జాబ్ కోసం, మనీ కోసం యువత ఆలోచన మారాలి .

3
YOUTH OPINION ON JOB AND MONEY

సొంత ఆలోచనలు,ఆశయాలు లేకుండా బతుకుతున్న యువత…………
కార్పొ రేట్ చదువు పేరుతో ధనమును ఘనముగా సంపాదిస్తున్న కాలేజీలు…….
పిల్లల అభిరుచి కనుక్కోకుండా సొసైటీ కోసం తపన పడుతున్న తల్లితండ్రులు………
అందరం కలిసి దేశానికి వెన్నుముక్క అయిన ” యువ భవిష్యత్తు ని” పాతాళంలోకి నెడుతున్నాము.

నా బ్లాగ్ చదువుతున్న చాలా మంది యువతకి ఉద్యోగం,ఆన్ లైన్ మనీ, బిజినెస్ పట్ల ఆలోచన విధానాలు సరయిన దారిలో లేవు.దానికి కారణం వారి చుట్టూ ఉన్న వ్యవస్థ,పరిస్థితులు,చదువుకున్న కాలేజీలు, పోటీతత్వం. మరి ఇలాంటి పరిస్థుతులలో వారి ఆలోచన విధానంలో మార్పు రాకపోతే చాలా వ్యవస్థలు వృద్ధి పరంగా నష్టపోయే అవకాసం ఉంది.

అందుకే వారికి మంచి ఆలోచనలు అందజేయటానికి,సరయిన దారి చూపటానికి నా ఆవేశానికి అక్షర రూపం ఇస్తున్నాను. ఇది చదివిన వారిలో ఒక్కరి  ఆలోచన మారిన చాలు.

యువత ఆలోచనలు :

ఒక్కరా, ఇద్దరా ….కొన్ని లక్షల మంది చదువుకున్న నిరుద్యోగులు కాలిగా రూములలో కూర్చుని టైం పాస్ చేస్తున్నారు.
టాలెంట్ ఉండి కూడా వాడుకొని వారు కొందరయితే , తేలికగా డబ్బు సంపాదించాలి అనే ఆశతో ఉన్నవారు కొందరు.
అడుగు ఎటువైపు సాగించాలో తోచని వారు కొందరు అయితే…తమ చదువు ఏమి నేర్పిందో అర్ధం కానీ వారు కొందరు.

ప్రస్తుత పరిస్థులలో కొంత మంది యువత ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాము.

  • బుర్రలో సబ్జెక్టు లేకపోయినా తేలికగా ఉద్యోగం రావాలి.
  • కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా కార్పొ రేట్ జాబ్ కావాలి .
  • డబ్బు కోసం మాత్రమే ఉద్యోగం అనే భావన.
  • ఉచితంగా ఒక మనిషి మనకి సబ్జెక్టు నేర్పించాలి.
  • చాలా త్వరగా డబ్బులు సంపాదించాలి.
  • వ్యాపారం చెయ్యాలి…కానీ రూపాయి  పెట్టుబడి పెట్టనూ.
  • బ్లాగ్ ద్వారా, ఆన్ లైన్ ద్వారా మనీ కావాలి…కానీ నేను మనీ పెట్టి నేర్చుకొను.
  • నా కోసం ఎదుటి వ్యక్తి తన విలువయిన సమయాన్ని ఉచితంగా కేటాయించాలి.
  • కొత్త ఆలోచన, కొత్త పని ఎందుకు ….ఎవడినో ఒకడిని కాపీ కొట్టేస్తే చాలు.
  • ఆన్ లైన్ బిజినెస్ లో చాలా సంపాదించవచ్చు..ఏదో ఒక వెబ్ సైట్ పెట్టేస్తే పోలా.

బుర్రలో సబ్జెక్టు లేకుండా ఉద్యోగం రాదు :

బుర్రలో ఏదో ఒక స్కిల్ లేకుండా ఉద్యోగం కోసం ఎదురు చూడవద్దు. కంపెనీ నీకు జీతం ఇచ్చి ట్రైనింగ్ ఎందుకు ఇవ్వాలి ? వాడికేం పని ? నీకు సబ్జెక్టు ఉంది అని తెలిస్తేనే జాబ్ వస్తుంది.
నువ్వు ఇంజినీరింగ్ చేసావో ,డిగ్రీ చేసావో , పెద్ద కోర్సు చదివావో కంపెనీ కెందుకు… స్కిల్ ఉందొ లేదో చెప్పు చాలు.

కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి :

యూట్యూబ్ లో కి వెళ్లి “కమ్యూనికేషన్ స్కిల్ వీడియోస్ ” అంటే లక్షల వీడియోలు అందుబాటులో ఉన్నాయి.
చూడండి , వినండి ,నేర్చుకోండి …..కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే ఉద్యోగం వచ్చినా కూడా వెస్ట్ . ఎక్కువ కాలం నిలవదు.

పుస్తకాలు చదవండి:

మంచి పుస్తకం…మంచి స్నేహితుడితో సమానం. ఆధ్యాత్మికం, వ్యక్తిత్వం…ఇలా సబ్జెక్టు ఏదయినా సరే, మనకి ఉపయోగపడే సంగతులు మంచి పుస్తకంలో ఉంటాయి. ఈ రోజు కార్పెట్ ఫీల్డ్ మన ఇతిహాసాలలోని విషయాలను తమకు అనువదించుకొనే ” ప్రాజెక్టు టీం లను” నడుపుతున్నాయి.

