karun designs online

మన smarttelugu వెబ్ సైట్ లోగో చూసారు కదా. ఆ ఒక్క లోగోనే కాదు నా మిగిలిన వెబ్ సైట్ లకి , మరియు నా స్టార్ట్ అప్ ప్రాజెక్ట్ లకి లోగోలు చేసింది “Karun ” అనే మిత్రులు.

ఆన్ లైన్ లో మనీ ఎలా అని నన్ను అడిగే వారి కోసం  “తను ఇంటి దగ్గర నుండే ఆన్ లైన్ లో ఒక మంచి IT ఎంప్లాయ్ శాలరీ అమౌంట్ ఎలా సంపాదిస్తున్నాడో” మీకు తెలియటానికి ఈ ఆర్టికల్.

టాలెంట్ ఉండి కుడా ఆన్ లైన్ లో ఇటువంటి సదుపాయం ఉంది అని తెలియక  ఏదో ఒక జాబు వస్తుంది అని కంపెనీ ల ఓపెనింగ్ కోసం ఎదురుచూసే చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది…అందరికి షేర్ చెయ్యండి .

Update : ఇప్పుడు ఈ టాపిక్ మీద ఆదివారం 10AMకి paid వర్క్ షాప్ (Price -1250 Rs) నిర్వహిస్తున్నాను. ఈ లింక్ క్లిక్ చేసి పేమెంట్ చేసిన వారికి వర్క్ షాప్ వివరాలు, అడ్రస్ , కాంటాక్ట్ వివరాలు ఈ-మెయిల్ కి చేరుతాయి.
Workshop Payment Link : https://imjo.in/pVDSaW

హాయ్ కరుణ…నీ గురుంచి కొద్దిగా  మన  smarttelugu.com రీడర్స్ కి వివరిస్తావా ?

హాయ్ .. నా పేరు Karun. నేను ఒక ఫ్రీలాన్స్  గ్రాఫిక్ డిజైనర్ని . నేను DQ school of visual arts,Hyderabad lo “VFX and 3D texturing”  మీద సర్టిఫికేషన్ చేశా. నేను creative ads మరియు అన్ని రకాల ప్రింట్ & మీడియా designs చేస్తాను.

99designs.com అనే వెబ్ సైట్ లో ఫ్రీలాన్సింగ్ చేస్తూ  డిజైనర్ గా మంచి మనీ మరియు పేరు సాధించాను.నాకు ఈ ఫీల్డ్ లో 5 యియర్స్ ఎక్స్‌పీరియెన్స్ ఉంది. ఇంకా 99designs వెబ్ సైట్ ద్వారా నేను  HP,BERKS&BEYOND.COM, IDEALCANDIDATE.COM లాంటి పెద్ద  కంపనీలతో వర్క్ చేసా.

 ఫ్రీలాన్సింగ్ ఎలా స్టార్ట్ చేసావు?

3డ్ ఫీల్డ్ నేను అనుకున్నంత అభివృద్ధి కనపడక  ఇంకా ఈ ఫీల్డ్ వదిలేద్దాం..ఏదో ఒక బిజినెస్ పెట్టుకుందాం  అని ఫిక్స్ అయిన టైమ్ లో ఈ blog స్థాపించిన రవి కిరణ్ కోగంటి smarttelugu  మరియు తన ఇతర ఆన్ లైన్ బిజినెస్ ప్రాజెక్ట్ ల కోసం నన్ను డిజైన్ వర్క్ చెయ్యమని అడిగారు.

అప్పటి వరకు 3డ్ డిజైన్ వర్క్ లో ఉన్న నేను రవి గారి వర్క్ కోసం గ్రాఫిక్ డిజైన్ మొదలుపెట్టాను. ఆ టైమ్ లో నాకు “రవి గారికి ఎలా డిజైన్ వర్క్ అవసరమయిందో ..ఆలా చాలా మంది ఉంటారు కదా , వారికి కుడా  ఫ్రీలాన్సింగ్ వర్క్ ఎందుకు మొదలుపెట్టకూడదు” అనే ఐడియా వచ్చింది.

కాని అటువంటి క్లైంట్స్ ఎక్కడ ఉంటారో , ఎలా కలవాలో తెలియలేదు.   అప్పుడు రవి  “ఆన్ లైన్ లో ఫ్రీలాన్సింగ్ చేస్తూ సంపాదించవచ్చు ” వాటికి 99 designs, freelancer .com లాంటి వెబ్ సైట్స్ ఉంటాయి అని చెప్పడం తో  వాటి గురుంచి ఆన్ లైన్ లో రీసెర్చ్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను.

ఆలానే యుట్యూబ్ లో వెబ్ డిజైన్ కి సంభందించిన వీడియోస్ చూస్తూ నాకున్న పరిజ్ఞానాన్ని ఇంకా పెంచుకున్నాను.అలా ట్యూటోరియల్స్ చూసి కొత్త డిజైన్ టెక్నీక్స్ నేర్చుకొని  99designs లో డిజైన్స్ పెట్టడం   స్టార్ట్ చేసా.

