మనకి Nallamothu Sridhar గారి రిలేషన్స్ బుక్ ఎందుకు అవసరం?

“Nallamothu Sridhar”…తెలుగు ప్రపంచంలో టెక్ బీష్ముడు.
అయన వలన కొన్ని లక్షల మంది తెలుగు ప్రజలు ప్రత్యక్షంగా , పరోక్షంగా టెక్నాలజీ గురించి నేర్చుకుంటున్నారు.
ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో కొంతమంది పల్లెటూరి వారు మొబైల్ పట్టుకొని మొబైల్ ఆప్ లు ఇన్స్టాల్ చేసుకుంటున్నా…..  మారుమూల జిల్లాలలో ఒకరు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటున్నా గాని శ్రీధర్ గారు పంచె జ్ఞానం దానికి కారణం.

ఆయనోలో ఒక టెక్ నిపుణుడు మాత్రమే కాదు, జీవితాన్ని కాచి వడబోసిన ఒక ఫిలాసఫర్ కుడా ఉన్నారు.అయన ఎదురుకున్న పరిస్థితులు, పరిణామాలు ఆయనకు జీవిత తత్వం బోధించాయి.

ఆ ఆలోచనలకి రూపం ఆయన “రిలేషన్స్”  పుస్తకం.

నాకు ఎంతో ప్రేరణగా నిలిచన “Nallamothu sridhar” గారి పుట్టిన రోజు (March 3)  సందర్భంగా smarttelugu  రీడర్స్ కోసం  ఈ ప్రత్యెక వ్యాసం.

nallamothu sridhar relations

Nallamothu sridhar “రిలేషన్స్” పుస్తకం .

తన అంతర్మధనంలో తొలకరించే ఆలోచనలు ,అలజడిని ఈ తరం యువతకు ఉపయోగపడేలా కొన్ని పోస్ట్ లు ద్వారా తెలియజేస్తున్నారు.అలాంటి వాటిల్లో కొన్ని అమూల్యమయిన  రచనలు కలగలిపి ” రిలేషన్స్ ” అనే పుస్తకాన్ని రచించారు.

దాని విలువ తెలిసిన చాలా మంది ఆ పుస్తకం కొన్నుకున్నారు. అయితే సొసైటీ లో  కొత్త సినిమాకి  చూపించే ఇంట్రెస్ట్ మంచి పుస్తకానికి ఉండదు.

విలువ తెలిసిన కొద్ది మంది దానిని వెతికి మరి పట్టుకొని చదువుతారు. కాని చాలా మంది దాని విలువ తెలియక చదవరు.

మనీ కోసం పరిగెత్తే ఈ సమయం లో చదివే టైం వారికి ఉండదు. .అయితే Sridhar గారు రచించిన ఈ పుస్తకం మాత్రం కచ్చితంగా చదవవలసిన పుస్తకం.ముఖ్యంగా  ఈ రోజుల్లో చాలా మంది యువతకి శ్రీధర్ గారి రిలేషన్స్ బుక్ అవసరం చాలా ఉంది.

ఈ పుస్తకం ఎందుకు చదవాలి ?

ఈ పుస్తకం వెనక శ్రీధర్ గారు కొన్ని వాక్యాలు రాసారు “నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతరం మొదలుకొని ……ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పుస్తకం” అని.  అది, అక్షర సత్యం.

ఈ రోజు యువత పరీక్షలో ఫెయిల్ అయితే , జాబు రాకపోతే,తాము ప్లాన్ చేసిన స్టార్ట్ అప్ ఫెయిల్ అయితే …..ఇలా ప్రతి దానికి క్రుంగిపోతున్నారు.ఓటమికి బయపడుతున్నారు.

“మూడేళ్ళుగా జాబ్ రాలేదు ఇక నేను దేనికి పనికి రాను ” అని ఒకడు.
తనకు చేతకానీ ఉద్యోగంలో చేరి , దానిలో ఇచ్చే బాధ్యతలను నిర్వహించటం రాక ….ఒత్తిడికి లోనవుతున్నవాడు ఇంకొకడు.

ఇలా ఒకరు కాదు ..ఇద్దరు కాదు. మనలో చాలా మంది జీవితాన్ని చిన్న చిన్న కారణాలతో ఒత్తిడికి లోను చేసుకుంటున్నాము.

ప్రతి నిముషము…..లక్ష ఆలోచనలతో బుర్రను చెత్త బుట్టగా మారుస్తున్నాము.అన్నిటికి ముఖ్య కారణం, మన ఆలోచనలు పంచుకునే మనషులు కరువవటం.భుజం తట్టి ధైర్యం చెప్పే తోడు లేకపోవటం.

ఇంట్లో ఉండే ఇద్దరు ముగ్గురు మసుషులు కుడా ఎవరి బిజీ లైఫ్ లో వారు గడిపేస్తున్నారు.ఇలాంటి సమయంలో మన వెన్ను తట్టి ప్రోత్యాహించే మనషులు,మనసులు కావాలి.