ఈజీ మనీ ఎక్కడా ఉండదు.

యువత కష్టపడటం మరిచిపోయింది. ఈజీ మని అనేది ప్రపంచం లో ఎక్కడా లేదు.అలా ఉంటే ,అందరూ అదే పని చేస్తారు. ఆన్ లైన్ అయినా , బయట అయినా సరే , కష్టపడకుండా మని రావటం కష్టం.

ఉచితంగా ఎవడు ఏది నేర్పడు:

నువ్వు  ఉచితంగా వాడుకునే గూగులే కోసం కూడా ఇంటర్నెట్ కి మనీ కట్టాలి. ప్రపంచంలో ఏది ఉచితంగా దొరకదు.

రోజు నాకు ఇది నేర్పండి ,అది నేర్పండి అని మెసేజ్ లు వస్తాయి. ఓపిక ఉన్నంత వరకు చెపుతాను….టైం లేక చెప్పకపోయినా, మెసేజ్ కి రిప్లై చేయకపోయినా ” Society కోసం చేస్తున్నారా, డబ్బు కోసం చేస్తున్నారా ? ” అంటూ భారీ డైలాగ్ లు.

తెలుసుకున్న విషయాలతో డబ్బులు సంపాదించాలి కానీ…తెలుసుకోటానికి మాత్రం డబ్బు పెట్టరూ. ఉచితంగా తెలియాలి.ఒక వ్యక్తి ,కంపెనీ నుండి మంచి సబ్జెక్టు నేర్చుకోవాలి అంటే…ఉచితంగా నేర్చుకుందాము అనే ఆలోచనే తప్పు.నువ్వు నేర్చుకునే విద్యకి “విలువ” ఉండాలి …అప్పుడే “విలువయిన విద్య “నీకు దొరుకుతుంది.

ఆన్ లైన్ మనీ  చాలా కష్టం :

ఆన్ లైన్ మనీ సంపాదించే మార్గం ఉంది రా…అని తెలిస్తే చాలు. నేను సంపాదించేస్తా అంటూ రెడీ అవుతారు.
బయట అయినా , ఆన్ లైన్ అయినా సరే , స్కిల్ లేనిది మనీ రాదు.ఆన్ లైన్ మనీ అంటే కనిపించిన యాడ్స్ క్లిక్ చేయటం, లేదా ఎవడి ఆర్టికల్ లో కాపీ చేసి పెట్టుకోవటం , నాలుగు రోజులు పని చేసి వదిలేయటం కాదు.

బండ కష్టం పడాలి…అలా పడే ధైర్యం ,ఓపిక ,సహనం ఉంటేనే ఆన్ లైన్ మనీ.ఆన్ లైన్ మనీ కంటే “M.N.C ” జాబ్ తెచ్చుకోవటం చాలా తేలిక.
మీ ఆశను అవకాసంగా తీసుకొని చాలా మంది మోసం చేస్తున్నారు.ఆశతో పాటు ఆలోచన కూడా చెయ్యండి.

ఐడియా ఉంటే చాలదు.

మంచి బిజినెస్ ఐడియా ఉంది.కానీ పెట్టుబడి పెట్టె ఆలోచన ఉండదు.ఎవడో ఒకడు ఉచితంగా ముందుకు నడిపించాలి.
పెట్రోల్ లేని బైకు…పెట్టుబడి పెట్టని వ్యాపారం ఒకటే.

టెక్నాలజీ ని  సరిగ్గా వాడుకోండి :

గూగుల్ , వికీ పీడియా, యూట్యూబ్ లాంటి మంచి ప్లాట్ ఫార్మ్ లు ఉంటే…ఎటువంటి ట్రైనర్ తో పని లేదు. కానీ మన యూత్ కి సినిమా torrent లు , అడ్డమయిన వెబ్ సైట్ లు, టైం పాస్ విశేషాలు వెతికే టైం, తెలివి  ఉంటది కానీ…సబ్జెక్టు నేర్చుకునే టైం, తెలివి  ఉండదు.

సినిమా కోసం, హీరోల కోసం కొట్టుకోవద్దు:

సినిమాను ఒక అభిరుచిగా ఆస్వాదించండి. ఆనందం కోసం చూడండి. నీ విలువయిన సమయాన్ని “హీరో ల గొప్పల ” కోసం తన్నుకోటానికి కాదు …నీ జీవితం కోసం కేటాయించు.నువ్వు ఆర్ధికంగా బాగుపడితే నిన్ను నమ్ముకున్న కుటుంబము బాగుపడుతుంది.

ప్రయత్నించండి..మనలో అందరం టాలెంట్ ఉన్న వారమే.
నాకంటే టాలెంట్ ఉన్న వారు మీలో చాలా మంది ఉన్నారు….నేను మొదలుపెట్టాను, మీరు ఆలోచనతో ఆగిపోతున్నారు అంతే.పైన చెప్పిన విషయాలు ఆచరిస్తే కచ్చితంగా జాబ్ ,లేదా బిజినెస్ లో విజయం సాధిస్తారు.

Comment using Facebook for quick reply

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here