ఫ్రీలాన్సింగ్ నీ జీవితాన్ని ఎలా మార్చేసింది?

నేను ఫ్రీలాన్సింగ్ 99designs అనే వెబ్ సైట్ ద్వారా చేస్తున్నాను. దానితో పాటు బయట క్లైంట్స్ కి కుడా వర్క్ చేస్తుంటాను. కాని  99designs నా వర్కింగ్ స్టైల్ని, నా లైఫ్ నే మార్చే సింది.

ఈ వెబ్‌సైట్ వరల్డ్ నెంబర్ 1 డిజైన్ కాంపిటేషన్ వెబ్‌సైట్. ఇందులో అన్ని రకాల డిజైన్ కాంపిటేషన్స్ ఉంటాయి.

లోగోస్(Logos),బ్యానర్స్(Banners), బిజినెస్ కార్డ్స్ (business cards),బ్రౌచెర్స్(Brouchers).ఫ్లైయర్స్(Flyers), యాడ్స్, పోస్టర్స్, illustration works ఇలా అన్ని రకాల డిజైన్స్ కాంపిటేషన్స్ ఉంటాయి.

నేను ఇంట్లో కూర్చొని ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన  క్లైంట్స్ మరియు చాలా పెద్ద డిజైనర్స్ తో కలిపి పని చేయడం ద్వారా చాలా నేర్చుకుంటున్నాను.

నెలకు ఈ వెబ్ సైట్ ద్వారా 60,000 తక్కువ కాకుండా సంపాదిస్తున్నాను. ఒక్కప్పుడు జాబు కోసం వెతికే పరిస్థితి నుండి …ఎక్కడనుండి అయిన వర్క్ చేసుకొని ఒక 5 ఇయర్స్ ఐ. టి ఎంప్లాయ్ శాలరీ  ఇంటి నుండి వర్క్ చేస్తూనే  సంపాదిస్తున్నాను.

ఒక క్లైంట్ కి నేను చేసిన వర్క్ ఇలా ఉంటుంది.

online earn telugu

ఈ వెబ్ సైట్ లో వర్క్ ఎలా ఉంటుంది?

ఇందులో డిజైన్ పరిజ్ఞ్ఞానం ఉన్న ఎవరయినా డైరెక్ట్ గా ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని కాంపిటేషన్స్ అప్లై చెయ్యొచ్చు .

దీనిలో వర్క్ లు ఎక్కువగా కాంపిటీషన్ పద్దతిలో ఉంటాయి. అంటే ఒక వర్క్ కి కొంత మంది ఒకేసారి అప్లై చేస్తే…వారిలో ఒక్కరిని, కొన్నిసార్లు ఇద్దరు ముగ్గురిని విజేతలుగా సెలెక్ట్ చేసి ప్రైజ్ మనీ ఇస్తారు.

ఒక డిజైన్ కాంపిటేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కాంపిటీషన్ వర్క్  గురుంచి వివరాలు పూర్తిగా  అర్దం చేసుకోవాలి. ఏమయినా డౌట్స్ ఉంటె ఆన్ లైన్ లోనే ఆ వర్క్ పోస్ట్ చేసిన క్లైంట్ ని అడిగి తెలుసుకోవచ్చు.

కాంపిటేషన్లలో రకాలు ఉంటాయి.

గ్యారెంటీడ్ కాంపిటేషన్లు :  అంటే తప్పనిసరిగా విన్నర్ ని ఎంపిక చేస్తారు,
బ్లైండ్ కాంపిటేషన్లు: ఇందులో ఎవరి డిజైన్స్ వారికి ,క్లైంట్ కి తప్పితే మిగిలిన పోటిదారులకి కనపడవు.
నాన్ బ్లైండ్ కాంపిటేషన్లు:  ఇందులో మన డిజైన్స్ అందరకి కనపడుతాయి .

అసలు 99designs వెబ్ సైట్ నుండి ఎలా సంపాదిస్తున్నావు ?

మాములుగా కాంపిటేషన్ prize money 10000Rs నుంచి 1.5 LakhsRs దాక ఉంటాయి.ఇందులో క్వాలిఫైయింగ్ రౌండ్,ఫైనల్ రౌండ్ ఉంటాయి.క్వాలిఫైయింగ్ రౌండ్ లో క్లైంట్ తనకు నచ్చిన డిజైన్స్ కి ఫీడ్‌బ్యాక్ ఇచి ఫైనల్ కి కొంత మందిని సెలెక్ట్ చేస్తాడు.

ఫైనల్ లో మాములుగా అయితే ఒక విన్నర్ నే సెలెక్ట్ చేస్తాడు.ఒక్కోసారి క్లైంట్ కావాలంటే 2 లేదా 3 డిజైనర్లలని విన్నర్ గా అనౌన్స్ చేయచ్చు.అందరికి విడివిడిగా విన్నింగ్ అమౌంట్( prize money) ఇస్తారు.

