ఆధునిక బిజినెస్ పద్దతులలో చోటు చేసుకొంటున్న మార్పులతో ఎప్పుడు మీరు ఆఫీస్ నుండే పని చెయ్యనవసరం లేదు. అలాగని ఇంట్లో కూడా కంప్యూటర్ లేదా లాప్ టాప్ లతో పని పడదు. ఒక్కోసారి ఫోన్ తో కూడా పని కానిచ్చేయవచ్చు.కాని ఎలా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏ device నుంచి అయిన పని చేయ్యగలగాలంటే కొన్ని సర్వీస్ లను తప్పకుండా ఉపయోగించుకోవాలి. అలా చిన్న బిజినెస్ లు చేసే వారికి క్లౌడ్ సర్వీస్ లు ఎంతో ఉపయోగకరం అనే చెప్పాలి.
ఏ బిజినెస్ లకైన అంతిమ లక్ష్యం తమ కస్టమర్ లను సంతృప్తి పరచటమే అందుకోసం బిజినెస్ యొక్క ఫోన్ సర్వీస్ ను సక్రమంగా సెట్ చేసుకోవడం అవసరం. Cloud based ఫోన్ సర్వీస్ లు మీకు కార్పొరేట్ ఫోన్ సర్వీస్ ల మాదిరిగా ఉంటాయి. Net2Phone, PicuP లు లాంటి కొన్ని సర్వీసులే.అయితే అవి మీ బిజినెస్ లకు ఏ విధంగా ఉపయోగకరమో ఇప్పుడు చూద్దాం.

మీరు ఎక్కడ ఉన్నా గాని నిరంతరం కనెక్ట్ అయ్యి ఉండవచ్చు:

మీరు 24 గంటలు ఆఫీస్ లో ఉండలేకపోవచ్చును గాని మీ కస్టమర్ లకు మాత్రం మీరు ఎప్పుడూ అందుబాటులో ఉండటం అవసరం. వారికి మీ పర్సనల్ టైం, సోషల్ టైం లతో సంబంధం ఉండదు, వారు మిమ్మల్ని ఎప్పుడైనా access చెయ్యగలగాలి. అటువంటప్పుడు PicuP వంటి క్లౌడ్ ఫోన్ సర్వీస్ లు మీరు ఎక్కడ వున్నా అక్కడ నుంచి కాల్స్ receive చేసేందుకు మరియు కాల్స్ చేసేందుకు ఉపయోగపడతాయి.

ఆఫీస్ కి వచ్చే కాల్స్ ను మీ మొబైల్ కు ఫార్వర్డ్ సెట్ చేసుకోవచ్చును, లేదా PicuP సర్వీస్ ద్వారా మీ ఆఫీస్ నెంబర్ నుంచి కస్టమర్ లకు కాల్స్ చెయ్యవచ్చును.కాబట్టి మీరు ఎక్కడున్నారనే విషయం తో సంబంధం లేకుండా మీ customerలకు అందుబాటులో ఉండటానికి సహాయపడతాయి.

Professional అనిపించుకోవచ్చు:

చిన్న బిజినెస్ లలో కస్టమర్ లను డీల్ చేసే వారు తాము professional entreprenuers అని అనిపించుకోవడం అంత సులభం కాదు. ఫోన్ కాల్స్ కస్టమర్ లకు ఆ అభిప్రాయం తెస్సుకొని రావటం కాస్త కష్టమే.
ఒక మంచి వెబ్ సైట్ ద్వారా మంచి ఫోన్ సర్వీస్ ద్వారా, మరియు ఉద్యోగుల చేత greetings అందించే కాల్స్ కస్టమర్ లకు చెయ్యడం ద్వారా, మీ బిజినెస్ ఒక వెల్ established అండ్ experienced బిజినెస్ అనే భవన ప్రజలలో, మీ కస్టమర్ లలో కలగవచ్చును. అయితే ఇవన్ని సక్రమంగా జరగాలంటే క్లౌడ్ సర్వీస్ లు అంతో సహాయపడతాయి.

Simple గా ఉంచడం:

బిజినెస్ లో అత్యంత సాధారణంగా చేసే రోజువారి పనులు బిజినెస్ చేసే వారికి కాస్త క్లిష్టరమైనవిగా అనిపిస్తాయి కానీ ఈ క్లౌడ్ సర్వీస్ లు payroll maitenance ను గాని, టెలికాం అవసరాలను గాని, సులభతరం చెయ్యడానికి ఈ క్లౌడ్ సర్వీస్ లు సహకరిస్తాయి.
చాలా క్లౌడ్ ఫోన్ సర్వీస్ లు ఎన్నో మంచి ఫీచర్ లను అందిస్తున్నాయి. కనుక వాటిని వినియోగించుకొని మీ పనిని వీలైనంత సులభతరం చేసుకోవచ్చు.

 

 

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

Read Online Business Updates, Startup news in your E-mail

You have Successfully Subscribed!