బ్లాగింగ్ తో 10000Rs టూల్ ఫ్రీ గా ఎలా పొందాను? Case Study

బ్లాగింగ్ అనగానే చాలా మంది యాడ్స్ నుంచి మనీ గురించి మాత్రమే ఆలోచిస్తారు. బ్లాగింగ్ లో మనీ సంపాదించటం ఒక్కటే ఉండదు..మనీ ఆదా చేసుకోవటం కూడా సంపాదించటమే. అలా నేను 10,000 Rs విలువ చేసే ఒక టూల్ ని బ్లాగ్ ఆర్టికల్ ద్వారా ఫ్రీ గా పొందగలిగాను. దీనినే టెక్నికల్ గా Affiliate Marketing అంటారు.  బ్లాగింగ్ ద్వారా  అది ఎలా సాధ్యం అయ్యిందో  కేస్ స్టడీ మీ కోసం.

grammarly.com ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన Online Grammar checker టూల్ ఇది. ఈ టూల్ ఇంగ్లీష్ లో మనం రాసే టెక్స్ట్ లో Advanced Grammar Rules, Contextual Spell Checker, Vocabulary Enhancement లాంటి ఫీచర్స్ అందిస్తుంది.  ఇంటర్నెట్ లో ఆర్టికల్స్, కంటెంట్ ఎక్కువగా రాసే వారికి చాలా ఉపయోగపడుతుంది.ఈ టూల్ గురించి నేను ఇదివరకు రాసిన ఆర్టికల్ ఈ లింక్ క్లిక్ చేసి చదవండి.

Click Here for Grammarly Free 1 week Premium Version  

మాములుగా ఈ టూల్ కి పూర్తిగా వాడుకోటానికి దాని ప్రీమియం వెర్షన్ కొనాలి. అప్పుడే అన్ని ఫీచర్స్ సమర్ధంగా వాడుకోగలం.  1 year కి దీని ప్రీమియం ధర  మన కరెన్సీలో 10 వేల రూపాయలు. అంత ధర పెట్టి ఒక టూల్ కొనటమంటే  మనందరికీ కష్టం.

ఈ టూల్ ని నేను ఫ్రీ గా ఎలా  పొందానో కేస్ స్టడీ?

ఈ టూల్ తన ప్రీమియం ఫీచర్స్ ఎలా ఉంటాయో తెలపటానికి కొత్తగా రిజిస్టర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఒక వారం పాటు పూర్తిగా ఫ్రీ గా వాడుకునే అవకాశం అందిస్తుంది. అలా ఈ టూల్ ని రిఫర్ చేసిన వారికి కూడా ఒక వారం ప్రీమియం వెర్షన్ దక్కుతుంది.అలా ఎంత మందిని రిఫర్ చేస్తే అన్ని వారాలు(weeks)  మనం ఫ్రీ గా వాడుకోవచ్చు.

Step 1: అంతకు ముందే  ఒక నెల పాటు నేను ఈ టూల్ ప్రీమియం వెర్షన్ వాడి ఉండటం వలన  ఈ టూల్ ఎంత ఉపయోగమో తెలిసింది.

Step 2: అలా ఈ టూల్ ప్లస్ పాయింట్స్ , మైనస్ పాయింట్స్ తెలిసిన తరువాతే దీని మీద ఆర్టికల్ ప్లాన్  చేసాను.

Step 3: అలా లాస్ట్ ఇయర్  April 28 2016 దీని మీద ఆర్టికల్ రాసాను.

Step 4 : ఫేస్ బుక్ లో షేర్ చేసాను.
Step 5 : ఈ-మెయిల్ subscribers అందరికి ఆ ఆర్టికల్ పంపాను.
Step 6 : నాకు ఈ టూల్ గురించి మెసేజ్ చేసిన వారికి ఓపికగా సమాధానం చెప్పాను.

