ఒక చిన్న స్టార్ట్ అప్ బిజినెస్ ను ప్రారంభించిన మరియు నడుపుతున్న యజమానిగా మీకు మీ బిజినెస్ యొక్క సైజును గురించిన మరియు మార్కెట్లో మీ అనుభవం గురించిన ప్రశ్నలు నిరంతరం మిమ్మల్ని కలచి వేస్తుంటాయి. అలా చిన్న బిజినెస్ లను నడిపే వారు ఎవరూ కూడా తమ బిజినెస్ ప్రజలలో చిన్నదిగా ప్రాజెక్ట్ అవ్వాలని కోరుకోరు. దానిని వీలైనంత వరకు పెద్దగా మరియు ఏలోటు లేని బిజినెస్ లా కనిపించే విధంగానే చూపించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విధమైన స్టార్ట్ అప్ stigma సాధారణంగా చిన్న బిజినెస్ లను నిర్వహించే ప్రతీ ఒక్కరూ తమ బిజినెస్ ప్రారంభంలో ఎదుర్కొనే ఉంటారు. చిన్న బిజినెస్ లు అనగానే చాలా మందికి కలిగే భావన పెద్దగా అనుభవం మరియు నైపుణ్యం ఉండని వారు మరియు తక్కువ సంఖ్యలో ఉద్యోగులు చిన్న ఆఫీస్ లు నిర్వహిస్తూ ఉంటారని భావిస్తూ ఉంటారు. గత కాలంలో ఓటమి పాలైన మరియు నిరాస పరిచిన స్టార్ట్ అప్ లు మరియు ఇతర చిన్న బిజినెస్ లే వారికి అటువంటి భావన కలగడానికి కారణంగా భావించవచ్చు. ఎంతో ప్రఖ్యాతిని సాధించి నేడు ప్రజలందరి ఆదరాభిమానాలను అందుకొంటున్న నేటి తరం ప్రముఖ కంపెనీలు Google, HP, Apple, Harley Davidson, Disney, Amazon ల వంటి మరిన్ని ఎన్నో కంపెనీ లు మరియు బిజినెస్ లు చాలా చిన్నగా తక్కువ స్థాయిలో ప్రారంభామైనవే అని గమనించాలి. అయినప్పటికీ ఈ stigma సాధారణ వ్యక్తులలోను మరియు బిజినెస్ ను నడిపే వారిలోనూ ఉండటం సహజం. కనుక మీ బిజినెస్ పెద్దగా కనిపించేలా చెయ్యటం ఎలా అనే అంశాన్ని గురించి కొన్ని ఉపయోగకర మార్గాలను ఇప్పుడు తెల్సుకుందాం.

Virtual ఆఫీస్ ను ఉపయోగించుకోవడం:

మీ బిజినెస్ కు తగ్గట్టు మీకు అనుకూలమైన మరియు మీ budget లో ఉన్న ప్రదేశంలో నుంచి మీరు వర్క్ చెయ్యవచ్చు. దీనిని ఎవ్వరు కాదనలేరు, అనకూడదు కూడా. అయితే మీ బిజినెస్ కోసం నిర్వహించే ప్రొఫెషనల్ మీటింగ్ లను అటువంటి ప్రదేశాలలో నిర్వహించడం అంత మంచి ఆలోచన కాదు. కాబట్టి అటువంటి కొన్ని ముఖ్యమైన మీటింగ్ల కోసం ఒక virtual ఆఫీస్ ను అద్దెక తీసుకోవడం మంచిది.

డొమైన్ తో కూడిన ఈమెయిల్ id ని ఉపయోగించడం:

చాలా బిజినెస్ యజమానులు మరియు entrepreneur లు సాధారణంగా చేసే పొరపాటు తమకంటూ తమ బిజినెస్ కు చెందిన ప్రత్యేకమైన ఒక డొమైన్ ఉన్నప్పటికీ, తమ మెయిల్ id కోసం ఏ Gmail ఓ, Yahoo నో ఉపయోగిస్తారు. ఇది అంత ప్రొఫెషనల్ గా ఉండదు కనుక మీరు డొమైన్ సెంట్రిక్ మెయిల్ ను create చేసుకొని దానినే వినియోగించాలి.

ప్రొఫెషనల్ బ్రాండింగ్ ను సృష్టించే వస్తువుల కోసం కాస్త ఖర్చుపెట్టాలి:

మీ budget భారి స్థాయిలో లేనప్పటికీ, మీ బిజినెస్ బ్రాండింగ్ ను పెంచే కొన్ని రకములైన ప్రొఫెషనల్ వస్తువుల కోసం డబ్బును వెచ్చించడానికి వెనుకడుగు వెయ్యకూడదు. మీ ఆన్ లైన్ వెబ్ సైట్ కోసం ఒక మంచి లోగో మరియు క్వాలిటీ పిక్చర్స్, అలాగే శక్తివంతమైన గ్రాఫిక్ ల కోసం మీరు వెచ్చించే డబ్బు మీ బిజినెస్ స్థాయిని పెంచుతుందని గమనించాలి.

సోషల్ మీడియా లో మీ బిజినెస్ కు ఫాలోయింగ్ ను పెంచుకోవడం:

నేటి తరం జనాల్లోకి తొందరగా మీరు గాని మీ బిజినెస్ గాని వెళ్ళాలంటే ఖచ్చితంగా మీకు ఉపయోగపడేది సోషల్ మీడియా. అన్ని పాపులర్ సోషల్ మీడియా ఛానల్లలో మీ బిజినెస్ ఉనికి ని చాటుకొంటూ దానిని గురించి ప్రజలలోకి స్పష్టమైన అంశాలను తెలియచేస్తూ ఎప్పటికప్పుడు విషయాలను వారితో పంచుకొంటూ మీ followers ను పెంచుకొనే ప్రయత్నం చెయ్యాలి. మీ బిజినెస్ మరియు ఐడియా మంచిదై మంచి ఉద్దేశం కోసం చేస్తున్నంత వరకు, మీ చిన్నగా ఉన్న బిజినెస్ ను పెద్దగా చూపాలని మీరు చేసే ప్రయత్నం తప్పు కాదు.

Comment using Facebook for quick reply

error: Content is protected !!