స్మార్ట్ తెలుగు ఆర్టికల్స్ ఇక పై ఇంగ్లీష్ లో చదవచ్చు.

లైఫ్ లో అభివృద్ధి అవసరం. మనతో మాటు నలుగురికి ఉపయోగపడే అభివృద్ధి అయితే,ఆ ప్రయత్నానికి పడే కష్టానికి ఒక అర్ధం ఉంటుంది.
నా ఆలోచనలు, సబ్జెక్టు కేవలం తెలుగులో మాత్రమే రాస్తునప్పుడు కొద్ది మందికి మాత్రమే దగ్గరయ్యాను. కాని ఆ సబ్జెక్టు తెలుసుకోవాలి అనుకుంటున్న చాలా మంది ఇతర బాషా రీడర్స్ కి తెలుగు వలన అడ్డంకి ఏర్పడుతుంది.అలానే చాలా మంది NRIలు. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ లు తెలుగులో  చదవటానికి ఇబ్బంది పడుతున్నారు.

నా బ్లాగ్  ఇతర రాష్ట్రాల వారు , ఇతర దేశస్తులు కుడా ఫాలో అవుతున్నారు. Google Translator ద్వారా వారి బాషలోకి  ఆర్టికల్స్ మార్చుకొని చదువుకుంటున్నారు.Google Translator లాంటి సర్వీస్ పెట్టినప్పటికీ కుడా , ఆర్టికల్ లోని విషయ పరిజ్ఞానం పూర్తిగా చేరట్లేదు.

అందుకే అన్ని దృష్టిలో పెట్టుకొని , ఈ రెండు రోజులు పూర్తిగా సమయం కేటాయించి శ్రామిక కష్టానికి గుర్తుగా జరుపుకునే  మేడే నాడు  ఇంగ్లీష్ బ్లాగ్ లాంచ్ చేసాను. వచ్చే వారం నుండి ప్రతి సోమవారం ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ ప్రచురించే విధంగా ప్లాన్ చేస్తున్నాను.

అయితే ,దాదాపు నేను తెలుగులో రాసిన ఆర్టికల్స్ నే ఇంగ్లీష్ లో ప్రచురిస్తాను. అప్పుడప్పుడు మాత్రం ఇంగ్లీష్ వెర్షన్ కోసం ప్రత్యెక ఆర్టికల్స్ రాస్తాను.

ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇంగ్లీష్ బ్లాగ్ కుడా ఫాలో అవ్వండి.తెలుగు  చదవలేని వారికి ఇంగ్లీష్ బ్లాగ్ షేర్ చెయ్యండి.

website url : english.smarttelugu.com

Comment using Facebook for quick reply

Add Comment

error: Content is protected !!