నేను అందించిన Referal Link ద్వారా దాదాపు  51 Members  కొత్తగా రిజిస్టర్ అయ్యి వారం పాటు దీని ప్రీమియం వెర్షన్ వాడుకున్నారు. ఈ టూల్ బాగుంది ..మాకు బాగా ఉపయోగపడింది అని మెసేజ్ పెట్టిన వారు చాలా మంది ఉన్నారు.

ఇక్కడే బ్లాగింగ్ పవర్ ఉంది. మనం మాములుగా ఫేస్ బుక్ లోనో ఈ-మెయిల్ ద్వారానో షేర్ చేస్తే ఎక్కడో ఒకరో ఇద్దరో రిజిస్టర్ అవుతారు. నా ఆర్టికల్ చదివి  51 Members  దాని ప్రీమియం వెర్షన్ ఫ్రీ గా వారం పొందారు. దానికి ప్రతిఫలంగా  51 వారాలు నాకు ఈ టూల్ వాడుకునే అవకాశం దొరికింది.

వచ్చే ఇయర్ April 15 2017  వరకు నాకు ఈ టూల్ ఫ్రీ గా వాడుకునే అవకాశం దొరికింది. అదే , మాములుగా కొంటె ఈ టూల్ ని 10 వేల రూపాయలకు కొనవలిసి వచ్చేది.

grammarly

అంటే, ఇంకొకరికి హెల్ప్ చేస్తూ తీరిగి నేను కొంత ప్రతిఫలం పొందాను . అలా 10 వేల రూపాయల విలువ గల టూల్ ని ఆదా చేసుకొని చాలా వెబ్ సైట్ లకి కంటెంట్ రాసాము.అందుకే ఎప్పుడు చెపుతాను … బ్లాగింగ్ అంటే మనీ కాదు , బ్లాగింగ్ అంటే మనుషులు. అవతల వారికి ఏమి కావాలో అందించండి , తీరిగి  బ్లాగింగ్ మీకు ఇస్తుంది.

ఈ టూల్ ని ఒక వారం పాటు ఫ్రీ గా వాడుకోటానికి ఈ లింక్ క్లిక్ చేసి ఈ-మెయిల్ తో రిజిస్టర్ అవ్వండి. ఈ లింక్ క్లిక్ చేసి మీరు ఒక్కక ఈ-మెయిల్ తో ఒక్కక్క అకౌంట్ క్రీస్తే చేసుకొని ఫ్రీ గా వాడుకోవచ్చు.

Click for Grammerly Website 1 week Free Offer 

 About Blog Author
నా పేరు రవికిరణ్. Entrepreneur - Digital Marketing Analyst and Blogger.

Startups,Social Media,Digital Marketing,Online Business,Online Money నాకున్న  knowledge & Experience ఈ బ్లాగ్ లో తెలుగు లో రాస్తున్నాను.

ఇంటరెస్ట్ ఉన్న వారు నా Facebook Profile ​ Follow  అవ్వండి
SUBSCRIBE Our Youtube Channel for Videos

Comment using Facebook for quick reply

క్రింద కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియచేయండి..నలుగురితో షేర్ చేసుకోండి

హాయ్... నా పేరు రవికిరణ్. స్మార్ట్ తెలుగు బ్లాగ్ Founder & Writer

ఆన్ లైన్ బిజినెస్ - బ్లాగింగ్ - స్టార్ట్ అప్స్ గురించి ఆర్టికల్స్ డైరెక్ట్ గా ఈ-మెయిల్  పొందటానికి, నాతో ఈ-మెయిల్ ద్వారా టచ్ లో ఉండటానికి మీ పేరు, ఈ-మెయిల్ ఇచ్చి Subscribe అవ్వండి. 

Subscribe Now

 About Blog Author
నా పేరు రవికిరణ్. Entrepreneur - Digital Marketing Analyst and Blogger.

Startups,Social Media,Digital Marketing,Online Business,Online Money నాకున్న  knowledge & Experience ఈ బ్లాగ్ లో తెలుగు లో రాస్తున్నాను.

ఇంటరెస్ట్ ఉన్న వారు నా Facebook Profile ​ Follow  అవ్వండి
SUBSCRIBE Our Youtube Channel for Videos
error: Content is protected !!