nallamothu sridhar videos

కసితో  సాధించండి  …ఫేస్ బుక్ లో చదివిన ఈ వాక్యాలు నా ఆలోచనల మీద చాలా ప్రభావం చూపించాయి.వాటిని రాసింది తెలుగు తోలి టెక్ గురు computer era “Nallamothu sridhar” గారు.

నా www.smarttelugu.com బ్లాగ్ ని రూపొందించటానికి నన్నుపరోక్షంగా ప్రభావితం చేసిన వ్యక్తి  శ్రీధర్ గారికి “ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు” తెలియజేస్తూ “smart people”  అనే  సరి కొత్త  కాలమ్ బ్లాగ్ లో మొదలు పెడుతున్నాను.

ఈ కాలమ్ లో ఈ వారం నుండి ఇంటర్నెట్ ని స్మార్ట్ గా ఉపయోగించుకొని నలుగురికి దారి చూపే వారిని , ఇంటర్నెట్ ద్వారా తమ సొంత కాళ్ళ మీద నిలబడే వారిని, ఇంటర్నెట్ ద్వారా నలుగురికి ఉపాధి కలిగించే వారి గురుంచి ఆర్టికల్స్ రాస్తాను.

ఆ క్రమంలో ఇంటర్నెట్ ని తన సొంత లాభానికి కాకుండా…నలుగురికి విజ్ఞానం అందజేయటానికి ఉపయోగిస్తున్న టెక్నికల్ encyclopedia అయిన తోలి తెలుగు టెక్ గురు computer era magazine editor nallamothu sridhar గారి గురుంచి రాస్తున్నాను.

ఆయనకి ఉన్న విషయ పరిజ్ఞానానికి ఇంగ్లీష్ లో బ్లాగ్ ,యుట్యూబ్ ఛానల్ వీడియోలు చేసుకుంటే ఇండియాలో ని ప్రముఖ బ్లాగర్ల లిస్టులో మొదట ఉండేవారు.
కాని మన తెలుగు వారి కోసం…తెలుగు మీద ఇష్టంతో ఆయనా తెలుగులోనే టెక్నికల్ విషయాలను అందించటం మన అదృష్టం.

Nallamothu sridhar గారు ఎవరు?

మీరు తెలుగు వారై మరియు టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారయితే తప్పకుండా శ్రీధర్ గారి గురుంచి తెలిసే ఉంటుంది.శ్రీధర్ గారి పేరు వినలేదంటే మీరు ఇంటర్నెట్ ఉపయోగించని తెలుగు వారి జాబితాలో ఉన్నట్లే.

సినిమా స్టార్ లు, రాజకీయనాయకుల వలన ఎంత ఉపయోగమో నాకు తెలియదు గాని…సాంకేతిక నిపుణులు అయిన శ్రీధర్ గారు వలన ఎంతో మంది ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఎంతో మంది తమ జీవితాలని దిద్దుకున్నారు.

ఫిల్మ్ జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన శ్రీధర్ గారు ..1996లో “కంప్యూటర్ వరల్డ్” తో తన టెక్నికల్ ప్రయాణాన్ని మొదలు పెట్టారు.ఆ తరువాత 2001 లో “కంప్యూటర్ ఏరా” అనే టెక్నికల్ పత్రిక ఎడిటర్ గా టెక్నాలజీ రంగంలో ఒక బ్రాండ్ ను రూపొందించారు..

ఆ పత్రిక చదివి టెక్నికల్ పరిజ్ఞానం పెంచుకున్న జనాలు చాలా మంది ఉన్నారు. కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుండి …పెద్ద కంపెనీ లో పని చేసే మేనేజర్ ల వరకు శ్రీధర్ గారి “కంప్యూటర్ ఏరా ” నుండి చాలా విషయాలు తెలుసుకుంటున్నారు.

