Fashion Blog ఎలా స్టార్ట్ చెయ్యాలి ? -Telugu Article

2
HOW TO START A FASHION BLOG

ఫాషన్ … చాలా మంది ఈ పదం కేవలం ఉన్నతవర్గానికి చెందినదిగా భావిస్తారు. కొత్త డ్రెస్ కొనేముందు షోరూమ్ లోని ట్రయిల్ రూమ్ నుండి బయటకు వచ్చి నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతాము . “ఎలా ఉంది అని అడిగే ఆ ప్రశ్నలోనే ఫాషన్ ఉంది”. కొత్త డ్రెస్ కొనుకొన్ని తన వంటికి అది నప్పిందో లేదో అని చూసుకొని మధ్య తరగతి ప్రాణి ఉన్నాడంటారా?

ఒక్కపుడు ఫాషన్ అంటే ఆర్బాటం . ఇప్పుడు ఫాషన్ అంటే అవసరం , ఆనందం. కాలేజీ కి వెళ్లే యువత నుండి ఆఫీస్ కి వెళ్లే అంకుల్ వరకు అందరూ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇక పార్టీలకి , ఫంక్షన్ లకి ఎక్కువగా వెళ్లే జనాభా ఫాషన్ కి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో చెప్పనక్కర్లేదు.

ఉద్యోగం చేసే యువతికి ఫాషన్ గా ఉండటం , ఫాషన్ ట్రెండ్ ఫాలో అవటం అవసరంగా మారింది . పోటీ ప్రపంచంలో ఉద్యోగం రావటానికి , వృద్ధి చెందటానికి  బొట్టు , కట్టే బట్ట కూడా చాలా ముఖ్యపాత్రలు పోషిస్తున్నాయి .
ఇక టెలివిజన్ , మీడియా , సినిమా రంగాలలో ఉండే వారికి ఫాషన్ గా ఉండటం అనేది అత్యంత అవసరమయిన విషయం.

మరి ఇంత మంది జనాభా ఆనందం , అవసరం , ఆర్బాటం కోసం అనుసరిస్తున్న ఈ ఫాషన్ ట్రెండ్ మీద బ్లాగ్ మొదలుపెడితే దానికి తీరుగే ఉండదు.

Fashion Blog ఎందుకు నడుస్తుంది ?

చాలా మందికి ఫాషన్ గా ఉండటం ఇష్టం , ఫాషన్ మీద ఆశ . కానీ , ఎవరికీ కూడా దాని గురించి పెద్దగా తెలియదు. ఇండస్ట్రీ లో వస్తున్న ట్రెండ్స్ ఏంటి ? ఎలా ఉంటె బాగుంటారు ? తమకు ఎలాంటి ఫాషన్ దుస్తులు నప్పుతాయి? ఇలాంటి సందేహాలు , ఇబ్బందులు చాలా మందికి ఉన్నాయి .వాటికి జవాబుగా మీ బ్లాగ్ ఉంటె చాలు .

Fashion లో ఎన్ని రకాలుగా బ్లాగ్ రాయవచ్చు ?

ఫాషన్ బ్లాగ్ పలు రకాలుగా నిర్వహించవచ్చు . వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాము :

ఫాషన్ న్యూస్ బ్లాగ్ :
ఫాషన్ ఇండస్ట్రీ ప్రతి రోజు మారిపోతూ ఉంటుంది. ఈ రోజు ఉన్న ట్రెండ్ రేపటికి పాతది. అలానే ఆ ఇండస్ట్రీ లో విషయాల గురించి ఆసక్తి కలిగిన యువత అనేకం . కాబట్టి , ఫాషన్ న్యూస్ బ్లాగ్ కి మంచి డిమాండ్ ఉంది .

ఫాషన్ టిప్స్ బ్లాగ్ :
దీనికి తీరుగే ఉండదు. ఫాషన్ గా ఎలా ఉండాలో టిప్స్ చెపుతూ బ్లాగ్ నడిపితే మీరే ఒక బ్రాండ్ అవుతారు . ఎందుకంటే, ఇంకొకరి ప్రాబ్లం కి మీరు జవాబు చెపుతున్నారు కాబట్టి .

ఫాషన్ రివ్యూస్ బ్లాగ్ :
మార్కెట్ లో కొత్త స్టైల్ , కొత్త ప్రోడక్ట్ లు , బ్రాండెడ్ కంపెనీ డ్రెస్ లు ….ఇలా చాలా ఉంటాయి . ఏది బాగుందో తెలియదు. మరి మీ బ్లాగ్ ద్వారా వాటి అన్నిటి మీద రివ్యూస్ రాస్తే ..దుమ్ము రేపొచ్చు.

సొంత డిజైన్ బ్లాగ్ :
మీరే ఒక ఫాషన్ డిజైనర్ అయితే, మీ వర్క్ , మీ డిజైన్ ల గురించి చెపుతూ ఒక బ్లాగ్ పెట్టవచ్చు. ఆ డిజైన్ లు , స్టైల్ నచ్చిన వారు ఫాలో అవుతారు .

ఫాషన్ సబ్జెక్టు బ్లాగ్ :
ఫాషన్ సబ్జెక్టు నేర్చుకొనాలి అనుకునే యువత చాలా మంది ఉన్నారు . అందరికి ఫాషన్ కాలేజీలలో సీట్ రాదూ. అలాంటి వారికి మీ బ్లాగ్ ద్వారా సబ్జెక్టు వివరిస్తే ఒక వెలుగు వెలిగే ఛాన్స్ ఉంది .

కంప్లీట్ ఫాషన్ బ్లాగ్ :
న్యూస్ , ఫాషన్ టిప్స్ , రివ్యూస్ , ఫొటోస్ , వీడియోస్ ….ఇలా ఫాషన్ కి సంభందించిన ప్రతి విషయం చర్చిస్తూ ఒక బ్లాగ్ స్టార్ట్ చెయ్యొచ్చు .

ఆలోచిస్తే ఇంకా మార్గాలు అనేకం . ఫాషన్ ఇండస్ట్రీ మీద పట్టు , ఫాషన్ ట్రెండ్స్ మీద ఇంటరెస్ట్ , ఫాషన్ విషయాల గురించి రీసెర్చ్ , నలుగురిలో ఫాషన్ గా ఎలా ఉండాలో చెప్పే టిప్స్ … ఇలా ఏది ఉన్నా గాని మీరు ఫాషన్ మీద బ్లాగ్ స్టార్ట్ చెయ్యొచ్చు .

మరి బ్లాగ్ ఎలా స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నారా ?

ఫాషన్ మీద ఐడియా ఉంది. దాని గురించి రాసే సత్తా ఉంది , కానీ టెక్నికల్ గా బ్లాగ్ ఎలా స్టార్ట్ చెయ్యాలో తెలియదా ?
సామాన్యుడికి కూడా అర్ధం అయ్యే విధంగా ఈ-బుక్ రాసాను .

ఆ ఈ-బుక్ లో బ్లాగ్ మొదలుపెట్టే విధానం మొత్తం ఉంది ఇంటరెస్ట్ ఉన్నవారు ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు చూసి కొనవచ్చు .

ఫాషన్ బ్లాగ్ మీద మనీ ఎలా ?  టాప్ ఫాషన్ బ్లాగ్స్ , యూట్యూబ్ చానెల్స్ ఏంటి? లాంటి విషయాలు ఈ వారం ఆర్టికల్స్ లో చూద్దాము

Comment using Facebook for quick reply

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here