ఫేస్ బుక్ పేజి ద్వారా online Portrait బిజినెస్ చేస్తున్న స్టూడెంట్

Vennela Haritha portrait

నరసింహ నాయుడులో బాలయ్య చెప్పినా ….కృష్ణం వందే జగద్గురుంలో కోటా చెప్పినా ” కళ అనేది సమాజాన్ని నిదురలేపేది “. కళ అంటే నాట్యం కావచ్చు, నటన కావచ్చు, సంగీతం కావచ్చు, బొమ్మలు వేయటం కావచ్చు….

చదవుకోకపోయిన సైంటిస్ట్ అవ్వచ్చు కాని….మనలో కళ లేకుండా ఎంత నేర్చుకున్నాగాని ఆర్టిస్ట్ కాలేవు.అమీర్ పేటలో ఏదో ఒక నెల రోజుల కోర్స్ నేర్చుకుంటే వచ్చేసేది కాదు  ఒక కళ అంటే.

టెక్నాలజీ పెరిగి మంచి కెమెరా ఉన్న మొబైల్ చేతిలో ఉన్నపటికీ , హై క్వాలిటీ కెమెరాలతో ఫోటోలు తీసుకునే సదుపాయం ఉన్నపటికీ కుడా…ఎవరయినా స్వయంగా తమ చేతితో గీసిన బొమ్మలో మన రూపం చూసుకోవటం అనేది “ఆనంద్ -మంచి కాఫీ లాంటి సినిమా ” లాగా ఒక చక్కని అనుభూతి.

ఇక అసలు విషయానికి వస్తే ….ఒక వెబ్ సైట్ లో ఆర్టికల్ కామెంట్లు చదువుతున్న నాకు Commissioned Portraits అనే ఫేస్ బుక్ పేజి కనపడింది.Portrait అనే పదం చూడగానే మనలోని ఆర్టిస్ట్ నిద్ర లేచాడు.ఆసక్తి గా ఆ ఫేస్ బుక్ పేజి ఓపెన్ చేశా.

అక్కడ ఉన్న ఆర్ట్ పిక్చర్స్ చాలా బాగున్నాయి… ఒక డిగ్రీ చదివే అమ్మాయి Vennela Haritha ఫేస్ బుక్ పేజిలో ఆ బిజినెస్ రన్ చేస్తుంది అని తెలుసుకొని మన smarttelugu.com Readers కి ఉపయోగపడుతుంది అని తన ఇంటర్వ్యూ తీసుకున్నాను.

Haritha తన బిజినెస్ కి ఫేస్ బుక్ పేజి ఎలా ఉపయోగించుకుంటుంది అనేది చుడండి…మీకు కుడా ఏదయినా చిన్న ఐడియా లేదా ఆర్ట్ ఉంటె, ఆలోచించకండి. ఈ ఇంటర్వ్యూ చదివి మీరు ఫేస్ బుక్ లో బిజినెస్ స్టార్ట్ చెయ్యండి.

హాయ్ హరిత…మీ గురుంచి కొద్దిగా మా స్మార్ట్ తెలుగు రీడర్స్ కి చెపుతారా?

హలో..నా పేరు వెన్నల హరిత. పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. ప్రస్తుతం St.Anns Womens college, Hyderabad లో  డిగ్రీ  చదువుతున్నాను.

ఆర్ట్ వేయటం అనేది నా హాబీ మరియు ఇష్టమయిన పని. ఆ హాబీనే చిన్న బిజినెస్ గా మారింది. ఇలా ఫ్రీ టైం లో ఆర్ట్ వేస్తున్నపటికి నా చదువుకి కుడా ప్రాధాన్యత ఇస్తున్నాను.

Protrait business telugu

Commissioned Portraits  అనేది ఏంటి ?

Commissioned Portraits అనేది 2013 లో స్టార్ట్ చేసిన ఫేస్ బుక్ పేజి. సరదాగా ఇంట్రెస్ట్ తో స్టార్ట్ చేసిన ఈ వ్యాపకం ఇప్పుడు నాకు చిన్న బిజినెస్ గా మరి మంచి పాకెట్ మనీ ఇస్తుంది.
ఈ ఫేస్ బుక్ పేజి ద్వారా నేను అడిగినవారికి వారి స్కెచ్ వేసి ఇస్తాను. నాకు ఎక్కువగా Portraits ఆర్డర్లు వస్తాయి. 2013 నుండి నేను ఒక్కదానినే ఈ ఫేస్ బుక్ పేజి మైంటైన్ చేస్తూ ఈ బిజినెస్ రన్ చేస్తున్నాను.