Nallamothu sridhar  గారి facebook :

అందరు ఫేస్ బుక్ ని చాటింగ్ కో, నలుగురితో కలవటానికో, తమ ఫోటోలు వీడియోలు ఇతరులకు చూపించి ఆనందించ టానికొ ఉపయోగిస్తుంటే , శ్రీధర్ గారు మాత్రం ఫేస్ బుక్ ని కొన్ని వేల మందికి “టెక్నాలజీ విజ్ఞానం” అందించటానికి ఉపయోగిస్తున్నారు.

నాకు తెలిసి ఇంటర్నెట్లో ఉన్న మొత్తం తెలుగు వారి ఫేస్ బుక్ పేజిలలో ప్రజల జీవితానికి ఉపయోగపడే మొదటి ఫేస్ బుక్ పేజి శ్రీధర్ గారిదే.ఎంతో మంది రోజు ఆయన ఇచ్చిన అప్ డేట్ లు, విషయాలు ఫాలో అవుతూ చాలా నేర్చుకుంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా జరిగే టెక్నికల్ అప్ డేట్ లను ఎప్పటి కప్పుడు బులెట్ కంటే వేగంగా శ్రీధర్ గారు తన ఫేస్ బుక్ పేజి ద్వారా అందిస్తారు.

నేను ఈ ఆర్టికల్ రాసే టైం కి మొత్తం FBలో ఫ్రెండ్స్, ఫాలోయర్స్ కలిపి 30,000+ మంది ఉన్నారు. మీరు ఫాలో అవ్వాలంటే కింద లింక్ క్లిక్ చెయ్యండి.

https://www.facebook.com/nallamothusridhar

Nallamothu sridhar గారి Youtube videos :

యుట్యూబ్ అంటే చాలా మందికి ఒక ఎంటర్టైన్మెంట్ చానెల్.సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, పాటలు, కామెడీ వీడియో లు…ఇలా టైం పాస్ చెయ్యటానికి ఒక ఆన్ లైన్ వారధి.

కాని అతి శక్తీ వంతమయిన దాని రొండో రూపు ఎలా ఉంటుందో శ్రీధర్ గారు లాంటి వారు చాటి చెపుతున్నారు.

ఒకటా రొండా ..కొన్ని వందల టెక్నికల్ వీడియోలు. అవి కుడా మంచి నాణ్యతతో కూడిన HD వీడియోలు.

మనకి రోజు వారి జీవితంలో పనికొచ్చే మొబైల్ ఆప్ లు, మహిళలకు ఉపయోగపడే ఆప్ లు,టెక్నికల్ ప్రాబ్లంలకి సమాధానాలు,ఉపయోగపడే వెబ్ సైట్ పరిచయాలు…..ఇలా ఎన్నో వీడియోలు.

ఒక్కో వీడియో చెయ్యటానికి అయన పడే కష్టం,తపన ప్రతి వీడియోలోను ప్రతిభంభిస్తుంది.

హై క్వాలిటీలో  చేసిన ఈ వీడియో చూడండి.చాలా నేషనల్ యు ట్యూబ్ చానల్స్ కుడా ఇంత క్వాలిటీ వీడియోలు రూపొందించలేకపోతున్నాయి.

నేను ఈ ఆర్టికల్ రాసే టైం కి యుట్యూబ్ సబ్‌స్కైబర్లు 31,552 మంది ఉన్నారు.మీరు ఫాలో అవ్వాలంటే కింద లింక్ క్లిక్ చెయ్యండి.

https://www.youtube.com/user/nallamothu

computer era website & blog :

అయన వీడియోలు మొత్తం మీకు ఈ వెబ్ సైట్ లో పొందుపరుస్తారు. http://computerera.co.in/

అలానే ఆయనా రాసే టెక్నికల్ ఆర్టికల్స్ నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు అనే ఈ కింద బ్లాగ్ లో మీరు చదవొచ్చు.
http://computerera.co.in/blog/

ఈ రోజు చాలా మంది తెలుగు యువత టెక్ బ్లాగ్ లు,వీడియో ఛానల్ మొదలుపెడుతున్నారు అంటే దానికి మూలం శ్రీధర్ గారే.

