Adsense Information in Telugu Article

0
adsense telugu

బ్లాగ్ కి యాడ్స్ లేకపోతే మనుగడ కష్టమే . యాడ్స్ లేకుండా బ్లాగ్ ని నడపవచ్చు ..అయితే దానిని ఒక బ్లాగ్ కంటే కూడా ఒక బిజినెస్ లా నడపాలి. అది అందరికి ఉండే స్కిల్ కాదు. అదే, బ్లాగ్ లో మంచి ఆర్టికల్స్ రాసి యాడ్స్ వస్తే కొద్దిగా తేలికగా ఉంటుంది.

మరి బ్లాగ్ లో యాడ్స్ రావాలి అంటే Google Adsense కి మించిన Ad Network ఇంకోటి ఉండదు. మరి ఆ Adsense మన బ్లాగ్ కి రావాలి అంటే ఎలా ?

ఈ steps ఫాలో అవండి ..మీ బ్లాగ్ కి Adsense అకౌంట్ ఓకే అవుతుంది

How to Get Adsense – Telugu Article

ఒరిజినల్ కంటెంట్ :

మీ బ్లాగ్ లో రాసే కంటెంట్ ఒరిజినల్ అయి ఉండాలి. అంటే, ఎక్కడ కాపీ చేయకుండా సొంతంగా రాసేది. మీరు కాపీ చేసి యాడ్సెన్స్ తెచ్చ్చుకున్న గాని ఎవరయినా కాపీ రైట్ పంపితే మీ యాడ్సెన్స్ అకౌంట్ క్లోజ్ అవుతుంది.

క్వాలిటీ కంటెంట్ :

సొంతంగా రాయటమే కదా అని ఏదో నాలుగైదు లైన్స్ రాసి బ్లాగ్ నిర్వహిస్తే యాడ్సెన్స్ రాదూ. కనీసం ప్రతి ఆర్టికల్ ౩౦౦ నుండి ౫౦౦ వర్డ్స్ వరకు ఆర్టికల్ లో ఉంటె మంచిది.

ఈ టాపిక్స్ ఉండకూడదు :

అడల్ట్ కంటెంట్ , బూతులు,అందరూ చూడటానికి వీలులేని కంటెంట్ లేదా images వాడటం లాంటివి నిర్వహిస్తే మీ బ్లాగ్ కి యాడ్సెన్స్ రాదూ.

Privacy Policy Page:

ప్రైవసీ పాలసీ అంటే బ్లాగ్ చదివే రీడర్స్ యొక్క ప్రైవసీ మీ బ్లాగ్ ఎలా వాడుకుంటుంది లేదా కాపాడుతుంది అనేది వివరంగా ఈ పేజీ లో చెప్పాలి. “ఉదాహరణకి : మీ పేరు , మొబైల్ నెంబర్ తీసుకుంటే గనక ..ఆ డేటా ఏ కంపెనీ తో షేర్ చేసుకోమని చెప్పాలి”.ఆ వివరాలతో “Privacy Policy” ఒకటి ఉండాలి.

Abouts Us Page:

బ్లాగ్ గురించి , బ్లాగ్ నిర్వహించే వారి గురించి అనే పేజీలో వివరంగా ఉండాలి. అంటే, మీరెవరు లేదా ఈ బ్లాగ్ దేనికి సంభంధించినదో చెప్పాలి. ఆ వివరాలతో “About us Page” ఒకటి ఉండాలి.

Terms & Condistions Page :

ప్రతి వెబ్ సైట్ లేదా బ్లాగ్ వాడటానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ నచ్చితేనే రీడర్ ఆ బ్లాగ్ చదవాలి. ఐ.ప్ ట్రాకింగ్ , కుకీస్ రీడ్ చేసుకోవటం, ఏ-మెయిల్ ఇవ్వటం లాంటి విషయాలు నచ్చి ఇస్తున్నట్టు ఆ టర్మ్స్ లో ఉంటుంది. ఆలాంటి విషయం మొత్తం గా ప్రతి బ్లాగ్ లో “Terms & conditions” page లోఉంటుంది.

Contact Us page:

ప్రతి బ్లాగ్ లోను అడ్రస్ ఉండాలి లేదా కనీసం email id,ఫోన్ నెంబర్ లాంటివి ఉండాలి.ఆ వివరాలతో ఒక కాంటాక్ట్ ఫారం page ఉండాలి

ఎన్ని ఆర్టికల్స్ ఉండాలి ?

మాములుగా బ్లాగ్ లో 10 నుండి 15 ఆర్టికల్స్ ఉంటె మంచిది.

New Gmail:

అప్లై చేసే ముందు కొత్త జిమెయిల్ నుండి చెయ్యండి. అంటే, ఈ బ్లాగ్ కోసం విడిగా ఈ -మెయిల్ తీసుకొని దాని ద్వార అప్లై చేయండి.

కొన్ని రోజులుగా రూల్స్ అన్ని strictగా ఫాలో అవుతున్న గూగుల్  ఈ మధ్య బ్లాగ్ పెట్టిన కొన్ని రోజులకే యాడ్సెన్స్ approve  ఇచ్చేస్తుంది.పైన చెప్పిన విధంగా చేస్తే త్వరగానే యాడ్ సెన్స్ అకౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఒక వేళ మీకు బ్లాగ్ గురించి తెలియక పోయినా బ్లాగ్ ఎలా స్టార్ట్ చెయ్యాలో తెలియక పోయినా నేను చేసిన “How to start a Blog ” Free Video Course  ఉంది. మీ E-mail తో రిజిస్టర్ అయితే ఆన్ లైన్ లో క్లాస్ లు freeగా చూడవచ్చు. కోర్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here