విజయవంతమైన బిజినెస్ పర్సన్స్ కి ఉండే కొన్ని అలవాట్లు

HABITS OF SUCCESSFUL BUSINESS MANS

ప్రతి బిజినెస్ entrepreneur యొక్క జర్నీ డిఫరెంట్ గా ఉంటుంది, కాని వారు అనుసరించే పద్ధతులలో కొంత వరకు సంబంధం కలిగినవి ఉంటాయి. విజయవంతమైన entrepreneur లు అనుసరించే కామన్ పద్దతులు కొన్ని ఉంటాయి. అయితే వాటిలో ముఖ్యంగా మొదట ప్రతి ఒక్కరూ చెప్పుకునేవి మనందరికీ బాగా సుపరిచితమైనవి ఉదయాన్నే లేవడం, ఏక్టివ్ గా ఉండటం. అయితే అలా విజయవంతమైన వ్యక్తులకు ఉండే కొన్ని కామన్ మార్నింగ్ అలవాట్లను గురించి ఇప్పుడు చూద్దాం.

తెల్లవారి లేవడం:

అందుబాటులో ఉన్న డేటా ప్రకారం చాలా వరకు successful వ్యక్తులు పొద్దునే లేచేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. PepsiCo CEO Indra Nooyi తెల్లవారి 4 గంటకే నిద్ర లేస్తారట, ఇక అలాగే Disney CEO Bob Iger కూడా తెల్లరి 4:౩౦ గంటలకే లేవడానికి ఇష్టపడతారు. అలాగే విజయవంతమైన వ్యక్తులు తమ జీవితాన్ని ఎల్లప్పుడూ ఆశావాద దృక్పధం తో చూస్తారు. అలాగే చాలా మందికి ఉదయాన్నేnotes of gratitude రాసే అలవాటు కూడా ఉంటుంది.

పక్క సర్దటం:

ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చును కాని ఇది విజయవంతమైన వ్యక్తులలో చాలా మందికి ఉండే ఒక మంచి అలవాటు అని చెప్పవచ్చును. నిజానికి ఇది ఒక చిన్న పనిగా కనిపించినప్పటికీ లేచిన పక్కను సర్దటం అనేది రోజును మొదలుపెట్టడానికి ఒక అద్భుతమైన మార్గం.

నిజానికి బెడ్ మేకింగ్ అనేది ఒక keystone డెసిషన్ అంటే చేసిన ఒక మంచి పని మరిన్ని మంచి పనులకు ప్రేరణను కలిగిస్తుంది. ఇటువంటి అలవాటు విజయవంతమైన వ్యక్తులలో చాలా మందికి ఉందనేది ఆశ్చర్యంగా అనిపించనప్పటికి నమ్మక తప్పాదు ఎందుకంటే అదే నిజం.

మంచిగా తినటం hydrated గా ఉండటం:

ఒక విజయవంతమైన రోజును గడిపేందుకు బాగా తినడం ఎంతో ముఖ్యమనే విషయం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎక్స్పర్ట్ లు చెప్పే దానిని బట్టి healthy ఫుడ్ తినటం, సరిపడినన్ని మంచి నీళ్ళు తీసుకోవడం అనేవి స్ట్రెస్ ను చాలా వరకు తగ్గిస్తాయి. అలాగే చాలా వరకు టెన్షన్ ను కూడా తగ్గించడానికి ఈ అలవాటు ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరానికి కావాల్సిన వనరు ఆహరం, మీరు కనుక ముందుగా దానిని సంతృప్తి పరిచి నట్లైతే, మీకు పని పట్ల మరింత ఫోకస్ ఏర్పడేందుకు, ఇతర disturbance లకు దూరంగా ఉంచేందుకు ఈ అలవాటు ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో భాగంగా ప్రతీరోజు ఉదయమే ౩ గ్లాస్ ల మంచి నీళ్ళు తీస్కోవడం వలన రోజంతా మన body hydrated గా ఉంటుంది. అలాగే ఫుడ్ విషయానికి వస్తే ఆరోగ్యకరమైన ప్రోటీన్ లు, ఫాట్ లు మీ డైట్ లో ఉండేలా జాగ్రత్త పడాలి.

వార్తలు చదవటం:

ప్రపంచంల్లో ఎం జరుగుతుందో కూడా తెలియకుండా ప్రపంచాన్నే మార్చేద్దామనుకోవడం పిచ్చితమే అవుతుంది. అందుకే ప్రతి రోజు వార్తలను ఫాలో అవ్వడం ఒక మంచి అలవాటు, అలాగే ఇదే అలవాటు చాలా మంది విజయవంతమైన వ్యక్తులకు కూడా ఉంది. మీరు రోజువారి పనులు చేసుకునే సమయంలోనో లేదా ప్రత్యేకమైన సమయం దీని కోసం కేటాయించి రోజు వార్తలను ఫాలో అవ్వటం అనేది చాలా మంచి పని.

ఫ్యామిలీ తో సమయాన్ని గడపటం:

విజయవంతమైన వ్యక్తులు ఎప్పుడు తమ బిజినెస్ లు పనులు ఇతర విషయాలతో బిజీగా ఉంటూ ఫ్యామిలీకి పెద్దగా సమయాన్ని కేటాయించారు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇది చాలా మంది successful వ్యక్తులు ఫ్యామిలీతో తమ సమయాన్ని గడపటానికి ఇష్టపడతారు. ఉదాహరణకు Facebook CEO Mark Zuckerburg తన మొదటి పాప పుట్టినప్పుడు maternity లీవ్ తీసుకొని ఫ్యామిలీ తో గడిపాడు, అలాగే ఇప్పుడు తన రెండువ పాపకు కూడా maternity లీవ్ తీసుకొని తన సమయాన్ని వెచ్చించాడు.

ఇంతే కాకుండా రోజు వారి కార్యకలాపలలో సైతం ఫ్యామిలీ తో టైం స్పెండ్ చెయ్యటానికి ఇష్టపడతారు.

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here