జాబ్ వచ్చిన వాడు మనకంటే తోపా ?

0
AN INSPIRATIONAL ARTICLES ON JOB SITUATIONS

“అరేయ్ , వాడిని చూసి నేర్చుకోరా ! నీతోనే చదివాడు, ఇప్పుడు వేల జీతం సంపాదిస్తున్నాడు.  నువ్వు ఉన్నావు … ఎందుకు ?”

నిజంగానే మనకంటే ముందు జాబ్ కొట్టినోడు తోపా?  వాడు తోపో కాదో తెలియదు కానీ ,ఉద్యోగం లేకుండా బతుకు సాగిస్తున్న  ప్రతోడు తోపే బాసు … ఎలా అంటారా ? ఉద్యోగం లేని చాలా మంది నిరుద్యోగులతో  ధైర్యం  నింపటానికి స్మార్ట్ తెలుగు వెబ్ సైట్ ప్రయత్నం ఇది .

కనిపించిన ప్రతోడు, ఎం చేస్తున్నావు? అని అడుగుతాడు. తట్టుకోలేని జవాబు దొరకని ప్రశ్న.  అయినా ఏదో ఒక సమాధానం చెపుతాము . అలా , ఒకరు కాదు ఇద్దరు కాదు . చుట్టాలు , ఇంటి పక్క వారు , కాలనీలో వారు , కొంత మంది ఫ్రెండ్స్ ,  ఎంత మంది అడిగినా ఏదో ఒకటి చెపుతాము .  అంటే, మనలో నలుగురిని ఒప్పించ్చకుండా  అంటే , ఏదో ఒక   సమాధానం చేప్పే టాలెంట్ ఉంది  …. ఇదే  ప్రెజంటేషన్  స్కిల్ .

ఎక్కడో దూరపు చుట్టం …పెళ్లిలో కనపడతాడు. జీవితంలో మనకి ఎప్పుడు సహాయాం చేయని ఆ మనిషి .. సలహా మటుకు తన టైం వేస్ట్ చేసుకొని మరి ఇస్తాడు . “ఎరా …అలా తిరగకపోతే ఏదో ఒక చిన్న ఉద్యోగం అయినా చూసుకోపోయావా ? మీ నాన్న ,అమ్మా నీ కోసం ఎంత కష్టపడ్డారు . వారిని భాద్యతగా చూసుకోవాలి నువ్వు ”  అంటూ న్యూస్ ఛానల్ లో బ్రేకింగ్ న్యూస్ చెప్పిన విధంగా క్లాస్ పీకుతూనేఉంటాడు .
మనసులో చెపుతున్న వాడి తల మీద పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ ని పోసి మంట పెట్టాలి అన్నంత కోపం వస్తుంది . కానీ వింటాం , మొత్తం ప్రశాంతంగా నవ్వుతూ వింటాం . బిజినెస్ చేద్దాము అనుకున్నా , ఉద్యోగం లో క్లయింట్ తో మాట్లాడేటప్పుడు అయినా సీన్ ఇంతే ఉంటది …. ఇదే క్లయింట్ మేనేజ్ మెంట్ స్కిల్ .

బయట వారు ఎన్ని అన్నా గాని , ఇంట్లో వారు ఒక మాట అంటే మటుకు మనకి కోపం , ఉక్రోషం , బాధా అన్ని ఒకే సారి కలుగుతాయి . కానీ ఆ కోపం అంతవరకే …. ఉద్యోగం వచ్చినా , లైఫ్ లో సక్సెస్ అయినా గాని వారి ముఖంలో ఆనందం చూడాలి అని మన మనసులో ఎక్కడో ఆశ ఉంటుంది . అంటే , ప్రేమించే వారు పరిస్థుతులకు లోబడి కొద్దిగా కటువుగా ఉన్నా గాని  వారి మనసుని అర్ధం చేసుకునే పరిపక్వత మనకి ఇక్కడే అబ్బుతుంది …. ఇదే రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ స్కిల్ .

కాలిగా ఉండే టైం లోనే మనకి మనీ విలువ తెలుస్తుంది. ఎక్కడ ఏ వస్తువు తక్కువ కి దొరుకుతుంది,  ఏ కర్రీ పాయింట్ లో కూరలు తక్కువ రేట్ కి దొరుకుతాయి , బస్ పాస్ తీసుకుంటే ఎంత ఆదా చెయ్యొచ్చు…. ఇదే మనీ మేనేజ్ మెంట్ స్కిల్ .