శ్రీధర్ గారు లాంటి వారు తమ మాటలతో, రచనలతో అందరికి కొత్త ఉత్తేజం నింపుతున్నారు. అయన పోస్ట్ లు చదివి చాలా మంది పాజిటివ్ ఆలోచనలు పెంచుకున్నారు.

మనకి ధైర్యం, ఆశావాదం,మంచి ఆలోచనలు నింపే చాలా విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

 

ఈ పుస్తకంలో ని కొన్ని హై లైట్ పాయింట్లు.

ఈ పుస్తకంలో తన ఆలోచనలు,అనుభవాలను 100 టాపిక్ లుగా శ్రీధర్ గారు రచించారు.ప్రతి టాపిక్ ఒక వికాసతత్వమే. వాటిలో నాకు బాగా నచ్చిన కొన్ని టాపిక్ లు.

నెంబర్ 16 లో ” గుండెలు నిండా పిల్చండి ” టాపిక్
నెంబర్ 18 లో ” ఆహరం విలువ ”
నెంబర్ 24 లో ” విలువయినది ..ఉచితంగా ఇస్తే . దానికి సొసైటీ ఎలా స్పందితుంది”
నెంబర్ 31 లో “స్నేహితుల ప్రభావం”
నెంబర్ 38 లో శ్రమ ఓ పెట్టుబడి అని చెప్పిన పాయింట్ .
నెంబర్ 57 లో ” మోడరన్ లైఫ్ స్టైల్ ”
నెంబర్ 71 లో ” సొసైటీ….వ్యవస్థ.దాని చుట్టూ మన ఆలోచనలు”
నెంబర్ 77 లో ” టాలెంట్  ఉన్నవాడికి  దున్నుకునంత జాగా ”  టాపిక్.
నెంబర్ 83 లో ” నిజమయిన వెలుగులు ఏంటి” ?
నెంబర్ 94 లో “మనిషిలో నిజాయితి ” మీద టాపిక్

ఇవి కొన్ని మాత్రమే..ఈ పుస్తకం మొత్తం ఒక వికాసవనం.

ప్రతి టాపిక్ కుడా మనలో ఆలోచన రేకెత్తిస్తుంది. అవును ,ఇది నిజమే కదా అని అనిపిస్తుంది.
పక్క దారి పట్టే ఆలోచనలను సరయిన దారిలోకి మళ్ళిస్తుంది.

ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది?

వాసిరెడ్డి పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకం ఆని ప్రధాన బుక్ స్టోర్స్ లో దొరుకుతుంది.లేదంటే, ఈ కింద అడ్రస్ లో సంప్రదించవచ్చు.

Vasireddy publications, B-2, Telecom Qtrs,Kothapet,Hyderabad ph:9000528717

ఆన్ లైన్ లో కొనాలి అనుకునే వారు  కింగే వెబ్ సైట్ లో ఈ లింక్ లో పొందవచ్చు.

ఈ పుస్తకం కొని చదవటం మాత్రమే కాదు…శ్రీధర్ గారు చెప్పిన మంచి విషయాలు పాటించండి.

 

 

 About Blog Author
నా పేరు రవికిరణ్. Entrepreneur - Digital Marketing Analyst and Blogger.

Startups,Social Media,Digital Marketing,Online Business,Online Money నాకున్న  knowledge & Experience ఈ బ్లాగ్ లో తెలుగు లో రాస్తున్నాను.

ఇంటరెస్ట్ ఉన్న వారు నా Facebook Profile ​ Follow  అవ్వండి
SUBSCRIBE Our Youtube Channel for Videos

Comment using Facebook for quick reply

క్రింద కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియచేయండి..నలుగురితో షేర్ చేసుకోండి

హాయ్... నా పేరు రవికిరణ్. స్మార్ట్ తెలుగు బ్లాగ్ Founder & Writer

ఆన్ లైన్ బిజినెస్ - బ్లాగింగ్ - స్టార్ట్ అప్స్ గురించి ఆర్టికల్స్ డైరెక్ట్ గా ఈ-మెయిల్  పొందటానికి, నాతో ఈ-మెయిల్ ద్వారా టచ్ లో ఉండటానికి మీ పేరు, ఈ-మెయిల్ ఇచ్చి Subscribe అవ్వండి. 

Subscribe Now

 About Blog Author
నా పేరు రవికిరణ్. Entrepreneur - Digital Marketing Analyst and Blogger.

Startups,Social Media,Digital Marketing,Online Business,Online Money నాకున్న  knowledge & Experience ఈ బ్లాగ్ లో తెలుగు లో రాస్తున్నాను.

ఇంటరెస్ట్ ఉన్న వారు నా Facebook Profile ​ Follow  అవ్వండి
SUBSCRIBE Our Youtube Channel for Videos
error: Content is protected !!