Google Analytics తో మీరు చేస్తున్న కొన్ని పొరపాట్లు

0
Some of the errors with Google Analytics

Google నుంచి అందజేయబడిన Google Analytics టూల్ మీ వెబ్ సైట్ యొక్క పూర్తి సామర్ధ్యాన్ని బయటకు తెచ్చేందుకు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుబాటులో ఉన్నా వాటిలన్నింటిలోకి ఇది ఒక అద్భుతమైన మార్కెటింగ్ టూల్ గా భావించవచ్చును. తమ audience ల గురించి marketer లకు ఒక స్పష్టమైన అవగాహనను తెచ్చుకునేందుకు ఈ Google Analytics ఒక గ్రేట్ టూల్ అని చెప్పవచ్చు. ఎంతో ఉపయోగకరమైన ఆ టూల్ ను పూర్తి సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలి.

అయితే చాలా మంది సాధారణంగా Google analytics లో చేసే పొరపాట్లు ఈ క్రింది తెలియచేయడం జరిగింది

Google Analytics ను ప్రధమంగా వాడకపోవటం:

తమ వెబ్ ట్రాఫిక్ ను విశ్లేషించుకొనేందుకు 30 నుంచి 50 మిలియన్ వెబ్ సైట్ ల వాళ్ళు ఈ టూల్ నే ప్రధానంగా వాడుతారు, అయితే మీరు గనక వాడకపోయినత్లైతే మీరు చాలా మంచి అవకాశాన్ని కోల్పుతున్నట్టే అనుకోవాలి.

వ్యక్తిగత పేజీల స్థాయిలో మార్కెటింగ్ స్ట్రాటజీ ను తెలుసుకునేందుకు ఇదొక మార్కెటింగ్ టూల్ ను ఖచ్చితంగా ఉపయోగించవలసి ఉంటుంది, అందులో ఈ Google Analytics టూల్ ఏ మంచి ఫలితాలను అందిస్తుంది కనుక ఇదే మంచి ఛాయిస్ గా భావించి ఉపయోగించాలి.

అంతర్గత సెషన్ డేటా ను ఫిల్టర్ చెయ్యకపోవడం:

పెద్ద పెద్ద organization లలో లేదా కంపెనీలలో వెబ్ సైట్ ను visit చేసే వారిలో ఆ కంపెనీ ఉద్యోగులు నిర్వాహకులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు, అయితే వెబ్ సైట్ యొక్క పెర్ఫార్మన్స్ ను అంచనా వేసేటప్పుడు ఈ వ్యూస్ కూడా కలిసినట్లైతే ఖచ్చితమైన ఫలితాలు మనకు తెలిసే వీలుండదు కనుక అటువంటి సమాచారాన్ని తొలిగించే విధంగా ఫిల్టరింగ్ విధానాన్ని అనుసరించి ఖచ్చితమైన result లను తెలుసుకోవాలి.

స్పాం ట్రాఫిక్ ను ఫిల్టర్ చెయ్యకపోవడం:

ట్రాఫిక్ మొత్తం లో దాదాపు 4 శాతం స్పాం నుంచే వస్తుంది, ఈ సంఖ్య తక్కువుగా కనిపిస్తున్నప్పటికీ, ఏ విధమైన ఉపయోగంలేని వ్యూల సంఖ్య వీటి వలన మీ వెబ్ సైట్ కు కలుగుతాయి. Google Analytics లోని Analytics Edge ద్వారా స్పాం ట్రాఫిక్ ను తొలగించవచ్చును.

లక్ష్యాలను నిర్దేసించుకోకపోవడం:

లక్ష్యాలను కలిగిన వారికి విజయం పొందే అవకాసం 10 రెట్లు అధికంగా ఉంటుంది. ఒక marketer గ మీకు ఖచ్చితంగా కొన్ని నిర్దేశిత లక్ష్యాలు ఉండటం ముఖ్యం. Google Analytics ద్వారా అటువంటి అనేక లక్ష్యాలను మీరు నిర్దేశించవచ్చును. ఆ టూల్ మీకు పురోగతిని చూపించడమే కాకుండా అవసరమైన సర్దుబాట్లను కూడా సూచిస్తుంది. 

సొల్యూషన్స్ గేలరీ ను పట్టించుకోకపోవడం:

Computer అక్షరాస్యత ఉన్నవారి సంఖ్య మన ప్రపంచంలో తక్కువగానే ఉంటుంది, అందులోను వెబ్ సైట్ లను maintain చేసేందుకు మాకున్న ఈ కొద్దిపాటి కంప్యూటర్ పరిజ్ఞానం సరిపోదనే చెప్పాలి. మీ వెబ్ సైట్ కు సంబందించిన చిన్న చిన్న ఇష్యూ లకు సంబందించిన సమాచారం గురించి వాటిని ఏ విధంగా సాల్వ్ చెయ్యాలి అనే విషయాలను గురించి Google analytics లోని సొల్యూషన్స్ గేలరీలో సమాచారం ఉంటుంది, కాబట్టి ఆ సమాచారాన్ని ఉపయోగించుకొని మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు.

ఇలా Google Analytics టూల్ ను మీకు మరియు మీ వెబ్ సైట్ కు అనుకూలంగా చాలా చక్కగా ఉపయోగించికోవచ్చును, ఇటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లను చెయ్యకుండా ఉన్నట్లైతే ఆ టూల్ యొక్క పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకున్న వారు మీరు అవచ్చు.

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here