స్టార్ట్ అప్ ఓనర్ లకు ఉపయోగపడే మోటివేషన్ ఆప్ లు

Motivation ups for start up owners

చిన్న బిజినెస్ లు ప్రమాణంలో చిన్నవే అయ్యినప్పటికి వాటిని నడిపించటం ఏమాత్రం సులభం కాదు. ఒక పక్క తమ బిజినెస్ లకు సంబందించిన లక్షా తొంబై పనులను చేస్తూనే తమ బిజినెస్ పట్ల ఇతరులు చేసే కామెంట్ లను ఇతరులు నెగటివ్ ప్రభావాలను తమ మీద పడనివ్వకుండా ఎల్లప్పుడూ మోటివేషన్ తో ఉండటం అంత సులభం ఏమీ కాదు. కాని అదృష్టవశాత్తు నేటి కాలంలో ఆ విధంగా మనకు సహాయపడేందుకు చాలా రకాల అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి.

అలా చిన్న బిజినెస్ ల ఓనర్ లకు ఉపయోగపడుతూ తమ ఉత్పాదకతను పెంపొందించేందుకు ఉపయోగపడే అప్లికేషన్లను కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.

Quotes:

మీరు బాగా నిస్పృహ మరియు నిరాశతో ఉన్నప్పుడు ఒక మంచి inspirational కొటేషన్ మీకు ఇవ్వగలిగిన మోటివేషన్ కు మించినది మరొకటి ఉండదు. ఈ Quotes అనే అప్లికేషన్ అచ్చం అటువంటిదే, మీకు ఒక వాల్ పేపర్ ద్వారా ప్రతి రోజుకీ కావలసిన ప్రోత్సాహాన్ని మరియు జ్ఞానాన్ని కూడా అందిస్తుంది. ఇది Windows 8 మరియు అంతకంటే ఎక్కువ వెర్షన్ లను వాడుతున్న యూసర్ లకు అందుబాటులో ఉంది

GoalsOnTarck:

సాధారణంగా బిజినెస్ అన్నాక ఎక్కువ పని ఉండడం సహజం అయితే చేస్తున్న మరియు చెయ్యవలసిన పనులను organize చేసుకుంటూ సమయానికి పని జరిగే విధంగా చూసుకుంటూ కాని శ్రమ ఎక్కువ కలుగకుండా ఉండేలా బిజినెస్ ఓనర్ లు మేనేజ్ చేసుకోవాలి. అలా చేసుకునేందుకే ఈ GoalsOnTrack అనే అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ఈ ఆప్ ద్వారా వారు తమ లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు, వాటికి గల కారణాలను కూడా తెలియచేయవచ్చు, అలవాట్లు, ఏక్షన్ ప్లాన్లు వంటి ఇతర అంశాలను కూడా ఈ ఆప్ అందచేయడం ద్వారా management సులభం అవుతుంది. ఇది Android యూసర్ లకు మరియు Windows యూసర్ లకు కూడా అందుబాటులో ఉంది.

Asana:

టీం లోని సభ్యులందరూ తాము చేసిన పనిని గురించి మరియు దాని యొక్క ప్రోగ్రెస్ ను గురించి ఈ ఆప్ ద్వారా తెలుసుకోవచ్చును. టీం సభ్యులు ఒకరితో మరొకరు సులభంగా collaberate చేసుకోవడానికి ఈ ఆప్ సహాయపడుతుంది. 15 మంది టీం సభ్యుల వరకు ఉచితంగా ఉపయోగించుకునేందుకు ఈ ఆప్ అనుకరిస్తుంది. ఈ ఆప్ కూడా ఆండ్రాయిడ్ మరియు Windows యూసర్లకు అందుబాటులో ఉంది.

Wakie:

ఇది ఒక అద్బుతమైన అప్లికేషన్. Entreprenuer లను మరియు బిజినెస్ ఓనర్ లను దానికి వీలైనంత ప్రేరణను కలిగించే మార్గాల ద్వారా వారిని నిద్ర నుంచి లేపుతుంది. యూసర్లను ఒక అలారమ్ ద్వారా నిద్ర లేపి తరువాత వారికి ఇతరుల ప్రేరణాత్మక సంభాషణలను వినిపిస్తుంది. ఇది Android యూసర్ లకు ఉచితంగా లభిస్తుంది.

Coach Me:

ఒక గట్టి ambition మరియు పట్టుదలతో ఉన్న బిజినెస్ ఓనర్లకు ఇది ఒక మంచి ఆప్. ఇది వారికి తమ బిజినెస్ ను నిర్మించుకునేందుకు మరియు కెరీర్ ను ముందుకు నడిపేందుకు సహకరిస్తుంది. అలాగే ఆసక్తి ఉన్న వారు కొత్త కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి కూడా సహకరిస్తుంది. ఈ నైపుణ్యాలను enhance చేసుకునేందుకు ఉపయోగపడే ఆప్ Android  మరియు వెబ్ వెర్షన్ లలో అందుబాటులో ఉంది.

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here