Btech తరువాత కొన్ని క్రియేటివ్ Careers

0
CREATIVE CAREERS AFTER BTECH

బి టెక్ అయిపోయాక ఉద్యోగం రావట్లేదు, ఇప్పుడు ఏమి చెయ్యాలి ? అని అడిగితే ….. ఆఫీస్ నుండి 5 గంటలకు వచ్చి , హాల్ లో ఫ్యాన్ వేసుకొని కూర్చుని పొద్దున్న చదవని పేపర్ తీరగేస్తూ , సలహాకె సహాయం చేసే మాస్టర్ లాగా ఫోజు పెట్టి ఏ MBA నో, అమెరికా వెళ్లి MS లో చేయమని చెప్పే పాత తరం అంకుల్ టైపు వెబ్ సైట్ అనుకున్నారా ………స్మార్ట్ తెలుగు రా !!!!!!!!!

BTech చదివి ఆ ఉద్యోగం చేయటం ఏంటిలే అని కొందరు , చుట్టూ ఉన్న వారు ఏమి అనుకుంటారో అని కొందరు …ఇలా ఇంటరెస్ట్ ఉండి కూడా వదిలేస్తున్నారు .అలాంటి వారి కోసం స్మార్ట్ తెలుగు వెబ్ సైట్ నుండి కొన్ని కెరీర్ ఆప్షన్ లు . నాకు తెలియని మంచి కెరీర్లు ఇంకా మీకేమయినా తెలిస్తే కామెంట్ లో చెప్పండి . మనసుకి నచ్చిన పని చేస్తే …డబ్బు ,పేరు అదే వస్తుంది . ట్రై చేయండి బాస్ .

వీడియో ఎడిటర్ :

సినిమా , చిన్న సినిమా , సీరియల్ , యుట్యూబ్ చానెల్స్ , షార్ట్ ఫిలిమ్స్ , కార్పొరేట్ వీడియోస్ , స్టార్ట్ అప్ వీడియోస్ ….అబ్బో ఇప్పుడు వీడియో షూట్ చేసే వారు , వీడియో కావాల్సిన వారు బోలెడు మంది. భవిష్యత్తు లో ఫేస్ బుక్ లో 85 శాతం పోస్ట్లు వీడియోలే ఉంటాయి అంట.
మరి ఈ టైం లో ఆ వీడియోలు కత్తిరించి కాన్సెప్ట్ కరెక్ట్ గా చెప్పటానికి “ఎడిటర్” చాలా ముఖ్యం . ఈ పని నేర్చుకుంటే , క్రియేటివ్ ఫీల్డ్ పుస్తకంలో మీకో పేజీ ఉంటుంది .

చెఫ్ :

పెళ్లి చూపులు సినిమా చుసిన వారికి ప్రత్యేకంగా చెప్పకుండానే అర్ధం అయిపోతుంది . బిజీ లైఫ్ లో ఇంట్లో వంట చేసుకునే యూత్ ని ఈ సిటీలలో వెతికినా దొరకరు . అందుకే , వీధికొకటి కాకుండా రెండు ,మూడు రెస్టా రెంట్లు పుడుతున్నాయి . డ్రైవ్ ఇన్ అని కొత్త ట్రెండ్ కూడా పుడుతుంది . మరి వంద మంది తినే వారు ఉంటె , వండే వాడు ఒక్కడో , ఇద్దరో . ఎక్కడ డిమాండ్ ఉందొ అక్కడ మనీ ఉంది .నలుగురికి వంట చేసి ఆహా అని పించుకుంటే తృప్తికి తృప్తి ….డబ్బు కి డబ్బు .

బ్లాగర్ :

మన బుర్రలో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే talent ఉంటె ఏమి లాభం … అది నలుగురికి తెలియాలి కదా. ఒక బ్లాగ్ తో మీ టాలెంట్ ని నలుగురికి తెలియజేయండి . చెప్పే వారు లేక చదివే వారు తగ్గిపోయారు కానీ , ఆకట్టుకునే విధంగా చెపితే చదివే వారు , వినేవారు బోలెడు మంది . జనం ఎక్కడ ఉంటె ..ధనం అక్కడ ఉంటుంది . క్లిక్ అయితే పేరు , డబ్బు వస్తుంది. క్లిక్ అవకపోతే మంచి మార్కెటింగ్ స్కిల్స్ వస్తాయి .

