Limited Liability Partnership రిజిస్ట్రేషన్ గురించి ?

ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియలో LLP రిజిస్ట్రేషన్ అంటే ఏంటి ? Pvt Ltd కి దీనికి ఉన్న వ్యతాసం, ఏ సమయంలో ఈ LLP రిజిస్ట్రేషన్ కి వెళ్లొచ్చు అనేది చూద్దాము.

LLP (Limited Liability Partnership) అనేది 2008 నుండి ప్రారంభమయింది. మాములుగా రిజిస్టర్ చేసే Partnership Firm  కంటే మెరుగయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇది. ఒక రకంగా ఇది Partnership Firm కి  PVT LTD రిజిస్ట్రేషన్ కి మధ్యతరహాగా ఉంటుంది.
దీని పేరులో చెప్పినట్టే (Limited Liability ) కంపెనీ నష్టాలకు పార్టనర్ ల యొక్క సొంత ఆస్తులకు ఎటువంటి సంభంధం ఉండదు. అలానే, ఒక పార్టనర్ ప్రవర్తన,నడవడిక వలన కలిగే నష్టానికి ఇంకో పార్టనర్ కి సంభంధం ఉండదు.అలానే, PVT LTD రిజిస్ట్రేషన్ తో పోల్చుకుంటే తక్కువ ఖర్చు మరియు టాక్స్ పరంగా తేలిక పాటి వ్యవహారం.

LLP Benifits:

  • Partnership Firmలో కంపెనీ కి ఉన్న అప్పులు, లోన్ లు  తీర్చటానికి పార్టనర్ ల సొంత ఆస్తులు కూడా జప్తు చెయ్యొచ్చు . LLP లో కంపెనీ లో పెట్టిన పెట్టుబడి మాత్రమే నష్టపోతారు, సొంత ఆస్తులకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు.
  • 40లక్షల టర్న్ ఓవర్ లేదా 25 లక్షల పెట్టుబడి ఉన్నపుడు మాత్రమే Annual Returns ఆడిట్ చేయవలసి ఉంది.
  • PVT LTD తో పోల్చుకుంటే Dividend Distribution Tax and tax surcharge లాంటి టాక్స్ లు ఉండవు.

LLP కంపెనీ ఎవరు రిజిస్టర్ చెయ్యొచ్చు ?

కనీసం  ఇద్దరు పార్టనర్స్ ఉండాలి. ఇద్దరిలో ఇంకొకరు NRI లేదా Foreign National అయినా పర్లేదు.

 LLP కంపెనీ Registration కి ఎంత అవుతుంది ?

LLP కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం మీకు 8000 Rs  నుండి 10000Rs వరకు అవుతుంది.

 LLP రిజిస్ట్రేషన్ కోసం అవసరమయిన డాకుమెంట్స్ ?

డైరెక్టర్స్/పార్టనర్స్ డాకుమెంట్స్

  • Scanned copy of PAN Card or Passport (Foreign Nationals & NRIs)
  • Scanned copy of Voter’s ID/Passport/Driver’s License
  • Scanned copy of Latest Bank Statement/Telephone or Mobile Bill/Electricity or Gas Bill
  • Specimen signature (blank document with signature [partners only])

రిజిస్టర్డ్ ఆఫీస్ డాకుమెంట్స్

  • Scanned copy of Latest Bank Statement/Telephone or Mobile Bill/Electricity or Gas Bill
  • Scanned copy of Notarised Rental Agreement in English
  • Scanned copy of No-objection Certificate from property owner
  • Scanned copy of Sale Deed/Property Deed in English (in case of owned property)

Comment using Facebook for quick reply

క్రింద కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియచేయండి..నలుగురితో షేర్ చేసుకోండి

హాయ్... నా పేరు రవికిరణ్. స్మార్ట్ తెలుగు బ్లాగ్ Founder & Writer

ఆన్ లైన్ బిజినెస్ - బ్లాగింగ్ - స్టార్ట్ అప్స్ గురించి ఆర్టికల్స్ డైరెక్ట్ గా ఈ-మెయిల్  పొందటానికి, నాతో ఈ-మెయిల్ ద్వారా టచ్ లో ఉండటానికి మీ పేరు, ఈ-మెయిల్ ఇచ్చి Subscribe అవ్వండి. 

Subscribe Now
error: Content is protected !!