సింపుల్ interview సీక్రెట్స్

0
INTERVIEW SECRETS

లాస్ట్ ఆర్టికల్ లో ఇంటర్వ్యూ టిప్స్ చూసాము. ఇంటర్వ్యూ ఎదురుకొనే వాడికి మాత్రమే టెన్షన్,ఒత్తిడి ఉండదు…ఇంటర్వ్యూ చేసే వాడికి కుడా ఒత్తిడి ఉంటుంది. ఇంటర్వ్యూ చేసే వారికుండే సమస్యలు మనకి తెలిస్తే..కొద్దో గొప్పో ఇంటర్వ్యూ లో విజయం సాధించటానికి ఉపయోగపడుతుంది. మరి ఆ సమస్యలు ఏంటో చూద్దాం.

MNC కంపెనీ వారికి కావాల్సింది:

ఒక ఫ్రెషర్ ని తీసుకునేముందు MNC కంపెనీ వారు చూసేది చొన్ఫిదెంచె మరియు కమ్యూనికేషన్ స్కిల్స్.
టెక్నికల్ గా సబ్జెక్టు పెద్దగా లేకపోయినా పర్వాలేదు. నీలో ధైర్యం,నలుగురితో కలిసిపోయే చొరవ ఉంటె చాలు.
ఇదే ఇంటర్వ్యూ లో వారు ప్రధానంగా చూసేది.

చిన్న కంపెనీ వారికి కావాల్సింది:

ఒక ఫ్రెషర్ ని తీసుకునేముందు చిన్న/మధ్య తరహా కంపెనీవారు చూసేది టెక్నికల్ సబ్జెక్టు. మీకు పెద్దగా ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు…టెక్నికల్ సబ్జెక్టు లో మంచి పట్టు ఉంటె చాలు.అందుకే కొన్ని కంపెనీ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ రాకపోతే ధైర్యంగా తెలుగులోనే మాట్లాడండి.

ఇంటర్వ్యూ టార్గెట్ :

ఒక మంక్ కంపెనీ ఇంటర్వ్యూ పెడితే …దానికి చాలా ఖర్చు ఉంటుంది. అందుకే కనీసం ఇంతమందిని తీసుకోవాలి అని బిజినెస్ హెడ్, హర్ లాంటి వారు ఇంటర్వ్యూ చేసే వారికి చెపుతారు.
వచ్చిన వారిలో ఎంతోకొంత పర్లేదు అనుకునే వారికి ఇంటర్వ్యూ చేసే వారు ఓటు వేస్తారు. అందుకే సబ్జెక్టు లేకపోతే ఇంగ్లీష్ ….ఇంగ్లీష్ లేకపోతే టెక్నికల్ సబ్జెక్టు…లేదంటే మంచి చొరవ చూపే గుణం, లీడర్ షిప్ స్కిల్స్ చూపించండి.
ఒక్కోసారి మీరు అలా అలా ఉన్నాగాని మిగిలిన వారితో పోలిస్తే బానే ఉన్నారు అనుకుంటే చాలు.

HR ఇంటర్వ్యూ టార్గెట్:

HR ఇంటర్వ్యూ వరకు వెళ్లారు అంటే…మీ మీద కొంత పాజిటివ్ రెసుల్త్ ఉంది అని.ఒక వేళ అక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేయకపోతే HR కంపెనీ వారికి సమాధానం చెప్పాలి.అందుకే ఉన్నవారిలో కంపెనీ పట్ల నిబద్దత కలిగి ఉంటారు అనే నమ్మకం కలిగిన వారిని తీసుకుంటారు.
హర్ ఇంటర్వ్యూ లో ఎక్కువగా మీరు కంపెనీ పట్ల ఎంత ఒద్దికగా,నమ్మకంగా ఉంటారో చూస్తారు. శాలరీ కంటే కంపెనీలో వర్క్, వర్క్ కల్చర్ , మీరు ఏ విధంగా కంపెనీ కి ఉపయోగపడగలరు లాంటి విషయాల మీద దృష్టి పెట్టండి.

పైన చెప్పిన సంగతులు మైండ్ లో గుర్తుపెట్టుకుంటే….. ఇంటర్వ్యూ పెద్ద విషయం కాదు.

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here