Importance of Business Registration in Telugu Article

0
business registration telugu

సుధాకర్ ఒక చిన్న బిజినెస్ మొదలుపెట్టాడు .. మొదట్లో బిజినెస్ “సమాజానికి ఉపయోగపడే మార్గదర్శి ప్రోగ్రాం చూసే జనాభాలాగ” అంత అంత మాత్రం ఉండేది. ఇప్పుడు మాత్రం ” కొన్ని చానెల్స్ లో ఎప్పటికి అంతం లేని బ్రేకింగ్ న్యూస్ డిబేట్ ప్రోగ్రామ్ చూసే జనాభాలా” పెరిగిపోయింది.

చిన్న బిజినెస్ కదా .. మొదట్లో రిజిస్ట్రేషన్ ఎందుకులే అని మనోడు బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయలేదు. బ్యాంకు లో బిజినెస్ కరెంటు అకౌంట్ తీసుకోలేదు. కస్టమర్స్ అందరూ ఇచ్చే అమౌంట్ తన సేవింగ్స్ అకౌంట్ లో జమ చేసేవాడు.రోజు కొకసారి ఆన్ లైన్ అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ లో ఉన్న అమౌంట్ చూసుకొని కొత్త బైక్ కొన్నప్పుడు మురిసిపోయే ఓనర్ లా మురిసిపోయేవాడు.

ఇలా సాగిపోతున్న సుధాకర్ జీవితంలో ఒక రోజు పొద్దునే మెసేజ్ వచ్చింది. తన వెబ్ సైట్ లో ఇంటి సరుకులు రెగ్యులర్ గా కొంటున్న మాయావతి పర్సనల్ గా ఏమయినా మెసేజ్ చేసిందేమో అనే ఆశతో మెసేజ్ చూసాడు .

“ప్రియమయిన ఖాతాదారుడా .. మీ అకౌంట్ లో పైసలు ఎక్కువయ్యాయి.ఆ డబ్బులకి లెక్క చూపించండి” అని మెసేజ్ వచ్చింది.

బ్యాంకు అకౌంట్ మాత్రమే తెలిసిన మనోడికి కరెంటు అకౌంట్ , బిజినెస్ అకౌంట్ లెక్కలు ఏమి తెలుస్తాయి. అందుకే, తన ఫ్రండ్స్ ద్వారా ఎవరో ఒక కంపెనీ ఆడిటర్ ని పట్టుకున్నాడు.

“చూడు బాబు ! బిజినెస్ చేసేటప్పుడు చిన్నదయినా ,పెద్దదయినా ఏదో ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడు, వచ్చిన దానికి ఫైన్ లు , అసలు టాక్స్ లు , ఎక్కడ నుండి మనీ వచ్చిందో చూపించటానికి లెక్కలు …ఇలా సగం అమౌంట్ గోవిందా ,గోవిందా ” అని చెప్పాడు ఆడిటర్.

“ఎం చేస్తాం సర్ ..ఏదో తెలియక జరిగిపోయింది. ఏం పర్లేదు సర్ … ఇప్పుడు ఫైన్ తో టాక్స్ కట్టేద్దాము లెండి” అన్నాడు సుధాకర్

ఒక ఫైన్ మాత్రమే కాదు …అనవసరంగా బిజినెస్ కయినా ఖర్చులు, పెట్టిన పెట్టుబడి చూపించుకునే అవకాశం కోల్పోయావు అన్నాడు ఆడిటర్ .

ఏంటి సర్ …బిజినెస్ రిజిస్ట్రేషన్ వలన ఇన్ని విషయాలు ఉన్నాయా? అన్నాడు సుధాకర్.
బిజినెస్ రిజిస్ట్రేషన్ తో ఉన్న లాభాల గురించి మెల్లగా చెప్పటం మొదలు పెట్టాడు ఆడిటర్

మనకి అంత ఓపిక లేదు కాబట్టి మనోడిలాగా మనం కాకూడదు అనుకుంటే, బిజినెస్ రిజిస్ట్రేషన్ వలన ఉండే లాభాలు కొన్ని చూద్దాము ….

  • చాలా మంది బిజినెస్ లో లాభాలు వచ్చినప్పుడే రిజిస్ట్రేషన్ చేయిద్దాములే అనుకుంటారు. Sole proprietorship లాంటి రిజిస్ట్రేషన్ లు పెద్ద ఖర్చు కాదు.
  • జినెస్ లో ఖర్చు పెట్టె ప్రతి రూపాయి బిజినెస్ ఖర్చు కింద చూపించే అవకాశం ఉంది.
  • బిజినెస్ లో వచ్చే ప్రతి రూపాయికి ఎక్కడనుండి వచ్చిందో ఆధారం ఉంటుంది.
  • బ్యాంకు లోన్స్ ఇచ్చేటప్పుడు ఎప్పటినుంచి లీగల్ గా బిజినెస్ రిజిస్టర్ అయ్యి నడుస్తుంది అనేది చూస్తారు.
  • భవిష్యత్తులో లాగ ప్రైవేట్ పెట్టుబడికి వెళ్ళేటప్పుడు ..బిజినెస్ ఎప్పటినుంచి నడుస్తుంది అనేది మీ రిజిస్ట్రేషన్ బట్టి లెక్కిస్తారు.
  • మీ బిజినెస్ అకౌంట్ లో జరిగిన లావాదేవిలను బట్టి కంపెనీ వాల్యుయేషన్ లాంటి వాటిలో ఒక నిర్ణయానికి వస్తారు.
  • ఐ.టి రిటర్న్స్ లాంటి విషయాలలో టెన్షన్ ఉండదు.
  • అనవసరంగా గవర్నమెంట్ ఫైన్ లాంటివి ఉండవు.

బిజినెస్ స్టార్ట్ చేసే వారయినా , బిజినెస్ స్టార్ట్ చేసి కష్టాలు పడేవారయినా , బిజినెస్ రన్ చేస్తున్న వారయినా …బిజినెస్ రిజిస్టర్ చేయించకపోతే వెంటనే రిజిస్ట్రేషన్ కి వెళ్ళండి.

బిజినెస్ రిజిస్ట్రేషన్ వీడియోలు మిస్ అయితే smarttelugu youtube Channelలో Company registration videos ఉన్నాయి చూడండి. youtube channel subscribe చేసుకోండి. www.youtube.com/smarttelugu

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here