమోదు చెయ్యటం జరుగుతుంది కాని నిజానికి ఆ డబ్బు ఇంకా బ్యాంకు లో చేరి ఉండదు.

అలాంటి సందర్భాలలో కాస్త లాభాలలో ఉన్న బిజినెస్ లు తట్టుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. అమ్మకాలలో చూపబడి, ఇంకా నగదు గా మీ బ్యాంకు లో చేరని లావాదేవీలను లాభాలు కలిగిన బిజినెస్ లే అలాంటి సమయాల్లో అపజయాలను తట్టుకోగలవు.
కాబట్టి, చివరిగా బిజినెస్ చేసే ప్రతీ వారు గుర్తుంచుకోవలసిన అంశం. లాభాలను గురించి మాత్రమే ఆలోచించక నగదు flow మీద కూడా ద్రుశితిని సారించాలి.

 

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

Read Online Business Updates, Startup news in your E-mail

You have Successfully Subscribed!