Facebook business telugu

Commissioned Portraits ఫేస్ బుక్ పేజి ద్వారా ఎలా సంపాదిస్తున్నావు?

సింపుల్….స్కెచ్ కావాల్సిన వారు వారి ఫోటో పంపిస్తారు. నేను దాని కాస్ట్ చెపుతాను.

దానికి వారు ఒకే అంటే…నేను బొమ్మ గీసి కొరియర్ ద్వారా లేదా స్వయంగా అందజేస్తాను. దానికి పేమెంట్ నాకు ఆన్ లైన్ లో transfer చేస్తారు. లేదా డైరెక్ట్ గా కాష్ అందజేస్తారు.

నెలకు ఎంత మనీ వస్తుంది ?

ఆర్డర్స్ బట్టి నాకు వచ్చే అమౌంట్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నేను డిగ్రీ చదువుకుంటూ  ఒక పార్ట్ టైం గా రన్ చేస్తుండటం వలన నెలకు 5000Rs వరకు సంపాదిస్తునాను. కాని ఒక్కోసారి ఎక్కువ కుడా రావచ్చు.

ఒక ఆర్డర్ కి కనీసం 1000Rs ఛార్జ్ చేస్తాను.అయితే అది ఏ టైపు ఆర్ట్ వర్క్, అలానే ఆ పిక్చర్ లో ఎంత మంది మనుషులు ఉన్నారు లాంటి అంశాల పైన ఆధారపడి ఉంటుంది.

బిజినెస్ కోసం ఫేస్ బుక్ ని ఎలా ఉపయోగించుకుంటూన్నావు?

Facebook page : www.facebook.com/commissionedportraits

నా బిజినెస్ మొత్తం ప్రస్తుతం ఫేస్ బుక్ మీద రన్ అవుతుంది. నేను ఇదివరకు గీసిన ఆర్ట్  పిక్చర్స్ కుడా ఈ పేజిలో ఉంటాయి .

ఆర్డర్ ప్లేస్ చేయటమ దగ్గర నుండి ఎక్కడ డెలివర్ చెయ్యాలి లాంటి సంగతులు అన్ని ఫేస్ బుక్ పేజి వేదికగానే జరుగుతుంది.

ఫేస్ బుక్ పేజి లో మెసేజ్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది.

స్కెచ్ కావాల్సిన వారు …ఫేస్ బుక్ లో వారి వివరాలతో మెసేజ్ పెడతారు. ఫోటో ని ఈమెయిలు ద్వారా పంపిస్తారు.

కొన్ని సార్లు whatsapp ద్వారా కుడా కమ్యూనికేషన్  జరుగుతుంది.ప్రొఫెషనల్ వెబ్ సైట్ కానపట్టికీ ఒక ఫ్రీ Platform  మీద చిన్న వెబ్ సైట్ రన్ చేస్తున్నాను.

నీ ఆర్ట్ కి గుర్తింపు దొరికిన సందర్భాలు ఏమయినా ?

ఎవడు సినిమా పోస్టర్ కోసం రామ్ చరణ్ ,అల్లు అర్జున్ కలిసి ఉండే ఆర్ట్ అల్లు అర్జున్ Official Facebook Pageలో పోస్ట్ చేసారు.
నాని నటించిన జండా పై కపిరాజు మూవీ ఆర్ట్ కుడా నాని Official Facebook Pageలో పోస్ట్ చేసారు.
ఇక ప్రత్యేకంగా కాఫీతో రూపొందించిన బాహుబలి ఆర్ట్ గురుంచి నమస్తే తెలంగాణా న్యూస్ పేపర్ ,జిందగీ ఎడిషన్ లో ప్రచురింపబడింది.

Telugu online business facebook

భవిష్యతులో  నీ  గోల్ లేదా ఈ బిజినెస్ గురుంచి నీ ప్లాన్స్ ఏంటి ?

ప్రస్తుతం ఒక ఇయర్ కి 50,000 నుండి 60,000 టర్న్ ఓవర్ సాధించాలి అనేది నా టార్గెట్ .
Hyper అంటే అచ్చం ఫొటోగ్రాఫ్ లా కనపడే స్కెచ్ లు గీయటానికి ట్రై చేస్తున్నాను. భవిష్యతులో మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకోవాలనేది నా ఆశయం.

