నెట్ లో ఏదయినా సరే ఈ పాకెట్ లో పడేయండి

0
POCKET

రాత్రి 2 అయింది. వాసు ఇంటర్నెట్ తో కుస్తీ పడుతున్నాడు. మార్నింగ్ ఆఫీసు లో మీటింగ్ లో డిస్కస్ చేయటానికి మంచి ఆర్టికల్స్ వెతుకుతున్నాడు. ఒక గంట సోదించిన తర్వాత మంచి వీడియోలు ,ఆర్టికల్స్ దొరికాయి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తన కొడుకు దగ్గర ఉన్న pendrive లో కాపీ చేసుకున్నాడు. తెల్లారి ఆఫీసు లో ఆ వీడియోలు ,ఆర్టికల్స్ చూపిస్తే తనకి వచ్చే అభినందనలు తలుచుకుంటూ పోడుకున్నాడు .

పొద్దునే 8.30 …టక్కున నిద్రలేచాడు వాసు, టైం చూసి తన భార్య మీద ఇంతేతున్న లేచాడు, ఏదో లేట్ గా పోడుకున్నారుగా అందుకే లేపలేదు అంది భార్య. హడావిడిగా రెడీ అయిపోయి ఆఫీసు కి పరిగెత్తాడు వాసు. ఆఫీసు కి వెళ్ళే సరికి ఇంకా బాస్,తన టీం వాళ్ళు రాలేదు. హమ్మయా అనుకుని పక్క సీట్ లో వాడితో సొల్లు మొదలుపెట్టాడు వాసు.

 

ఇంతలో బాస్ ,మిగిలిన టీం మెంబెర్స్ వచ్చారు, మీటింగ్ స్టార్ట్ అయింది, మీగిలిన వాళ్ళు తమ డేటా చూపిస్తున్నారు, పిచ్చోలు ఎంత చూపిచ్చినా బాస్ కి నేను కాపీ చేసుకున్న డేటా చూపిస్తే వాళ్ళ కంటే నాకే ఎక్కువ మార్కులు పడతాయి అనుకుంటూ జేబులో చెయ్యి పెట్టుకున్నాడు వాసు, అంతే గుండె జారి గల్లంతయింది, పెన్ డ్రైవ్ లేదు . అప్పుడు గుర్తోచింది తను హడావిడి లో pendrive మర్చిపోయాడు.

 

 

ఇంతలో బాస్ కమాన్ వాసు అన్నాడు, ఏదో తనకి గుర్తున్న రొండు మూడు ఆర్టికల్స్ చూపించాడు. కాని టీం వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఏ మాత్రం ఉపయోగంగా అనిపియ్యలేదు. రాత్రి తను అంత కష్టపడింది వేస్ట్ అయింది అని వాసు చాలా ఫీల్ అయ్యాడు.

ఇంతలో వేణు వచ్చాడు. ఏంటి వాసు సంగతి అలా ఉన్నావ్ అన్నాడు, వాసు జరిగిందంతా చెప్పాడు. అరె అయితే నీకు Pocket గురుంచి తెలియదా అన్నాడు వేణు , వెంటనే వాసు తన షర్టు పాకెట్ చూసాడు.

బాబు వాసు పాకెట్ అంటే ఇది కాదు , పాకెట్ ఒక స్మార్ట్ ఆప్ .ఈ ఆప్ ద్వారా మనం నెట్ లో మనకి నచ్చిన ఆర్టికల్స్, ఫోటోలు , వీడియోలు ఏదయినా బుక్ మార్క్ (బుక్ మార్క్ అంటే మనకి నచ్చిన వెబ్ పేజి ని మన కంప్యూటర్ బ్రౌజరు విండో లో దాచుకోవటం )  చేసుకోవచ్చు(ఈ కింద ఫోటో లో చూపిన విధంగా). మనకి కావాల్సి వచ్చినప్పుడు చూసుకోవచ్చు.