సెలెక్ట్ అయ్యాక క్లైంట్ అడిగిన విధంగా కొన్ని మార్పులు చేసి తనకి వర్క్ అందజెయ్యాలి.క్లైంట్ మన వర్క్ ఓక్ చేసిన తర్వాత మన విన్నింగ్ అమౌంట్ మనకు అందుతుంది.

ఆ మనీ మనకి అందటానికి రకరకాల Payment Methods ఉంటాయి.వాటిల్లో Paypal అకౌంట్ ఈజీగా ఉంటుంది.
ఆన్ లైన్ లో లావాదేవీలకు Paypal ఎకౌంటు ఉపయోగపడుతుంది.ఆ Paypal ఎకౌంటు లో మన ఎకౌంటు వివరాలు జత పరిచి ఉంచాలి. ఇలా Paypal ద్వారా మన బ్యాంకు ఎకౌంటుకి 10 రోజ్జుల్లో అమౌంట్ పంపించబడుతుంది.

 ఈ వెబ్ సైట్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమయినా ఉన్నయ్యా ?

ముఖ్యంగా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే… కాపీరైట్స్ గురించి.

వేరే డిజైనర్స్ యొక్క డిజైన్స్ కాపీ కోటడం కానీ,ఇంటెర్నెట్ లో ఉన్న డిసైన్స్ పెట్టడం గాని,కాపీరైట్స్ కొనుక్కోకుండా ఫోటోలు గాని డిసైన్ మెటీరియల్స్ గాని కాంపిటేషన్ లో పెడితే మన అకౌంట్ ని వెంటనే డిలీట్ చేస్తారు.

పెద్ద కంపెనీలకి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యాలి .

నీలా  ఈ వెబ్ సైట్ ద్వారా  సంపాదించాలనుకునే వారికి  నీ సలహా ఏమయినా ?

నాకు తెలిసినంత వరకు ఆన్ లైన్ లో కష్టపడకుండా మనీ రాదూ.
ఈ వెబ్ సైట్ కుడా అంతే.ఇది వెబ్ డిజైనర్లకి,గ్రాఫిక్ డిజైనర్లకి బాగా ఉపయోగపడుతుంది.

ఒక్కోసారి నేను కొన్ని రోజులు కష్టపడి చేసిన డిజైన్ సెలెక్ట్ అవ్వదు.కొన్ని సార్లు ఫైనల్ వరకు వెళ్లి అక్కడ సెలెక్ట్  అవ్వదు.కొన్ని సార్లు నీ వర్క్ పక్కనొడు కాపీ కొడతాడు. కొంత వర్క్ చేసాక క్లైంట్ వద్దు అనొచ్చు.

మీకు మనీ వస్తుంది అన్నారు, మేము స్టార్ట్ చేసాము మాకు రావట్లేదు అంటే … ఏదో మొక్కుబడికి మొదలుపెట్టాము అని, లేదంటే మన ప్రొఫైల్ పెట్టి ఎవడు వర్క్ ఇవ్వట్లేదు అని, వర్క్ చెయ్యగానే సక్సెస్ అయిపోవాలి అని అనుకుంటే మాత్రం చాలా కష్టం.

అయితే మంచి డిజైన్ నైపుణ్యం ఉండి, సహనం కలిగి ఉంటె .. ఈ వెబ్ సైట్ నుండి మంచి సంపాదన సంపాదించుకోవచ్చు.

Update : ఇప్పుడు ఈ టాపిక్ మీద ఆదివారం 10AMకి paid వర్క్ షాప్ (Price -1250 Rs) నిర్వహిస్తున్నాను. ఈ లింక్ క్లిక్ చేసి పేమెంట్ చేసిన వారికి వర్క్ షాప్ వివరాలు, అడ్రస్ , కాంటాక్ట్ వివరాలు ఈ-మెయిల్ కి చేరుతాయి.
Workshop Payment Link : https://imjo.in/pVDSaW

99designs వెబ్సైటు లింక్ : www.99designs.com

అది సంగతి .. karun స్మార్ట్ గా ఎలా సంపాదిస్తున్నాడో చదివారుగా.మరి ఇది మీకో, మీ సర్కిల్ లో ఎవరికయినా ఉపయోగపడే మంచి ఇన్ఫర్మేషన్…

టాలెంట్ ఉండి కుడా ఆన్ లైన్ లో ఇటువంటి సదుపాయం ఉంది అని తెలియక  ఏదో ఒక జాబు వస్తుంది అని కంపెనీ ల ఓపెనింగ్ కోసం ఎదురుచూసే చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది…అందరికి షేర్ చెయ్యండి .

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

Read Online Business Updates, Startup news in your E-mail

You have Successfully Subscribed!