ఒక మంచి ఆర్ట్ కోసం నిన్ను కలవాలి అంటే ?

Facebook page : www.facebook.com/commissionedportraits

Website : http://vennelaharitha.wix.com/commissionedportrait

Email : [email protected]

స్మార్ట్ తెలుగు గురించి నీ అభిప్రాయం?

స్మార్ట్ తెలుగు గురుంచి చెప్పాలి అంటే..నా లాంటి Young entrepreneurs కోసం తెలుగు లో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఫస్ట్ వెబ్ సైట్ . మాలాంటి బిజినెస్ చేసే వారికి ఈ వెబ్ సైట్ చాలా  ఉపయోగపడుతుంది. Thanks to smarttelugu.com

హరిత కోసం స్మార్ట్ తెలుగు స్మార్ట్  టిప్స్  :

  • ఇండియాలోని మంచి ఆన్ లైన్ గిఫ్ట్ పోర్టల్స్ వారితో మాట్లుడుకొని వారి సర్వీసెస్ లో నీ ఆర్ట్ సర్వీస్ జతచేయటం. అంటే, వారి వెబ్ సైట్ కి ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ నువ్వు supply చేస్తావు. ఆర్డర్ ఇచ్చినందుకు ఆ వెబ్ సైట్ వారికి ప్రతి ఆర్డర్ లో కొంత అమౌంట్ Pay చెయ్యొచ్చు.
  • నీ బిజినెస్ కి తగ్గట్టు మంచి వెబ్ సైట్ Domain కొనుక్కోవటం.
  • వర్డుప్రెస్సు లాంటి ఫ్రీ సర్వీసెస్ ఉపయోగించుకొని నీ ఆర్ట్ వర్క్ అంతా చూపిస్తూ మంచి వెబ్ సైట్ రూపొందిన్చుకోవటం.
  • ఆన్ లైన్ Payments  కోసం PayPal లాంటి ఫ్రీ పేమెంట్ సర్వీసెస్ ఉపయోగించుకోవటం

హరిత బిజినెస్ కి మంచి స్కోప్ ఉంది. ఆర్ట్ లేదా పిక్చర్ పర్సనల్ గానే కాకుండా ఒకరు ఇంకొకరికి గిఫ్ట్ ఇవ్వటానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇప్పుడు వెరైటీ గిఫ్ట్ ల కోసం చూస్తున్న జనాలకు Commissioned Portraits ఒక మంచి ఆప్షన్.

 

 About Blog Author
నా పేరు రవికిరణ్. Entrepreneur - Digital Marketing Analyst and Blogger.

Startups,Social Media,Digital Marketing,Online Business,Online Money నాకున్న  knowledge & Experience ఈ బ్లాగ్ లో తెలుగు లో రాస్తున్నాను.

ఇంటరెస్ట్ ఉన్న వారు నా Facebook Profile ​ Follow  అవ్వండి
SUBSCRIBE Our Youtube Channel for Videos

Comment using Facebook for quick reply

3 Comments

  1. sankar tatolu October 29, 2015
  2. Prabhakar August 6, 2016

క్రింద కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియచేయండి..నలుగురితో షేర్ చేసుకోండి

హాయ్... నా పేరు రవికిరణ్. స్మార్ట్ తెలుగు బ్లాగ్ Founder & Writer

ఆన్ లైన్ బిజినెస్ - బ్లాగింగ్ - స్టార్ట్ అప్స్ గురించి ఆర్టికల్స్ డైరెక్ట్ గా ఈ-మెయిల్  పొందటానికి, నాతో ఈ-మెయిల్ ద్వారా టచ్ లో ఉండటానికి మీ పేరు, ఈ-మెయిల్ ఇచ్చి Subscribe అవ్వండి. 

Subscribe Now

 About Blog Author
నా పేరు రవికిరణ్. Entrepreneur - Digital Marketing Analyst and Blogger.

Startups,Social Media,Digital Marketing,Online Business,Online Money నాకున్న  knowledge & Experience ఈ బ్లాగ్ లో తెలుగు లో రాస్తున్నాను.

ఇంటరెస్ట్ ఉన్న వారు నా Facebook Profile ​ Follow  అవ్వండి
SUBSCRIBE Our Youtube Channel for Videos
error: Content is protected !!