కాలిగా ఉన్నా టైం లో నే చుట్టూ ఉన్న వారిలో , నీ దోస్త్ ఎవరు , ఘోస్ట్ ఎవరు అనేది తెలుస్తుంది .మానవ సంబంధాలు అన్ని …ఆర్ధిక సంబంధాలే అన్నాడు ఒక పెద్ద తత్వవేత్త . ఎవడు ఒప్పుకున్నా , ఎవడు ఒప్పుకోకపోయినా అది పచ్చి నిజం. మరి కాలిగా ఉంటె , ప్రేమించిన వారు మటుకు మాములుగా ఉంటారా ! అప్పుడే నిజమయిన ప్రేమ,   స్నేహం  మీకు దొరికిందా లేదా అర్ధం అవుతుంది ….ఇదే లైఫ్ మానేజ్ మెంట్ స్కిల్ .

ఒక ఇంటర్వ్యూ కి వెళితే మనతో వందల మంది పోటీ పడతారు …  ఫేక్ ఎలా తెచ్చుకోవాలో తెలుస్తుంది , చిన్న కంపెనీ లో ఉద్యోగం విలువ తెలుస్తుంది . ఒక వేల భవిష్యత్తులో ఉద్యోగం ఓడిపోతే , మళ్ళి ఎలా బతకాలో మీకు ముందే తెలుస్తుంది …. అదే జాబ్ మేనేజ్ మెంట్ స్కిల్ .

ఒత్తిడిలో కూడా నవ్వటం అలవాటు అవుతుంది , ఒత్తిడిలో కూడా వంట చేసుకోవటం వస్తుంది . వత్తిడిలోను సినిమా చూస్తాము ....అదే స్ట్రెస్ మేనేజ్ మెంట్ స్కిల్ .

కాలిగానే ఉన్నాడు కదా అని … మన చుట్టాలు లేదా రూమ్ లో ఉంటె ఉద్యోగం చేసే తోటి రూమ్మేట్…ఏదో ఒక పని చెపుతారు . నచ్చకపోయినా చేస్తాము …. అదే వర్క్ మేనేజ్ మెంట్ స్కిల్ .

క్యాంపస్ లో జాబ్ వచ్చినవాడికి ఇవేమి తెలియవు . చదుకోవటం , ఉద్యోగం రావటం , మేనేజర్ ఏది చెపితే అది చేయటం. అలాంటి వారికి మీకు రేపటి నుండి ఉద్యోగం లేదు అని కంపెనీ చెపితే ….. భూమి ,ఆకాశం బద్దలు అయినట్టుగా ఫీల్ అవుతారు. వారికి ఏమి చేయాలో తెలియదు , ఇంకో ఉద్యోగం వస్తుందో రాదో అనే భయం . కానీ మనకి ఉద్యోగం లేకుండా ఎలా బతకాలో తెలుసు. బాధతో బతికినా , బతకటం తెలుసు .

ఇన్ని తెలిసిన మనకి, ఉద్యోగం రాకపోవటానికి  కారణం ఇంగ్లీష్ భాషో , నలుగురిలో మాట్లాడలేని భయమో , ఏమి నేర్పని  Btech చదువో అడ్డం వస్తుంది .

నేర్చుకోండి ,  మీ కిష్టమయిన పని గురించి తెలుసుకోండి . స్కిల్ పెంచుకోండి . ఉద్యోగం చేసే ప్రతి వాడు మనకంటే తోపు గాడు కాదు . ప్రపంచం ప్రగతిని మార్చిన చాలా కంపెనీ వ్యవస్థాపకులు … ఉద్యోగం దొరక్క కంపెనీలు పెట్టిన వారే . బిజినెస్ మాన్ సినిమా డైలాగ్ లో చెప్పాలి అంటే  ” మనకంటే తోపు ఎవడు లేడిక్కడ …ఎవడి సినిమాకి వాడే హీరో…చల్” .

ఇలాంటి మంచి ఆర్టికల్స్ కోసం , ఆన్ లైన్ ద్వారా మనీ సంపాదించే మార్గాలు , స్టార్ట్ అప్ ల గురించి తెలుసుకోవాలి అంటే smarttelugu facebook page  Like చేయండి .

బ్లాగ్ స్టార్ట్ చేసే ఇంటరెస్ట్ ఉన్న వారి కోసం “How to start a Blog-Beginners Guide”   అనే ఈ -బుక్ రాసాను . ఇంటరెస్ట్ ఉన్న వారు ఈ లింక్ లో  కొనవచ్చు .

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here