GST, గత కొంత కాలంగా ఏ ఛానల్ పెట్టినా, ఇంటర్నెట్ లోనైనా , వాట్స్ ఆప్ లోనైనా ఎక్కడిక్కడే దీని గురించే చర్చ. సామాన్య ప్రజలు తమకు రోజు ఇంట్లో వాడే వస్తువులు ఖరీదులు ఎలా మారుతాయి అని, వ్యాపారులు తమ వ్యాపారం ఏ విధంగా మలుపు తిరుగుతుందని, ఇలా ఎవరికి వారు GST గురించిన అవగాహన తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

వ్యాపార లావాదేవీలు మరింత పారదర్సకంగా ఉండేందుకు దీనిని అములులోకి తీసుకు వచ్చారు. భారత ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలే మూలకారకాలు.

ఈ బిల్ అమలులోకి వచ్చిన దగ్గర నుంచి చిన్న బిజినెస్ లు పూర్తి పరివర్తనకు గురి కానున్నాయి. అయితే ఒక చిన్న బిజినెస్ కు యజమాని గా ఈ GST మీ చిన్న బిజినెస్ పై ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండడం సహజ.
ఈ సంచలనాత్మక GST మీ చిన్న వ్యాపారాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం.

బిజినెస్ ప్రారంభించడం సులభం:

ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధమైన tax రూల్స్ ఎక్కువ ఖర్చులతో బిజినెస్ ప్రారంభంలో సమస్యలను సృష్టిస్తాయి.GST అమలుతో కేంద్రికృత రిజిస్టరేషన్ తో బిజినెస్ ప్రారంభించడం చాల సులభం అవుతుంది. తద్వారా బిజినెస్ expansion కూడా తరవాత సులభం అవుతుంది.

మార్కెట్ expansion:

మాములుగా చిన్న తరహ పరిశ్రమలు, వ్యాపారాల కు కస్టమర్ లు సాధారణంగా ఒక రాష్ట్రానికి చెందిన వారే ఉంటారు ఇంటర్ స్టేట్ taxల బెడదతో ఆ బిజినెస్ కస్టమర్ బేస్ కుదించుకు పోతుంది. కాని GST అమలుతో ఈ స్థితి మారిపోనుంది. ఈ విధానం చిన్న తరహా పరిశ్రమలకు, మధ్య తరహ వ్యాపారలకు వరం గా అవతరించనుంది, దీని ద్వారా బిజినెస్ విస్తరణ సులభం అవుతంది.

కొత్త బిజినెస్ లపై tax బరువు తగ్గింపు:

GST కు పూర్వం సంవత్సరానికి 5 లక్షలకు మించి టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్ లు VAT రిజిస్ట్రేషన్ ఫి చెల్లించవలసి ఉండేది. కాని GST బిల్ ద్వారా ఆ లిమిట్ 20 లక్షలకు, కొన్ని రాష్ట్రాలలో 10 లక్షలకు పెరిగింది, దీనితో చాల చిన్న బిజినెస్ లకు ఉపసమనం కానుంది.

వస్తుసేవల మధ్య వ్యత్యాసం తొలగింపు:

వుస్తువులు మరియు సేవల మధ్య వ్యత్యాసం లేదని GST నిర్ధారిస్తుంది. Packaged వస్తువులకు సంబందించినచట్టపరమైన చర్యలను ఇది సులభతరం చేయ్యనుంది. తద్వారా వస్తుసేవల మధ్య తారతమ్యాలు తగ్గి tax evasion తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది.

Logistics మెరుగుదల మరియు సేవల త్వరిత డెలివరీ:

GST బిల్ క్రింద ఉత్పత్తి అయిన వస్తు సేవల పైన ఏ విధమైన ఎంట్రీ tax ఉండదు. దీని కారణంగా అంతరాష్ట్ర పాయింట్ ల వద్ద, టోల్ చెక్ పోస్ట్ ల వద్ద ప్రక్రియ వేగవంతం అయ్యి వస్తువుల డెలివరీ వేగం కానుంది. లాజిస్టిక్స్ ఖర్చులు కూడా దాదాపు ఉత్పాదక వస్తువుల పైన తగ్గనున్నాయి, ఇది ఈ-కామర్స్ వ్యాపారానికి ఒక మంచి బూస్ట్ అవుతుంది.

మల్టిపుల్ taxation తొలగింపు:

GST అమలుతో అంతరాష్ట్రాల మధ్య వస్తు సేవల బదిలీ సులభతరం కానుంది. బిజినెస్ నిర్వహణ ఖర్చులు కూడా తగ్గనున్నాయి. స్టేట్ మరియు సెంట్రల్ tax లా తొలగింపు దీనికి గల కారణం అని చెప్పాలి.

ఇలా GST అమలుతో చిన్న తరహ పరిశ్రమల పైన చాలా అనుకూల ప్రభావాలు ఉన్నపటికీ కొన్ని ప్రతికూలా ప్రభావాలు ఉన్న మాటను కూడా గుర్తించాలి.వీలుంటే దాని గురించి ఇంకో ఆర్టికల్ లో చూద్దాము

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

Read Online Business Updates, Startup news in your E-mail

You have Successfully Subscribed!