ఇంగ్లీష్ లో బ్లాగ్ రాయాలి అని ఉంది కాని మా ఇంగ్లీష్ లో చాలా తప్పులు ఉంటాయి ఎలా అని చాలా మంది అడుగుతున్నారు? ఒక బ్లాగింగ్ కోసమే కాదు ఈ రోజు ఇంగ్లీష్ బాష రాకుండా మంచి ఉద్యోగాలు ,అవకాశాలు పోగొట్టుకుంటున్నాము. మరి ఈలాంటి సమయంలో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వారందరికీ  ఒక ఇంగ్లీష్ అద్భుత దీపం ఉంది. దాని కధేంటో నా స్టైల్ లో చూడండి.

**********************************************************************************************************************

రాంబాబుకి లైఫ్ లో రొండు తీరని కోరికలు ఉన్నాయి.ఒకటి కులమతాల గొడవలు లేని భారత దేశాన్ని చూడాలి అని. ఇంకోటి, ఇంగ్లీష్ లో లవ్ లెటర్ రాయాలి అని. మొదటి కోరిక తీరే  అవకాశం తక్కువ, అందుకే తన రొండో కోరిక తీర్చుకోడానికి కుస్తీ పడుతున్నాడు.

ఒకసారి లవ్ లెటర్ రాయడానికి ఆన్ లైన్ లో సెర్చ్ చేసి “లీవ్ లెటర్ ” కంటెంట్ చూసి, ఇదేదో బాగుంది అని దానినే ప్రింట్అవుట్ తీసి ఒక అమ్మాయికి ఇచ్చాడు.అ అమ్మాయి ఇంగ్లీష్ లో ఏదో తిట్టి వెళ్లిపోయింది. మనోడికి ఎందుకు తిట్టిందో అర్ధం అయ్యింది కాని, ఏమి తిట్టిందో అర్ధం కాలేదు.

ఇంగ్లీష్ సినిమాలు చూస్తే ఇంగ్లీష్ బాగా వస్తుంది అని ఎవరో ఫ్రెండ్ చెపితే తెగ చూస్తున్నాడు. కలలోకి ఇంగ్లీష్ సినిమా హీరోయిన్లు వస్తున్నారు గాని, మనోడి బుర్రలోకి ఇంగ్లీష్ రావట్లేదు. విచిత్రమేమిటంటే కలలో వచ్చే ఇంగ్లీష్ సినిమా హీరోయిన్లు కుడా రాంబాబుతో తెలుగులో మాట్లాడుతున్నారు.

90 రోజులు ఇంగ్లీష్ పేపర్ చదివితే ఇంగ్లీష్ వస్తుంది అని రోజు ఇంగ్లీష్ పేపర్ కొంటున్నాడు. 90 రోజుల తరువాత రాంబాబు విధి చివరన ఉండే పాత పేపర్లు కొనే సత్తి గాడికి లాభం కలిగింది గాని కాని, రాంబాబుకి లాభం లేకపోయింది.

********************************************************************************************************

మరి ఈలాంటి రాంబాబులు మనలో చాలా మంది ఉన్నారు. ఏదయినా ఒక స్కిల్ రావాలి అంటే ఎంత విన్నాము ,చదివాము అనే దాని కంటే దానిని ప్రాక్టికల్ గా ఎంత వరకు వాడుతున్నాము అనే దాని మీదే ఆ స్కిల్ మనకి వస్తుంది.

మరి ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకునే వారు…వినటం,చదవటంతో పాటు మాట్లాడటం ,రాయటం ప్రాక్టీసు చేస్తే ఫలితం ఉంటుంది.

మాట్లాడటానికి మన చుట్టూ మనషులు ఉన్నారు, ఏదయినా తప్పు మాట్లాడితే ఆ తప్పులు చెపుతారు.మరి ఇంగ్లీష్ బాగా రాయటం నేర్చుకోవాలి అంటే ఎలా …మన పక్కన ఎవడో ఒకడు కూర్చుని తప్పులు దిద్దడు కదా.

మరి అలాంటి ప్రాబ్లం ఎగరకొట్టటానికి  Grammarly  అనే  ఒక మంచి ఆన్ లైన్  టూల్ అందుబాటులో ఉంది.

ఈ టూల్ ఎలా పని చేస్తుంది?

ఈ వెబ్ సైట్ లో మనం రిజిస్టర్ అయిన తరువాత…మనం రాస్తున్న కంటెంట్ ని ఆ వెబ్ సైట్లో పెట్టి చెక్ చేస్తే దానిలో ఉండే తప్పులు చూపిస్తుంది. తప్పులు చూపించటంతో పాటు కరెక్ట్ ఫార్మటు  ఏంటో కుడా చెపుతుంది.