టెక్నికల్ కార్పొరేట్ ట్రైనర్ :

ఒకప్పుడు బతకలేక బడి పంతులు …ఇప్పుడు ఐ.టి ఉద్యోగాలు వదిలి మరి ట్రైనర్ లు అవుతున్నారు . కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడే స్కిల్, ఏదయినా టెక్నికల్ సబ్జెక్టు లో పట్టు ఉంటె చాలు .
కంపెనీలు కొత్త ఉద్యోగులను చేర్చుకున్నపుడు వారికి ట్రైనింగ్ ఇవ్వటానికి ఈ కార్పొరేట్ ట్రైనర్ల కోసం చూస్తాయి . కొద్దీ పాటి ఎక్స్పీరియన్స్ తో నెలకు లక్షలు ఛార్జ్ చేస్తున్న కార్పొరేట్ ట్రైనర్ లు బోలెడు మంది .

ఫిట్ నెస్ ట్రైనర్ :

ప్రతోడికి ఫిట్ నెస్ కావాలి , ఫిట్ గా ఉండాలి అనుకుంటాడు . కానీ ఎలానో తెలియదు , ఎవడు చెపుతాడో తెలియదు . మరి మీకు ఫిట్ నెస్ మీద మంచి పట్టు ఉంటే , సామాన్యుడికి దగ్గర నుండి సీలెబ్రిటీ వరకు మీ కస్టమర్ల గా మారిపోతారు.

హెయిర్ స్టైలిస్ట్ :

జుట్టు కత్తిరించే పని ఏంటిరా అని ఇంట్లో వాళ్ళు తిడతారు …తిట్టని బాసు .ప్రతి రోజు కొత్తదనం కోరుకునే యూత్ కి కొత్త టైపు లో హెయిర్ స్టైల్ ఇచ్చి చూడు . వారు అద్దం చూసుకొని ఆనందించే టైం లో వాడి హెయిర్ స్టైల్ లో నువ్వే కనపడుతావు . ఈ ప్రొఫెషన్ కి డిమాండ్ అదిరిపోతుంది.

ఈవెంట్ మేనేజర్ :

ప్రైవేట్ ఫంక్షన్ లు , స్టార్ట్ అప్ ఈవెంట్లు , కార్పొరేట్ ఈవెంట్లు పెరిగిన ఈ టైం లో ఈవెంట్ నిర్వహించే వారు ఎంతో అవసరం . అలనాటి ఈవెంట్ మేనేజర్ ఉద్యోగానికి మంచి లైఫ్ ఉంది .

యాంకర్ :

యాంకర్ అనగానే ట్ ట్.వి ఒకటే అనుకునేరు . ఫామిలీ ఫంక్షన్స్ , ప్రైవేట్ ఈవెంట్స్ , కంపెనీ ఈవెంట్స్ , ప్రోడక్ట్ రిలీజ్ ఈవెంట్స్ …ఇలా దేనిలో అయినా సరే సందర్భానికి తగ్గట్టు మాట్లాడే వారికి మంచి డిమాండ్ ఉంది .

స్టోరీ టెల్లర్ :

ఒక్కపుడు మన అమ్ముమ్మ ,తాతలు కధలు చెప్పే వారు . ఇప్పుడు పిల్లలకి అమ్ముమ్మ , తాత అంటే కేవలం తమ పసి వయసులో డైపర్లు మార్చిన మనుషులగానే గుర్తుండిపోతున్నారు . మరి ఇంకా కధలు ఎవరు చెపుతారు ..అందుకే సిటీలో స్టోరీ టెల్లర్ లకి డిమాండ్ పెరిగింది . ప్లే స్కూల్ , స్కూల్ , ఇన్స్టిట్యూట్లు , కార్పొరేట్ కంపెనీలు కూడా …స్టోరీ టెల్లర్ లకోసం చూస్తున్నాయి .

పర్సనాలిటీ డెవలపర్ :

నలుగురికి మంచి చెప్పి , నలుగురిలోనూ పాజిటివ్ ఆలోచనలు కలిగించి , మంచి వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మించుకోవాలో అర్ధం అయ్యేలా చెప్పే శక్తీ మీ లో ఉందా ?. కన్సల్టింగ్ ద్వారా , ట్రైనింగ్ ద్వారా , కంపెనీలో చెప్పే గెస్ట్ లెక్చర్ ద్వారా మంచి కెరీర్ పొందచ్చు . మీరు చెప్పే మంచి మాటలతో మారిన మనుషులను చూసినప్పుడు మీకు కలిగే ఆనందం వేరు .

*************************************************************************************************************

ఇలాంటి మంచి ఆర్టికల్స్ కోసం , ఆన్ లైన్ ద్వారా మనీ సంపాదించే మార్గాలు , స్టార్ట్ అప్ ల గురించి తెలుసుకోవాలి అంటే smarttelugu facebook page  Like చేయండి .

బ్లాగ్ స్టార్ట్ చేసే ఇంటరెస్ట్ ఉన్న వారి కోసం “How to start a Blog-Beginners Guide”   అనే ఈ -బుక్ రాసాను . ఇంటరెస్ట్ ఉన్న వారు ఈ లింక్ లో  కొనవచ్చు .

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here