Pocket app

 

అయితే మామూలు బుక్ మార్క్ కి దీనికి తేడా ఏంటి అంటే ,మామూలు బుక్ మార్క్ నీ కంప్యూటర్ లో మాత్రమే ఉంటది. నువ్వు దాచుకున్న డేటా చూడాలంటే నీ కంప్యూటర్ బ్రౌజరు విండో లో మాత్రమే చూడగలవు,కాని ఈ pocket ఆప్ లో దాచుకున్నవి ఎప్పుడయినా ఎక్కడయినా చూసుకొవ్వచు .

ఎక్కడయినా అంటే లాప్ టాప్ లో, కంప్యూటర్ లో, మొబైల్ లో , టాబ్లెట్ లో దేని లో అయిన సరే . అంటే నీకు ఒక మంచి ఆర్టికల్ లో ,వీడియో నో కనపడింది. కాని ఆ టైం లో దానిని చూడటం నీకు కుదరదు, అప్పుడు ఈ ఆప్ లో సేవ్ చేసుకుంటే ఎప్పుడయినా ,ఎక్కడయినా మళ్ళి దానిని ఓపెన్ చేసి చూసుకోవచ్చు.

ముందు https://getpocket.com వెళ్ళు.

దాని లో నీ పేరు, మెయిల్ వివరాలు ఇచ్చి రిజిస్టర్ అవ్వు. నువ్వు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తావో దానితోనే ఎక్కడయినా లాగిన్ అవ్వాలి.
తర్వాత రెండు విధాలుగా డేటా సేవ్ చేసుకోవచ్చు. నీకు నచిన వీడియో,ఆడియో ,ఫోటో,ఆర్టికల్ వెబ్ పేజి లింక్ కాపీ చేసుకొని ఈ ఆప్ లో సేవ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ అప్లికేషను వాళ్ళు ఒక plugin ఇస్తారు , దానిని నీ కంప్యూటర్ బ్రౌజరు విండో లో యాడ్ చేసుకుంటే , ఇక నీకు కావాల్సిన పేజి కి వెళ్ళినప్పుడు సింపుల్ గా ఆ బటను  మీద క్లిక్ చేస్తే చాలు. ఆ పేజి సేవ్ అయిపోతుంది .

Pocket How to Save

ఇక ఆ పేజి ని నువ్వు ఏ కంప్యూటర్ డివైస్ లో అయినా,మొబైల్ లో అయినా నీ Pocket ఎకౌంటు తో లాగిన్ అయ్యి చూడవచ్చు .

జస్ట్ వేరే కంప్యూటర్ ,లేదా మొబైల్ లో Pocket అప్లికేషను ఓపెన్ చేసి లాగిన్ అయితే చాలు, నువ్వు సేవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది.

ఇంకో విషయం ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే వీటిలో సేవ్ చేసుకున్న వీడియోస్,పేజి లను ఆఫ్ లైన్ లో చూడొచ్చు, కాని ఆ పేజి లేదా సర్వీస్ ఆ ఆప్షన్ ఇచ్చిన వాటికి మటుకే ఈ సదుపాయం ఉంటది.

దాదాపు ప్రతి స్మార్ట్ మొబైల్ కి ఈ ఆప్ డౌన్లోడ్ చేసుకోటానికి లబిస్తుంది, అంటే నీది andriod ఫోను అయినా, ఆపిల్ ఫోను  అయినా,విండోస్ ఫోన అయినా, నువ్వు ఈ ఆప్ డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ బ్రౌజరు తో పని లేకుండా వాడుకోవచ్చు .

ఇంకెందుకు ఆలస్యం..స్మార్ట్ ఆప్ ని వాడి స్మార్ట్ గా ఉండు అనగానే వాసు ఆప్ డౌన్లోడ్ చేసుకుంటున్నాడు. మరి మనమూ  ఆ స్మార్ట్ ఆప్ ని వాడుకుందాం పదండి. 

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here