ఆన్ లైన్ ట్రైనింగ్ బిజినెస్ ఎలా చెయ్యాలి ?

0
ONLINE TRAINING BUSINESS

ఆన్ లైన్ ట్రైనింగ్ తో ఆన్ లైన్ మనీ అనే సిరీస్ లో ఇది రొండో పార్ట్……. మొదటి ఆర్టికల్ చదవకపోతే ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

ఎప్పటినుంచో  నా బ్లాగ్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే kalyan గారు  “ఆన్ లైన్ ట్రైనింగ్ బిజినెస్ ఎలా చెయ్యాలి నాకు  ఫేస్ బుక్ లో మెసేజ్ చేసారు. అలా ఆన్ లైన్ ట్రైనింగ్ బిజినెస్ ఎలా నడపాలో తెలుసుకోవాలి అనుకునే వారి కోసం ఈ ఆర్టికల్ .

Smarttelugu fans

ఈ ఆన్ లైన్ ట్రైనింగ్ బిజినెస్ లో “ఐ.టి కోర్స్ లు , మ్యూజిక్,డాన్సు,ఆర్ట్ లాంటి కళలు, స్కూల్ మరియు కాలేజీ సబ్జెక్టులు”, ఇలా ఎవరికయినా అటు ఇటుగా పద్ధతి ఒక్కటే.

ఆన్ లైన్ ట్రైనింగ్ బిజినెస్  గురించి ?

ఆన్ లైన్ ట్రైనింగ్ బిజినెస్ మంచి లాభావంతమయినది…కాని అదే టైం లో మంచి పోటి ఉన్న బిజినెస్.
ఆన్ లైన్ లో ఆన్ లైన్ ట్రైనింగ్ ఇస్తూ మనీ సంపాదించటం అనేది ఒక పద్దతి అయితే… మీరు ఆ బిజినెస్ రన్ చేయటం అనేది రొండో పద్ధతి.

సింపుల్ గా చెప్పాలి అంటే…

ట్రైనింగ్ మీరు చెప్పరూ.
ట్రైనర్ ని , ట్రైనింగ్ కావాల్సిన వారిని  కలిపే పని మాత్రమే మీరు చేసేది.
ట్రైనింగ్ కి వచ్చే మనీలో కొంత  మీకు …ఇంకొంత ట్రైనర్ కి చెందుతుంది.

ఒక ఉదాహరణ తీసుకుందాము:

అమెరికాలో ఉన్న ఒక వ్యక్తికి ఐ.టి కోర్స్ నేర్చుకోవాలిసిన అవసరం ఉంది.ఆ వ్యక్తిని మీరు ఆన్ లైన్ మార్కెటింగ్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా సంప్రదించవచ్చు.
వారికి ట్రైనింగ్ ఎలా కావాలో వివరాలు తీసుకొని ..ఆ వివరాలకు సరిపడే ట్రైనర్ ని వెతికి తనకు అందిస్తాము.
అలా ఒక ట్రైనర్ ని మరియు స్టూడెంట్ ని కలిపే వారధిలా మీరు పని చేస్తారు.

ట్రైనింగ్ కోసం చూసే వారిని ఎలా పట్టుకోవాలి ?

సొంత వెబ్ సైట్ :
చిన్న వెబ్ సైట్ ఒకటి పెట్టుకోవాలి.దానిలో మీరు ఎటువంటి సబ్జెక్టులు పైన ట్రైనర్ల ను అందిస్తారో తెలియజేయాలి.
గూగుల్ లో ట్రైనింగ్ కోసం వెతికే వారికి మన వెబ్ సైట్ కనపడితే, అప్పుడు వారే మనని సంప్రదిస్తారు. అలా వెబ్ సైట్ ని మార్కెట్ చేయటానికి SEO చేసే వారు మార్కెట్ లో దొరుకుతారు.

సోషల్ మీడియా :
ఫేస్ బుక్ లో ఒక బిజినెస్ పేజి పెట్టుకోండి. ఆ పేజి ద్వారా మీరు అందించే సబ్జెక్టుల వివరాలు అందజేయండి.
ఆ బిజినెస్ పేజిని కొద్దిగా మార్కెట్ చెయ్యండి.
ఫేస్ బుక్ లో ఆ పేజిని చుసిన వారు మీకు ట్రైనింగ్ కోసం మెసేజ్ పెడతారు.

