మీ ఉద్యోగుల సౌకర్యం కోసం మీరు కల్పించగల కొన్ని పోత్సాహకాలు

You can make for your employees convenience

ఉద్యోగం కోసం వెతికే సమయంలో ప్రతి ఒక్క ఉద్యోగి తప్పనిసరిగా దృష్టిని సారించే ఒక అంశం జీతం. జీతం తో పాటుగా ఇతర ఆర్ధికపరమైన ప్రోత్సాహకాలు మరియు ప్రయోజనాల పైన కూడా ఒక్కోసారి చూపు వెళ్తుంది. గత కొన్నేళ్ళ క్రితం నిరుద్యోగం ఎక్కువగా ఉన్నప్పుడు employer లు ఉద్యోగులను ఆకర్షించడానికి నెమ్మదిగా ఉన్న జాబ్ మార్కెట్ ను ప్రోత్సహించడానికి ఇటువంటి ప్రోత్సాహకాలను మరియు ఆర్ధిక ప్రయోజనాలను ప్రయోగించారు. అయితే చిన్న చిన్న బిజినెస్ లకు మరియు కంపెనీలకు ఈ విధంగా ఆర్ధిక ప్రోత్సాహకాలను ఉద్యోగులకు అందించడం కాస్త కష్టమైన పనే. కాని ఉద్యోగులు ఎక్కువగా కోరుకోనేవి ఇటువంటి ఆర్ధికంగా లాభపరిచే ప్రయోజనాలు ఏమాత్రం కాదు అంటే నమ్మడం కష్టమే కాని నమ్మి తీరాలి. నిజానికి ఉద్యోగులకు ప్రాక్టికల్ గా ఉండే reward లు పొందటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. టాలెంట్ ఉన్న వ్యక్తులను మీరు మీ బిజినెస్ లోకి ఉద్యోగులుగా తీసుకోవాలనుకుంటే ఆర్ధికంగా ఆశ చూపించవలసిన అవసరం ప్రతిసారి ఉండదు. ఇరువురికి అంటే ఉద్యోగులకు మరియు employer లకు ఉపయోగకరమైన ప్రయోజకాలు కొన్ని ఉంటాయి. అలా మీ ఉద్యోగులకు మీరు కలుగ చేయగలిగిన కొన్ని ఉత్తమ ఆర్ధిక ప్రయోజనాలు మరియు ప్రోత్సాహకాలను కొన్నిటిని ఇప్పుడు చూద్దాం

HSA లను అందించటం:

మీ ఉద్యోగులకు Health Savings Account లను మీరు కల్పించవచ్చును. HSA లు అంటే సాధారణంగా ఉద్యోగులు తమ మెడికల్ ఖర్చులను భరించడానికి ప్రీ tax ఆదాయం ద్వారా ఫండ్ చేయబడిన సేవింగ్స్ ఎకౌంటు.  కాబట్టి ఒక employer గా మీ ఉద్యోగుల సౌకర్యార్ధం వారికి HSA ఎకౌంట్లు create చేయించవచ్చును. ఈ ఎకౌంటు పూర్తిగా మీ ఉద్యోగి పేరు మీదనే ఉంటుంది కనుక మీకు ఆ ఫండ్ యొక్క వినియోగం పైన ఏ విధమైన హక్కు ఉండదు కాబట్టి మీ ఉద్యోగులు దీన్ని ఒక మంచి సౌకర్యంగా భావిస్తారు.

స్టూడెంట్ లోన్ లను చెల్లించడం:

ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత యొక్క సేవింగ్స్ గురించి employer దృష్టి పెట్టడం ఒక మంచి పని, కాని దీని పైన చాలా మంది employer లు పెద్దగా దృష్టి పెట్టరు, ఎందుకంటే ఇది కష్టమైనా పని కూడా, కాబట్టి షార్ట్ టర్మ్ లో ఫలితాలను అందించే వాటిపైన శ్రద్ధపెట్టడం ఒక మంచి ఆలోచన. అలాంటి వాటిలో employer లు చేయదగ్గ పని మీ ఉద్యోగుల యొక్క స్టూడెంట్ లోన్ లలో కొంత శాతం మొతాన్ని మీరు చెల్లించడం. అలానే మీ ఉద్యోగుల యొక్క refinancing లో కూడా మీరు వారికి హెల్ప్ చెయ్యవచ్చు.

క్రెడిట్ సహాయాన్ని అందించవచ్చును:

చాలా మంది క్రెడిట్ ను హేండిల్ చేసే విషయంలో చాలా వీక్ గా ఉంటారు, మీ payroll లో కూడా అటువంటి వ్యక్తులు ఉన్నట్లు గనుక అయితే అటువంటి వారికి మీరు కల్పించాకలిగిన ఒక సౌకర్యం వారికి క్రెడిట్ సహాయాన్ని అందించడం.

వ్యక్తిగత ఆర్ధిక మార్గదర్శకాలను ఇవ్వడం:

చాలా మంది financial గా నిరక్షరాస్యులుగా ఉంటారు. నిజానికి ఒక employer గా మీ భాద్యత ఉద్యోగులకు చెల్లించడం మాత్రమే అయినప్పటికీ, మీ ఉద్యోగులకు కాస్త అవసరమైన ఆర్ధిక సలహాలను మరియు మార్గదర్శకాలను అందించడం అనేది ప్రతి ఒక్కరు ఆహ్వానించదగ్గ విషయం. వ్యక్తిగత budget ను మేనేజ్ చేసుకోవడం, సేవింగ్ టెక్నిక్ లు, ఇన్వెస్టింగ్ పద్దతులు, రిటైర్మెంట్ planning, ఇటువంటి కొన్ని అంశాల పట్ల వారికి సక్రమమైన మరియు సరైన అవగాహన కలుగచేయగలితే అది వారికి ఎంతో ఉపయోగపడుతుంది.

మీరు ఎటువంటి సౌకర్యలను అయినా మీ ఉద్యోగులకు కల్పించగలిగే సామర్ధ్యం కలిగి ఉన్నప్పటికీ కాస్త creative గా ఆలోచించి స్మార్ట్ గా వ్యవహరించి వారికి ఉపయోగపడే మరియు మీకు ఖర్చు తక్కువ అయ్యే ఇటువంటి సౌకర్యాలను కల్పించడం చాలా మంచి తెలివైన పని.

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here