మీరు ఒక గొప్ప ఎకౌంటు  లేక ఒక మంచి ప్లంబర్  లేదా చెఫ్  అయినంత మాత్రాన మీరు బిజినెస్ ను నిర్వహించడానికి అర్హత కలిగి ఉన్నట్లు కాదు. నిజానికి లీడర్ షిప్ అనేది ఒక ప్రత్యేకమైన నైపుణ్యం. సరైన ప్రవర్తనను నేర్చుకుంటూ మంచి ప్రవర్తనను అలవర్చుకోవడమే లీడర్ షిప్. అయితే మనం చేసే తప్పుల నుంచి కూడా మనం చాలా విషయాలను నేర్చుకునే వీలు మనకు కలుగుతుంది, కనుక అలా లీడర్ షిప్ లో జరిగే కొన్ని పొరపాట్లను గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

అంతా మీరే చెయ్యాలనుకోవడం:

మీ కంపెనీ కు లేదా బిజినెస్ కు లీడర్ గా ఖచ్చితంగా ఆ పడవను నడిపే భాద్యత మీ పైనే ఉంటుంది. అలా అని మీరు పడవ నడపడటం తో పాటుగా ఇంజిన్ రిపేర్ లు, ఇంధనం నింపడము, షిప్ లోని వారికి భోజన తయారి వంటి ఇతర పనుల భాద్యతలను కూడా మీరే నిర్వహించాలనుకోవడం సరి కాదు. ఇలా మీరు పలు ఇతర విషయాలపైన దృష్టి పెట్టవలసి వస్తే కనుక మీ యొక్క ప్రధాన భాద్యత అయిన బిజినెస్ లేదా కంపెనీ నిర్వహణ మీద మీ దృష్టి అంతగా ఉండదు, ఉన్నా అన్నిటిని ఒకే సమయంలో నిర్వహించాలనుకోవడం మంచిది కాదు. ఇతర భాద్యతలను వీలైనంత వరకు ఇతరులకు అప్పగించాలి.

ఎక్కువ మాట్లాడుతూ తక్కువ వినటం:

కమ్యూనికేషన్ ఎప్పుడైనా రెండు వైపులా నుంచి సమానంగా ఉంటేనే ఎఫెక్టివ్ గా ఉన్నట్టు. అయితే లీడర్ షిప్ లో దీని పాత్ర చాలా అధికంగా ఉంటుంది. ఒక లీడర్ గా ఎంతసేపు మీరు ఇతరులకు సూచనలు జారి చెయ్యటం మాత్రమే కాదు వారి మాటలను కూడా వింటూ ఉండాలి. వారి మాటల నుండి మీరు ఎంతో నేర్చుకోవచ్చు. ఒక లీడర్ గా మీకంటే మీ కంపెనీ లోని ఇతర స్టాఫ్ సభ్యులు నేరుగా కస్టమర్ లతో ఇంటరాక్ట్ అవుతారు గనుక వారికి కస్టమర్ లకు మరింత విలువైన సేవలను అందిచటం ఎలా అనే అంశం పైన అవగాహన ఉంటుంది కాబట్టి మీరు వారి మాటలను విని వారి నుంచి విలువైన సమాచారాన్ని మరియు సలహాలను సేకరించవచ్చును.

అన్నింటిని కంట్రోల్ చెయ్యాలనుకోవడం:

ఇది మీరు బాగా గుర్తుంచుకోవలసిన ఒక విషయం. ప్రతి చిన్న విషయాన్నీ మీరే గమనిస్తూ ప్రతి దానిని కంట్రోల్ చెయ్యాలనుకోవడం అత్యాసే అవుతుంది, తప్పులు అందరి వలన జరుతాయి, అయితే మీరు గుర్తుచుకోవలసినదల్లా మీరు అనుకున్న ప్లాన్ కాస్త అటు ఇటు అవుతున్నా కాస్త ఓర్చుకుంటూ మీ అంతిమ ధ్యేయాన్ని దృష్టిలో ఉంచుకొని బిజినెస్ నిర్వహించగలిగితే మీకు మానిసకంగా ప్రశాంతత కూడా లభిస్తుంది.

స్టాఫ్ పట్ల insecurity ఫీల్ అవ్వటం:

బిజినెస్ అంటే ఒకరితో అయ్యే పని కాదు కనుక ఖచ్చితంగా మీ బిజినెస్ కోసం మీరు కొంత మంది సభ్యలను కొన్ని అవసరాల కోసం తీసుకోవలసి ఉంటుంది, అయితే చాలా మంది లీడర్ షిప్ పోజిషన్ లలో ఉన్న వారు మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులను తమ స్టాఫ్ సభ్యులుగా ఎన్నుకునేందుకు భయపడతారు. వారు బిజినెస్ లో ఉంటే ఎక్కడ మొత్తం అభినందనలు వారికే వేల్లిపోతాయేమో అని భయపడుతూ ఉంటారు కాని, అటువంటి భావన మంచిది కాదు, మంచి స్టాఫ్ సభ్యులను మనసారా అభినందిచాలి, వారి సేవలను వినియోగించుకుంటూ మీ కస్టమర్ లను సంతృప్తి పరచటానికి ప్రయత్నించాలి.

లాభాపేక్ష లేకపోవడం:

బిజినెస్ లో లాభార్జన చెయ్యాలనుకోవడం లో ఏమాత్రం తప్పు లేదు, బిజినెస్ చేసే ప్రతి వారు అదే ఉద్దేశంతో బిజినెస్ చేస్తారు. లాభం గనుక రాకపోతే మీ బిజినెస్ మనుగడే కష్టతరం అవుతుంది, మీ మీదే ఆధారపడి ఉన్న స్టాఫ్ కు కూడా కష్టం అవుతుంది. కాబట్టి లాభమే ధ్యేయంగా ముందుకు వెళ్ళాలనుకోవడం లో ఏమాత్రం తప్పు లేదు కాని కేవలం లాభార్జన కోసం పనిచేసేలా మారకుండా ఉంటే సరిపోతుంది.

Comment using Facebook for quick reply

error: Content is protected !!