ట్రైనర్ ని ఎలా పట్టుకోవాలి ?

మన సర్కిల్ :

ముందు మన ఏదయితే సబ్జెక్టులు అనుకుంటున్నామో…ఆ సబ్జెక్టుల పైన మన ఫ్రెండ్స్ ,ఫామిలీ మెంబెర్స్ ఎవరయినా ట్రైనింగ్ అందజేయగలరో వారిని సంప్రదించండి.

సోషల్ మీడియా గ్రూప్ :
ఫేస్ బుక్ ,లింకేడిన్ లాంటి సోషల్ నెట్ వర్క్ సైట్లలో ఈ ట్రైనర్ గ్రూప్లు ఉంటాయి.ఆ గ్రూప్లలో చేరండి. అక్కడున్న ట్రైనర్ల తో మాట్లాడుకోండి.

లింకేడిన్  సోషల్ నెట్ వర్క్ :
ప్రొఫెషనల్ సోషల్ నెట్ వర్క్ లింకేడిన్ అనేది ఇలాంటి బిజినెస్లకి వరం.
లింకేడిన్ లో మీకు కావలిసిన ట్రైనర్ కోసం వెతికితే వారి ప్రొఫైల్ లు కనపడుతాయి.అలా వారిని సంప్రదించవచ్చు.
లింకేడిన్ లో ప్రత్యేకంగా కొన్ని ట్రైనింగ్  గ్రూప్లు  ఉంటాయి.అక్కడ మీకు చాలా మంది ట్రైనర్లు దొరుకుతారు.

మీరు చేయవలసిన పని …….సరయిన  “కీ వర్డ్”  తో వెతకాలి .
అంటే ఉదాహరణకు మీరు డాట్ నెట్ నేర్పించే ట్రైనర్ కోసమా చూస్తుంటే , “Dotnet online trainer ” అని వెతకచ్చు.
అప్పుడు ట్రైనర్ ప్రొఫైల్ లు మరియు ఆ గ్రూప్ లు మీకు కనపడుతాయి.

మరి మనీ ఎలా ?

మీరు ట్రైనింగ్ తీసుకునే వారి దగ్గర నుండి ఆన్ లైన్ బ్యాంకు transfer ద్వారా మనీ అందుకుంటారు.దానిలో మీరు ట్రైనర్ తో ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్న విధంగా కొంత మనీ ట్రైనర్ కి ఇస్తారు.

లేదా మీరు దీనికి ఒక కంపెనీ రిజిస్టర్ చేయించుకుంటే…మీ వెబ్ సైట్ నుండే ఆన్ లైన్ పేమెంట్ తీసుకోవచ్చు.
దీనికి Paypal లాంటి సర్వీస్లు ఉపయోగపడుతాయి.

బిజినెస్ లో మీ  పని ?

కేవలం ట్రైనర్ ని ట్రైనింగ్ కోసం వచ్చే వారిని కలిపి మనీ తీసుకొని వదిలేస్తే మీకు బిజినెస్ పెరగదు.
ఎప్పుడయినా కస్టమర్ కి నాణ్యతపరమయిన సేవలు అందజేస్తేనే మీ బిజినెస్ పెరుగుతుంది.
అందుకే మీరు ..ట్రైనర్ కి ట్రైనింగ్ తీసుకునే వారికి మద్య ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత మీదే.
అలానే ట్రైనర్ బాగా చెపుతున్నాడో లేదో తెలుసుకోవాలి.
ట్రైనర్ కి మనీ అనేది మీరు సకాలంలో చెల్లించే విధంగా ప్లాన్ చేసుకోవాలి.

తవ్వుకుంటూ పోతే ఈ సబ్జెక్టు చాలా ఉంది.ఇంకొంత ఇన్ఫర్మేషన్ వచ్చే వారం చూద్దాం.
ఎంత పోటి ఉన్నాగాని ట్రైనింగ్ బిజినెస్ అనేది మంచి లాభదాయకం.కాని అంతే కష్టం కుడా ఉంటుంది. మరి పళ్ళున్న చెట్టుకె కదా దెబ్బలు కుడా .

మీ డౌట్స్..ఈ ఆర్టికల్ మీద మీ అభిప్రాయాలు…ఆన్ లైన్ ట్రైనింగ్ లో మీరు తెలుసుకోవాలి అనుకునే విషయాలు  కింద ఫేస్ బుక్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి.

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here