బిజినెస్ నడపటానికి అవసరమయ్యే కొన్ని ముఖ్యమైన అప్లికేషన్లు

0
Important applications to business management

బిజినెస్ ను నడపటం అనేది పార్కులో నడిచినంత సులభమైన విషయం ఏమీ కాదు. కాని నేటి టెక్నాలజీ పుణ్యమా అని ఆ పని కాస్త సులభం అయ్యినదనే చెప్పాలి.

బిజినెస్ ఓనర్ గా లేదా entrepreneur గా మీ పనిని సులభతరం చేసేందుకు నేటి కాలంలో అనేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి.  ఇలా అందుబాటులో ఉన్నా modern టెక్నాలజీ ని వినియోగించుకొని మీకు అవసరం ఉన్నంతవరకు మీ బిజినెస్ కు సంబందించిన పనులను మరియు భాద్యతలను ఔట్ సోర్సింగ్ ద్వారా స్ట్రీమ్ లైన్ చెయ్యవచ్చును. మీ బిజినెస్ లోని ఉద్యోగులను మేనేజ్ చెయ్యటం దగ్గర నుంచి ట్రావెల్ అవసరాల కోసం బుకింగ్ లు చెయ్యటం అలాగే మీ బిజినెస్ ఖర్చులను ట్రాక్ చెయ్యటం వరకు అన్ని రకాలైన బిజినెస్ పనుల కోసం అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి.

అలా బిజినెస్ ను నడపటం కోసం తప్పనిసరిగా అవసరమైన కొన్ని అప్లికేషన్లను గురించి ఈరోజు తెలుసుకుందాం.

https://www.fullcontact.com/

ఒక బిజినెస్ ను నడుపుతున్న వ్యక్తి గా మీకు కస్టమర్ల దగ్గర నుండి కొలీగ్ల వరకు చాలా మంది కాంటాక్ట్ లు అవసరం అవుతాయి అయితే వాటన్నింటిని మేనేజ్ చెయ్యడం అనేది మీకు కాస్త కష్టమైన పని అవుతుంది. మీ device లో ఉన్నా సాధారణ కాంటాక్ట్స్ మేనేజర్ తో పనిని కానిస్తూ కష్టపడే కంటే ఈ FullContact అప్లికేషన్ మీ కష్టాన్ని అది పడి మీకు కాంటాక్ట్ లను మేనేజ్ చెయ్యడంలో సహకరిస్తుంది. మీరు ఇచ్చిన సాధారణ సమాచారం ఆధారంగా కాంటాక్ట్ లకు పూర్తి ప్రోఫైల్లను రూపొందిస్తుంది. మీరు కాంటాక్ట్ లను category లుగా విభజించుకోవచ్చు.

https://wire.com/en/

టెక్నాలజీని అయితే అందిపుచ్చుకోగాలుగుతున్నాం  కాని ఈ హాకింగ్ లను సెక్యూరిటీ breach లను ఆపలేకపోతున్నాం. కాని ఒక బిజినెస్ యజమానిగా మీ బిజినెస్ పట్ల శ్రద్ధ ఉన్నా వ్యక్తిగా మీ బిజినెస్ కోసం మరియు దాని సురక్షిత కోసం మీ టీం సభ్యుల మధ్య సంభాషణల కోసం Wire అప్లికేషన్ కాల్స్ చేసుకోవడం కోసం, టెక్స్ట్ మెసేజ్ లను పంపించుకోవడం కోసం, అలాగే ఫోటోలను మరియు వీడియోలను ఒకరితో మరొకరు పంచుకోవడం కోసం ఒక మంచి app కనుక దీనిని ఉపయోగించవచ్చును. ఇది ఎండ్ to ఎండ్ encrypt అయినందున పూర్తి సురక్షితం.

https://www.pleo.io/

ఒక సంస్థగా ఖర్చులను ట్రాక్ చెయ్యడం అనేది మీ సంస్థ మంచికే ఉపయోగపడుతుంది. అలా ఖర్చులను ట్రాక్ చెయ్యడం కోసం బిజినెస్ లకు ఎంతో ఉపయోగపడే ఒక ఆప్ ఏ ఈ Pleo. రశీదులను document చెయ్యటం, పేపర్ వర్క్ ను పూర్తి చెయ్యటం, వంటి పనులు కాస్త కష్టమైన వాటి క్రిందనే భావించాలి. కాని ఈ Pleo ఆప్ మీకు ఈ విషయాలన్నింటిలోను మీకు సహాయపడుతుంది. అలాగే ఖర్చులకు సంబందించిన రిపోర్ట్ ను కూడా కంపెనీ ను అందచేసి కంపెనీ లేదా బిజినెస్ ఖర్చులను తగ్గించుకునేందుకు తోడ్పడుతుంది.

https://appear.in/

రిమోట్ గా వర్క్ చెయ్యడం అనేది నేటి రోజుల్లో చాలా సాధారణం అయ్యిపోయింది. కాని అలా ఉన్నప్పుడు బిజినెస్ లకు కాస్త కష్టమైనా పని వారి ఉద్యోగులను అందరిని ఒక తాటి పైకి తీసుకొనిరావటం. అయితే ఈ Appear వంటి అప్లికేషన్లు బిజినెస్ లకు ఆ విషయంలో సహకరించి తమ పనిని సులభం చేస్తాయి. 12 మంది వరకు సభ్యులతో ఒకే సమయంలో వీడియో conference చేసేందుకు ఈ ఆప్ అనుకరిస్తుంది. కాబట్టి వారి మంది కమ్యూనికేషన్ అనేది పెద్ద సమస్య కాదు.

https://tryshift.com/

బిజినెస్ కు సంబంధించి మీ ఒకటి కంటే ఎక్కువ మెయిల్ లు ఉన్నప్పుడు ప్రతిసారి ఒక దానిలో లాగ్ ఇన్ అయ్యి దానిలో పని అయిపోయిన తరువాత మరలా వేరొక మెయిల్ లోకి లాగిన్ అవ్వడం అనేటువంటిది కాస్త చికాకుతో కూడుకున్న పని. ఈ Shift ఆప్ మీకు సరిగ్గా అదే విషయంలో సహకరిస్తుంది. ఇది కేవలం ఈ మెయిల్స్ మధ్య స్విచ్ అయ్యేందుకు మాత్రమే కాకుండా మీ డెస్క్ టాప్ ను సరిగ్గా organize చేసుకునేందుకు ఇది ఒక మంచి option. ప్రతి సారి మీ ఇన్బాక్స్ లను చెక్ చేసుకోవలసిన అవసరం లేకుండా మీకు ఎప్పటికప్పుడు నోటిఫీకేషన్లను పంపిస్తుంది.

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here