మీ బిజినెస్ ను అమ్మబోయే ముందు మీరు పరిగణించవలసిన అంశాలు

Things you consider before selling your business

సాధారణంగా బిజినెస్ చేసే వారు ఎవరూ కూడా బిజినెస్ నుంచి విశ్రాంతి తీసుకోవలనుకోరు కాని ఒక్కోసారి పరిస్థుతుల వలనో ఇంకో కారణం వలనో బిజినెస్ ను వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటప్పుడు బిజినెస్ ను అమ్మవలసి వస్తుంది. ఈ పరిస్థితిని గురించి ప్రతి బిజినెస్ యజమాని తన బిజినెస్ ను ప్రారంభించే సమయంలోనే ఆలోచిస్తారు. అలా బిజినెస్ ను అమ్మవలసి వచ్చినప్పుడు మీరు పరిగనించవలసిన కొన్ని అంశాలను ఇప్పుడు చూద్దాం. 

బిజినెస్ ను విభజించడం:

సోలో గా బిజినెస్ లను నిర్వహించే వారి విషయంలో ఈ బిజినెస్ ను విభజించడం అనేది పెద్ద సమస్య కాదు కాని పార్టనర్ షిప్ బిజినెస్ చేసే బిజినెస్ లకు మాత్రం బిజినెస్ ను అమ్మబోయే ముందు మీరు ఎలా విభజించాలనుకుంటున్నారు అనేది కాస్త ఆలోచన చేయవలసిన అంశం. అదే విధంగా మీ పార్టనర్ షిప్ లోని సభ్యులందరూ కూడా బిజినెస్ అభిమానానికి సిద్ధంగా ఉండాలి.  ఒక్కోసారి అందరు సిద్ధంగా లేని సమయాల్లో వారిని ఒప్పించవలసిన క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి. 

Capital gains tax:

మీ బిజినెస్ కోసం ఇతరులు ఆఫర్ చేసిన మొత్తం కాస్త ఒర్రించే విధంగానే ఉంటుంది కాని మీరు తిరిగి ఆ డబ్బును ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారు లేదా ఎలా ఖర్చు చెయ్యలనుకుంటున్నారు అనే ఆలోచనల కంటే ముందే మీరు దృష్టి సారించవలసిన ఒక అంశం ఎంత మొత్తం అయితే అంతటి మీద Capital gains tax ను మీరు చెల్లించవలసి ఉంటుంది. అలా మీరు ఎంత చెల్లించవలసి ఉంటుంది అనే విషయాన్ని ఆన్ లైన్ capital gains tax calculator ద్వారా మీరు లెక్కించి ఒక అంచనాకు రావచ్చు. 

బిజినెస్ ను package చెయ్యటం:

బిజినెస్ అంటే కేవలం ఆస్థులు మాత్రమే కాదు, అంతకు మించి. అయితే మీ బిజినెస్ ను మీరు కొనుగోలు చెయ్యబోయే వారికి సిద్ధంగా ఉంచడం కోసం మీరు ఊహాత్మక ప్రణాలికను సిద్ధం చెయ్యవలసి ఉంటుంది. మీరు వారిని కలిసి వారితో మీ పరస్పర సంభాషణలు ప్రారంభం కావటానికి ముందే మీరు ఈ విధమైన ప్రణాళిక ద్వారా సిద్ధంగా ఉండాలి.

మీరు మరియు మీ టీం మార్పు:

ఆస్థులకు మించి కూడా మీరు ఆలోచన చెయ్యవలసి ఉంటుంది. ఇలా అనుకున్నట్టు మీ బిజినెస్ గనుక అమ్మినట్లైతే ఆ తరువాత మీరు మీ టీం సభ్యులు ఏ విధంగా మార్పు చెందుతారు అనేవి ఆలోచించాలి. మీ సంస్థలోని ఇతర ఉద్యోగులు కొత్త management తో పని చేస్తూ కొనసాగిస్తారా? మీరు కంపెనీ లో స్టాఫ్ గా కొనసాగుతారా లేక అడ్వైసర్ గా ఉండాలనుకుంటారా అనే విషయాలలో మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. 

ఈ డీల్ తర్వాతి ఆర్ధిక పరిస్థితులు మరియు లైఫ్ స్టైల్:

మొత్తంగా బిజినెస్ ను అమ్మివేసి తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకుందామనే ఆలోచనలో గనుక మీరు ఉన్నట్లైతే మీ విశ్రాంత జీవనం కోసం ఒక స్పష్టమైన ప్లాన్ మీరు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఆదాయం ఎలా? మీ జీవనం ఎలా? మిమ్మల్ని మీరు బిజీ గా ఉంచుకోవడం కోసం హాబీలు, ఇతర పనులను వినియోగించుకోవాలి.  అలా మీ భావిష్యుత్తను గురించి తప్పకుండా ఆలోచించాలి.

************************************************************************************************************************************

Telugu Video Course on Blogging “How to start a Blog “

బ్లాగింగ్ అనేది ఒకప్పుడు సరదా … ఇప్పుడు బతుకు తెరువు చూపించే ఒక డిజిటల్ మార్గం. మరి బ్లాగ్ స్టార్ట్ చెయ్యాలి అంటే ఎలా ?కోడింగ్ తో పని లేకుండా బ్లాగ్ ఎలా రూపొందించాలి ?బ్లాగ్ లో మనకి ఉపయోగపడే మంచి plugins ఏంటి ? ….

ఇలా బ్లాగ్ గురించి ప్రాక్టికల్ గా వివరిస్తూ నేను చెప్పిన వీడియో కోర్స్ ఆన్ లైన్ లో ఉంది . ఈ లింక్ లో క్లిక్ చేసి కోర్స్ లో చేరితే రిజిస్ట్రేషన్ వివరాలు మీ Email కి వస్తాయి. ఆ వివరాలతో వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి ఎప్పుడు కావలి అంటే అప్పుడు కోర్స్ చూసుకోవచ్చు.

కోర్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here