పర్సనాలిటీ డెవలప్మెంట్ :

ఆయనలో టెక్నాలజీ ఒక కోణం అయితే..అయన లోని ఇంకో అద్భుత కోణం పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్.
జీవితం గురుంచి మనుషుల గురుంచి అయన చెప్పే విషయాలు ఎంతో ప్రేరణగా మనకి కిక్ ఇచ్చే విధంగా ఉంటాయి.

Nallamothu Sridhar

 

మనుషుల గురుంచి… బంధాల గురుంచి ఆయన రాసిన “రిలేషన్స్ ” అనే పుస్తకం ప్రతి ఇంట్లో ఉండాల్సిన మంచి పుస్తకం.

ఈ రోజుల్లో స్నేహం గురుంచి అయన రాసిన ఆర్టికల్ ఈ కింద లింక్ లో చుడండి….సత్యాన్ని ఎలా వివరించారో.
https://www.facebook.com/nallamothusridhar/posts/1030000317023731

 

హెల్పింగ్ నెట్ వర్క్ :

టెక్నికల్ విషయాల్లోనే కాదు , నలుగురికి హెల్ప్ చేయటంలో, తన ఫేస్ బుక్ ఫాన్స్ ని, తన నెట్ వర్క్ లోని జనాలను ఎవరికయినా సహాయపడమని ఉత్తెజపరచటం లో శ్రీధర్ గారు చాలా ముందుంటారు.
మదర్స్ డే రోజున ఆయన తన నెట్వర్క్ ద్వారా తల్లి కాబోతున్న ఒక మహిళకు చేసిన హెల్ప్ చుడండి.

Sridhar Nallamothu blog

 

యూత్ కి ఇన్స్పిరేషన్ :

ఎవరో హీరో కాలుకి దెబ్బ తగిలినా డాన్సు వేసాడు అంటా, ఇంకో హీరో జ్వరం వచ్చినా షూటింగ్ లో పాలుగోన్నాడు అంటా..అని వారి ఫాన్స్ గొప్పగా చెప్పుకుంటారు.
కాని ఆక్సిడెంట్ అయ్యి నరకం అంటే ఏంటో చూసి వచ్చిన శ్రీధర్ గారు,అసలు చెయ్యి కదల్చలేని సమయంలో మొండి దైర్యంతో ఒంటి చేత్తో పత్రికను రూపొందించిన వీధానం ఈ రోజుల్లో యూత్ కి ఒక మంచి ఇన్స్పిరేషన్ టానిక్.

ఆ అనుభవాన్ని గురుంచి ఆయన వివరించిన ఆర్టికల్ పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తుంది.

https://www.facebook.com/nallamothusridhar/posts/983805448309885

 

ఆయన గురించి చెప్పాలంటే ఈ ఒక్క ఆర్టికల్ చాలదు.

సినిమా మనకి తొందరగా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఒక్కటే చెపుతాను.బాహుబలి మన తెలుగు సినిమా అని ఎంత గర్వంగా చెప్పుకున్నామో..అంత కంటే గొప్పగా శ్రీధర్ నల్లమోతు అనే వ్యక్తి మన తెలుగు టెక్ నిపుణులు అని చెప్పుకోవటం అతి సయోక్తి కాదు.

టెక్నాలజీని తెలుగులో సామాన్యులకి అందజేస్తున్న అసామాన్యుడు computer era నల్లమోతు శ్రీధర్ గారు.

మీ ఫ్రెండ్స్ తో కుడా ఈ ఆర్టికల్ షేర్ చేసుకోండి.

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

Read Online Business Updates, Startup news in your E-mail

You have Successfully Subscribed!