ఏ బిజినెస్ లోనైనా కస్టమర్ లది ముఖ్యమైన భాగం. బిజినెస్ కి ఉండే అత్యుత్తమ ఆస్థి కస్టమర్లే.. కాబట్టి ఒక బిజినెస్ లో కస్టమర్ రిలేషన్స్ సక్రమంగా ఉండటం ఎంతో అవసరం.

ఎటువంటి చెడు జరగకుండా కస్టమర్ లకు అసౌకర్యం కలుగకుండా ప్రతి బిజినెస్ తప్పని సరిగా అనుసరించాల్సిన కొన్ని ఉత్తమ CRM (customer relationship management) పద్దతులను ఇప్పుడు చూద్దాం.

CRM vendor ను ఎంచుకోవడం:

ప్రతి బిజినెస్ యొక్క కస్టమర్ రేలషన్ షిప్ మేనేజ్మెంట్ అవసరాలు వేరు వేరుగా ఉంటాయి. కాబట్టి CRM సర్వీస్ ను అందించే కంపెనీ ను ఎంచుకోనేప్పుడు మీకు అవసరమైన సేవలు అందించే కంపెనీను సెలెక్ట్ చేసుకోవాలి.

CRM యొక్క సెట్ అప్ టైంను పరిగణించాలి:

మీరు మీ బిజినెస్ కు మొదటిసారి CRM ను సెట్ అప్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా పరిగణించాల్సిన అంశాలు దాని ఇన్స్టలేషన్ సులభంగానూ, తక్కువ సమయం పట్టేది గానూ ఉండాలి, అలాగే వాడేందుకు కూడా సులభంగా ఉండటం అవసరం. అలానే మీ CRM లో ఉండే కొన్ని ప్రత్యేక ఫీచర్స్ ను కూడా గమనించాలి.

సెలెక్ట్ చేసే ముందు రీసెర్చ్ చెయ్యటం:

ఉచితంగా లభించే CRM ఆప్షన్స్ కూడా చాలానే ఉంటాయి కనుక వాటిని తీసుకోకుండా ఫీచర్ లను బట్టి review లను బట్టి CRM ను సెలెక్ట్ చేసుకోవచ్చును. అవసరమైనంత సమాచారాన్ని ముందుగానే సేకరించి ఆ తరువాత అవసరమైన సమాచారాన్ని సేకరించవచ్చును.

CRM ను అందించే కంపెనీ యొక్క సర్వీస్ మోడల్ ను పరిశీలించడం:

CRM సర్వీస్ అనేది ఒక నెల లేదా ఒక సంవత్సరంతో అయిపోయే పని కాదు నిరంతరం దాని అవసరం ఉంటూనే ఉంటుంది అలాగే CRM కంపెనీ తో కూడా నిరంతరం సహకారం కొనసాగించవలసి వస్తుంది కనుక కంపెనీను ఎన్నుకునే ముందు వారి సర్వీస్ మోడల్ ను పరిశీలించినట్లయితే వారి గురించి ఒక అభిప్రాయం రావడానికి ఉపయోగపడుతుంది.

ఫీచర్ లకు మించి:

CRM లో కస్టమర్ లు ఫీచర్ లను ఎంతగా కోరుకుంటారో సౌకర్యాన్ని కూడా అలాగే కావాలనుకుంటారు కనుక మీరు CRM ను ఎంచుకొనే ముందు అది కస్టమర్ లకు వాడేందుకు సౌకర్యం గాను మరియు అలాగే వివిధ రకాల device ల ద్వారా చూడగలిగే విధంగానూ ఉండాలి. అదే విధంగా దాని ధర మీ బడ్జెట్ కు అనుకూలంగా, మీకు flexible గా ఉండాలి.

Personalization:

నేటి తరం ఆధునిక కస్టమర్ లను ఆకర్షించే విధంగా personalized మెసేజ్ లను ఈమెయిల్లను పంపే విధంగా, ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా personalized పద్దతుల ద్వారా కస్టమర్ లను ఆకర్షించే విధంగా మీ CRM ఉండాలి.

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం:

మీ బిజినెస్ యొక్క భవిష్యత్తు ను దృష్టిలో ఉన్చోకొనే ఎప్పుడు CRM ను ఎంచుకోవాలి, ఆ CRM అనేది మీ యొక్క బిజినెస్ గోల్స్ ను నెరవేర్చేందుకు ఉపయోగకరంగా ఉండాలి.

 

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

Read Online Business Updates, Startup news in your E-mail

You have Successfully Subscribed!