ప్రతి సారి మనం రాసే కంటెంట్ ని దీనిలో అప్ లోడ్ చెయ్యక్కేర్లేదు. ఇంటర్నెట్ బ్రౌజరు ఎక్స్టెన్షన్(browser extension) ఉంది. దాన్ని మీరు వాడుతున్న వెబ్ బ్రౌజరు లో(Chrome, Firefox,Internet Explorer)  Install చేసుకుంటే…ఇకపై మీరు ఇంటర్నెట్లో ఎక్కడ ఇంగ్లీష్ లో టైపు చేస్తున్నాగాని , దానిలో ఎన్ని తప్పులు ఉన్నాయి ,వాటి correct  sentesne లేదా correct spellings ఏంటి అనేది చూపిస్తుంది.

అంటే ఇక పై  మీరు ఈ-మెయిల్ రాస్తున్నా, ఫేస్ బుక్ లో స్టేటస్ రాస్తున్నా, MS word Document లో ఏదయినా ఇంగ్లీష్ కంటెంట్ రాస్తున్నా …ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది.అలా మనం ఇంగ్లీష్ రాస్తూనే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.

ఈ కింద స్క్రీన్ లో చూపిన విధంగా ఏదయినా మేటర్ టైపు చేస్తే , దానిలో Grammer Mistakes, Sentense Format Mistakes చూపిస్తుంది. దానితో పాటు కరెక్ట్ ఏంటో చెపుతుంది. మనం ఆ కరెక్ట్  ఫార్మటు మీద క్లిక్ చేస్తే,మన కంటెంట్ కరెక్ట్ ఫార్మటు కి మారుతుంది.

 

grammarly

7 days Free Premium Version:

అయితే ఈ టూల్ ఫ్రీ వెర్షన్ లో చాలా తక్కువ ఫీచర్స్ ఉన్నాయి. ప్రీమియం వెర్షన్ లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. కాని ఆ ప్రీమియం వెర్షన్ వాడకుండా ఈ టూల్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవటం కష్టమే మరి.

అందుకు  బాధ పడక్కేర్లేదు…ఒక వారం రోజులు దీని ప్రీమియం వెర్షన్ ఫ్రీగా వాడుకోవచ్చు.

Click Here for Grammerly 7 day Free Premium Version.

పై లింక్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్క్రీన్ లో చూపించిన విధంగా  వస్తుంది.

Free Grammar Checker

 

అక్కడ “Get Grammarly ” అనే బటన్ క్లిక్ చేస్తే ” మీ పేరు , ఈ-మెయిల్ ఐ.డి”  అడుగుతుంది.

ఆ వివరాలు ఇచ్చి  మీరు రిజిస్టర్ అయితే Grammely Premium Version ని ఒక వారం రోజులు ఫ్రీ గా వాడుకోవచ్చు.

ఆ తరువాతా Free Version వాడుకోవచ్చు.

ఆ వారం తరువాత  మీరు ప్రీమియం వెర్షన్ కొనే ఆలోచన లేకపోతే  Free గా వాడుకోవచ్చు.కాకపోతే Free వెర్షన్ లో ఫీచర్స్ తక్కువ ఉంటాయి. మీకు ఈ టూల్ నచ్చి , దాని  ఫీచర్స్ మొత్తం వాడుకోదలిస్తే అప్పుడు మీరు నెల వారి అమౌంట్ కట్టి  మొత్తం ప్రీమియం వెర్షన్  వాడుకోవచ్చు.

ఇంగ్లీష్ లో , నేర్చుకోవాలి అనుకునే వారికి , బ్లాగింగ్ చెయ్యాలి అనుకునే వారికి ఇది తప్పకుండా వాడవలసిన టూల్.  ముందు రిజిస్టర్ అవ్వండి వారం తరువాత ఫ్రీ వెర్షన్ వాడుకోండి. ఎలా అయినా సరే ఇంగ్లీష్ నేర్చుకోండి.

Go To Grammarly Tool 

రాంబాబు లవ్ లెటర్ రాయటం కోసం ఈ టూల్ వాడుతున్నాడు..మీరు మాత్రం బ్లాగింగ్ కోసం ,మీ చదువు కోసం , మీ ఇంగ్లీష్ స్కిల్ కోసం ఈ టూల్ వాడండి. inko

ఈ లాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీరు చదవటం మాత్రమే కాకుండా  అందరికి  షేర్ చేసుకోండి.

 

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

Read Online Business Updates, Startup news in your E-mail

You have Successfully Subscribed!