మీ career కోసం బ్లాగింగ్ ఎందుకు చెయ్యాలి?

0

నేను బ్లాగింగ్ ద్వారా బతుకుతున్నాను అని తెలిసి, చాలా మంది వారిని కుడా గైడ్ చేయమంటున్నారు.వారం రోజులుగా నా మెసేజ్ బాక్స్ ని  హోరెత్తిస్తున్నారు.

బ్లాగింగ్ , డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ , నా పర్సనల్ లైఫ్ వలన  ఒక్కొకరికి బ్లాగ్ మీద   ట్రైనింగ్   చెప్పటం కుదరని పని. అందుకే అందరికి ఉపయోగపడేలా ఆర్టికల్స్ రాస్తున్నాను. కొద్దిగా ఓపిక పట్టండి.

బ్లాగింగ్ లో మొదటి స్టెప్ Long Term Goal ఉండి ..సీరియస్ గా తీసుకోవటం. ఏదో ట్రై చేద్దాములే అనుకునే వారు అసలు బ్లాగ్ మొదలుపెట్టకపోవటం ఉత్తమం.
మరి మీరు బ్లాగ్ పట్ల నిజంగా పట్టుదలగా ఉంటె చేయవలసిన మొదటి పని మంచి వెబ్ హోస్టింగ్ తీసుకోవడం.
ఈ రొండు వారాలలో నేను కింద  Refer చేసిన బ్లాగ్ హోస్టింగ్ తీసుకొని రెడీ గా ఉంటె ..వెబ్ హోస్టింగ్ తీసుకున్న వారికి మే నుండి ప్రత్యెకమయిన ఆర్టికల్స్ ద్వారా చెపుతాను. వారికి ప్రత్యెక మెయిల్స్ పంపుతాను.

బ్లాగింగ్ నేర్పడానికి నేను రెడీ…మరి మీరు రెడీ నా ?

మీకు బ్లాగ్ మొదలుపెట్టె ఆలోచన ఉంటె మాత్రం ఈ వారం నుండి నాతో బ్లాగ్ ప్రయాణం మొదలుపెట్టండి.  బ్లాగ్ కి పేరు(Domain) , బ్లాగ్ కోసం ఒక వెబ్ హోస్టింగ్ (web hosting) తీసుకోండి.

బ్లాగింగ్ కోసం మీరు Bluehost కంపెనీ వారి web hosting  ఈ లింక్ ద్వారా తీసుకోండి. ఇండియాలో చాలా మంది ప్రముఖ ప్రొఫెషనల్ బ్లాగర్లు బ్లాగింగ్ కోసం వాడే  సర్వీస్ ఇది.

మీరు ఈ లింక్ ద్వారా హోస్టింగ్ తీసుకుంటే నాకు కంపెనీ వారు Referral మనీ ఇస్తారు. మీరు నా లింక్ ద్వారా కొన్నారు కాబట్టి దానికి కృతజ్ఞతగా నేను మీకు ఫ్రీ గా ఆ సర్వర్ లో Blog Software WordPress Install  చేసి ఇస్తాను. అలానే ముఖ్యమయిన నాలుగు Plugins  కుడా Install  చేసి ఇస్తాను.

మీకు హోస్టింగ్ తీసుకోవటంలో ఏదయినా Confusion  ఉంటె https://www.facebook.com/smartteluguofficial లింక్ లో నాకు మెసేజ్ పెట్టండి. నేను మీకు help చేస్తాను.

మీరు నా లింక్ ద్వారా బ్లాగ్ తీసుకుంటే నాకు మీ వివరాలు application DashBoard లో తెలుస్తాయి. అది చూసి నేను మీకు Free WordPress Install  సర్వీస్ అందజేస్తాను.ఆ తరువాత నా ఆర్టికల్స్ ఫాలో అవుతూ  బ్లాగింగ్ నేర్చుకోండి.

నేను ఇచ్చిన లింక్ ద్వారా web hosting  కొన్న వారిని మాత్రం ప్రత్యేకమయిన గ్రూప్ గా మార్చి వారితో నెలకు ఒక మీటింగ్ పెడతాను.

నువ్వు  కొనమన్నావు అందుకే కొన్నాము అని “బ్లాకు మెయిల్”  మాత్రం చేయకండి. ప్రత్యేకంగా ఎవరికీ బ్లాగింగ్ నేర్పే టైం నాకు లేదు. ఏదయినా సరే ……ఆర్టికల్ ద్వారా , మీటింగ్  ద్వారా చెపుతాను.

బ్లాగర్ గా సెటిల్ అవ్వాలి అంటే ముందు మంచి attitude ,నడవడికా ఉండాలి. ఓపికా , సహనం, సబ్జెక్టు మీద పరిజ్ఞానం ఉన్న వారు మాత్రమే బ్లాగింగ్ ద్వారా మనీ ,పేరు సంపాదించగలరు.అది ఆలోచించుకొని బ్లాగింగ్ మొదలుపెట్టండి.

ఇక కెరీర్ ఏదయినా సరే, బ్లాగ్ ఎందుకు అవసరమో మీకోసం :

సినిమా రైటర్ వా? ఫుడ్ అంటే పిచ్చా?  ఫాషన్ ఇండస్ట్రీ అంటే మక్కువా? నీకు తెలిసిన టెక్నాలజీ సబ్జెక్టు నీ ఫ్రెండ్స్ కు తెలియదా ? ఎక్కడ ఏ ఆఫర్ ఉందో ఇట్టే చెప్పేస్తావా ? హెల్త్ గురించి బాగా తెలుసా ? Boutique మీద ఇంట్రెస్ట్ ఉందా? చాక్లెట్ లు,కేకులు తయారు చేస్తారా ?

