చక్రవర్తికి వీధి  బిచ్చగత్తికి బంధువు  అవుతానంది మనీ మనీ అని “మనీ సినిమా” లో రైటర్ కరెక్ట్ గా చెప్పాడు. డబ్బు అందరికి బంధువే.ఈ రోజుల్లో అసలు బంధువలకంటే “మనీ” బంధువే ముఖ్యమయింది చాలా మందికి .

ఆ మాట అలా ఉంచితే కొంతమందికి డబ్బు అవసరం ,కొంతమందికి డబ్బు ప్రాణం, కొంతమందికి డబ్బే లోకం. ఆ డబ్బు సంపాదించటానికి వెయ్యి మార్గాలు, అందులో చెడు మార్గాలే ఎక్కువ. కాని కష్టమయినా, టైం పట్టినా మంచి మార్గంలో మన చదువు,తెలివి ఉపయోగించి సంపాదించిన “రూపాయీ ” ఇచ్చిన త్రుప్తి , జూదం ఆడో,మోసం చేసో సంపాదించిన లక్షలు ఇవ్వలేవు.

కష్టపడి సంపాదించే పలు మార్గాలలో నయా ట్రెండ్ “ఆన్ లైన్ లో మనీ”.

ఆన్ లైన్ లో మనీ అనగానే చాలా మందికి ఉన్న అభిప్రాయం “ఈజీ గా మనీ సంపాదిన్చించవచ్చు” అని , ఇంకొంతమందికి “అంతా మోసం” అని.అవి రొండు తప్పే.

బయట అయినా , ఆన్ లైన్ లో అయినా మనీ సంపాదించటం కష్టమే. ఎక్కడయినా వొళ్ళు వంచాలి , మెదడు పెట్టాలి .
కాకపోతే ఆన్ లైన్ లో మనం ఎక్కడనుండి అయినా వర్క్ చెయ్యొచ్చు , ఎప్పుడయినా వర్క్ చెయ్యొచ్చు.

 

అన్నిటికంటే అసలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ….ఆన్ లైన్ లో మనీ సంపదియాలంటే ఏదయినా స్కిల్ ఉండాలి,అంటే ఏదో ఒక విద్య మీకు వచ్చి ఉండాలి. ఉదాహరణకి ఫోటోగ్రఫీ , మ్యూజిక్, కంప్యూటర్ కోడింగ్, డిజైన్, లేదా ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ ఇంకా ఏదో ఒక మంచి స్కిల్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం మంచిగా ఎక్కువ మనీ సంపాదిన్చొచ్చు.

 

ఇంకో విషయం, ఆన్ లైన్ లో యాడ్స్ చూస్తే, క్లిక్ చేస్తే మనీ వస్తదనుకుంటే అది పొరపాటు. ఒకటి రొండు సర్వీసెస్ అలా మనీ ఇచ్చినా నెల మొత్తం కష్టపడితే మీ మొబైల్ బిల్లు కట్టుకోటానికి సరిపోవచ్చు . అలానే ఆ టైపు సర్వీసెస్ లో మోసాలు ఎక్కువగా ఉంటాయి .ముందే డబ్బు కట్టమంటారు,లేదా వర్క్ చేసాక డబ్బు ఇస్తామంటారు. అలా టైం ,మనీ వేస్ట్ చేసుకున్న లిస్టు ఎక్కువే .

 

ఆన్ లైన్ లో మనీ కోసం చాలా చాలా మార్గాలు ఉన్నాయి.మన స్మార్ట్ తెలుగు లో ఆన్ లైన్ లో మనీ గురుంచి నాకు తెల్సిన కొన్ని పద్ధతులు వివరించడం జరుగుతుంది. నాకు వెబ్ సైట్స్ క్రియేషన్ , ఆన్ లైన్ బిజినెస్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాని ఆన్ లైన్ మనీ ఫీల్డ్ ని నేను గత 1 1/2 ఇయర్ గా మాత్రమే ప్రాక్టికల్ గా వర్క్ చేయటం, ఫాలో అవ్వటం జరుగుతుంది.

 

కాని నా ఫ్రండ్స్,బంధువులు,నా దగ్గర ట్రైనింగ్ తీసుకునే స్టూడెంట్స్,నా క్లైంట్స్ చాలా మంది ఆన్ లైన్ మనీ గురుంచి డౌట్స్ అడగటం, సరిగ్గా చెప్పే వాళ్ళు లేక ఇబ్బంది పడటం చూసాను. అందుకే స్మార్ట్ తెలుగు బ్లాగ్ లో దిని గురుంచి కూడా కొన్ని ఆర్టికల్స్ రాయటం జరుగుతుంది. ముందు ముందు మిగిలిన అన్ని ఆన్ లైన్ మనీ పద్ధతులు వివరించటం జరుగుతుంది.

ఆన్ లైన్ లో మనీ మార్గాలు   కొన్ని…

  • ట్రైనింగ్ ఇవ్వడం (ఏ సబ్జెక్టు అయినా సరే, మ్యూజిక్,గిటార్,యోగా, ఐ.టి కోర్సెస్ )
  • ఫోటోలు అమ్మడం,టి-షర్ట్స్ అమ్మడం,
  • సొంతంగా ప్రాజెక్ట్స్ తెచ్చుకోవటం ద్వారా,
  • ఫోటోషాప్ డిజైన్ ద్వారా,
  • ఇ-కామర్స్ ద్వారా
  • ఆన్ లైన్ బిజినెస్,
  • బ్లాగ్గింగ్ ద్వారా,
  • వెబ్ సైట్స్ తాయారు చెయ్యడం ,
  • వీడియో క్లాస్సేస్ ఇవ్వడం,

ఇలా ఇంకా చాలా మార్గాలలో మనీ సంపాదిన్చొచ్చు.

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

Read Online Business Updates, Startup news in your E-mail

You have Successfully Subscribed!