బుర్రలో గుజ్జు ఉంటె ఎం లాభం? నీ టాలెంట్ అందరికి తెలియాలి కదా.

కెరీర్ ఏదయినా కావచ్చు, నిన్ను నువ్వు ప్రపంచానికి తెలియజేయాలి అంటే మాత్రం బ్లాగింగ్ చెయ్యాలి.

డాక్టర్,లాయర్, షాప్ ఓనర్, వెబ్ సైట్ కంపెనీ , మార్కెటింగ్ కంపెనీ,రిటైల్ బ్రాండ్ షాప్ ..ఇలా వ్రుత్తి ఏదయినా సరే, దానికి  కస్టమర్ కావాలి. మరి అలాంటి కస్టమర్ కి నీ పనితనం తెలియాలి అంటే మాత్రం బ్లాగింగ్ చెయ్యాలి.

జాబ్ కోసం కావచ్చు,సినిమా ఛాన్స్ కోసం కావచ్చు,మనీ కోసం కావచ్చు,పేరు కోసం కావచ్చు,బిజినెస్ కోసం కావచ్చు…బ్లాగింగ్ చెయ్యాలి.

నీ కోసం:

అది ఆర్టికల్ కావచ్చు…వీడియో కావచ్చు. ఫోల్లోవేర్లను పెంచుకో. ఎవడో ఛాన్స్ ఇస్తాడు అని ఎదురుచూడటం ఆపెసేయి. నీ టాలెంట్ నాలుగు గోడల మధ్య ఒకడి ముందు కాదు…ప్రపంచానికి తెలియజెయ్యి.

ఆ” ఒక్క ఛాన్స్ ” కోసం :

ఒక్క సినిమా ఛాన్స్ ….కొన్ని వేల మంది ఈ మాట మనసులో అనుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ వస్తే నా టాలెంట్ చూపిస్తా అనుకుంటారు. ఛాన్స్ ల కోసం తీరుగుతారు.
అలా కొంతమందికి యొఉతుబె దొరికింది. ఇంకొంతమందికి ఫేస్ బుక్ దొరికింది.మరి బ్లాగ్ కుడా అంతే…నీ ఆర్ట్ ని అక్షరాలలో చూపించి ఆ ఒక్క ఛాన్స్ నీ దగ్గరకే వచ్చే తట్టు చేసుకో.

బిజినెస్ కోసం :

కస్టమర్ దగ్గరికి మనం వెళతాం పాత పద్ధతి. కస్టమర్ మన దగ్గరికి రావటం “స్మార్ట్ ” పద్ధతి. బ్లాగ్ ద్వారా నీ బిజినెస్ టిప్స్ చెప్పు. కస్టమర్ కి అవసరమయిన ఇన్ఫర్మేషన్ అందజెయ్యి. బిజినెస్ అంటే డబ్బులు మాత్రమే కాదు…కస్టమర్ కుడా.

ఉద్యోగం కోసం :

ఇప్పుడు కంపెనీలు సోషల్ మీడియా లో నీ ప్రొఫైల్ చూసి ఇంటర్వ్యూ కి పిలుస్తున్నాయి. మరి ఈలాంటి టైం లో నీ టాలెంట్ బ్లాగ్ ద్వారా నీ సబ్జెక్టు చూపించు.
నీకు బాగా వచ్చిన సబ్జెక్టు మీద బ్లాగ్ రాయి…రీడర్స్ ని పెంచుకో. అప్పుడు కంపెనీలే నీకు ఎదురువస్తాయి.

పని కోసం :

నేను చదివి 3 ఇయర్స్ నుండి కాలిగా ఉన్నాను.ఏమి చెయ్యాలో తెలియట్లేదు అని చాలా మంది బాధ.
నీలో ఏదో ఒక ఆర్ట్ ఉంటది.దానిని బయటకు తీయి. BTech, MBA చదినంతమాత్రాన  నువ్వు కేవలం జాబ్ మాత్రమే చెయ్యాలి అని లేదు. బ్లాగ్ ద్వార్ నీ ఆర్ట్ చూపించి పని తెచ్చుకో.నీలో సబ్జెక్టు ఉంది అని తెలిస్తే పని అదే దొరుకుతుంది.

ధైర్యం కోసం :

అమెరికా వెళ్ళామనో , పిల్లలు పుట్టారు అనో,  చాలా మంది మహిళలు  చేస్తున్న ఉద్యోగం ఆపేస్తారు. చదువుకున్న చదువుని అటకేక్కిస్తారు.
ఫాషన్ కావచ్చు , వంటలు కావచ్చు , టెక్నికల్ సబ్జెక్టు కావచ్చు….బ్లాగ్ రాయండి. పేరు కోసమో..డబ్బు కోసమో కాదు.
మీరు కేవలం ఇంట్లో పని చేయటానికి మాత్రమే ఉండలేదు అనే ధైర్యం కోసం.

మరి బ్లాగ్ మొదలుపెడతారా ? ఈ లింక్ లో హోస్టింగ్ తీసుకోండి.  నాకు మెసేజ్ పెట్టండి. నేను వెబ్ హోస్టింగ్ తీసుకునే క్రమంలో హెల్ప్ చేస్తాను.

 

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here