మాములుగా ఫ్లాష్ సేల్ అంటూ ఈ-కామర్స్ సంస్థలు జనాలను వెర్రి వాళ్ళను చేస్తున్నాయి. ఒక నిముషం కూడా కాకుండానే సేల్ అయిపోయింది అని బోర్డ్ పెడతారు. అందుకే, అలాంటి కాంటెస్ట్ ల మీద జనాలకి నమ్మకం పోయింది.
కానీ “One Plus” కంపెనీ కొద్దీగా భిన్నంగా ఆలోచించి డిసెంబర్ నెలలో డిసెంబర్ dash సేల్స్ అని ఒక కాంటెస్ట్ రన్ చేస్తుంది.

ఈ  కాంటెస్ట్ గురించి మనం సోషల్ మీడియా లో షేర్ చేసినప్పుడు  మన ద్వారా కొత్త వారు  రిజిస్టర్ అయితే  ఏదో ఒక వన్ ప్లస్ ఐటెం మనకి 1 రూపాయికే  పొందే అవకాశం కలిపిస్తుంది.

Oneplus 3 ఫోన్ 1 రూపాయికే  కొనాలి అంటే మన ద్వారా  300 మంది  రిజిస్టర్ అవ్వాలి . అంత మంది రిజిస్టర్ అవటం కొద్దిగా కష్టమయినప్పటికీ కూడా   150Rs Gift card, OnePlus 3 Cover Phones, Cases, Ear Phones లాంటివి మాత్రం తేలికగానే పొందచ్చు. ఆ ఐటమ్స్ ఒక రూపాయికే ఎలా కొనాలో తెలియజేస్తూ  కాంటెస్ట్ వివరాలు మీ కోసం.

సేల్స్ లో పాల్గొనాలంటే ఏమి చేయాలి?

Step 1 :  ముందుగా ఈ లింక్ క్లిక్ చేసి  కాంటెస్ట్ పేజీ కి  వెళ్ళండి.

 

oneplus-3t-december-dash

 

Step 2: పై చిత్రం లో చూపిన విధంగా  సైట్ ఓపెన్ అయిన తరువాత, కొంచెం క్రిందకు స్క్రోల్ చేస్తే Entry Challenge అని వైట్ కలర్ లో Heading ఉంటుంది. దాని క్రింద Get your Oneplus Account ready అని ఉంటుంది. అక్కడే దాని ప్రక్కన Right side లో Sign In అని కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.ఇప్పుడు మీరు కొత్త పేజ్ లోకి వెళ్తారు.

log-in-oneplus-account

Step 3 : పై చిత్రం లో చూపిన విధంగా  ఇక్కడ రొండు పద్ధతులు ఉన్నాయి .

మొదటిది డైరెక్ట్ గా  మీ ఫేస్ బుక్ లేదా జిమెయిల్ ద్వారా లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వచ్చు.

ఇంకో పద్దతి ” sign up with e-mail” అని ఉంటుంది. దానిపై  దాని మీద క్లిక్  చేసి రిజిస్టర్ అవ్వచ్చు.ఇలా రిజిస్టర్ అయ్యేటప్పడు   username, email, password ఎంటర్ చేసిన తరువాత క్రింద I’m not robot అని ఉన్న బాక్స్ పై టచ్ చేసి క్రింద ఉన్న రెడ్ కలర్ sign up బటన్ పై టాప్ చేయండి.sign up with e-mail  ఆప్షన్ ద్వారా మీరు రిజిస్టర్ అవుతుంటే   మీ మెయిల్ కు confirmation మెయిల్ వస్తుంది. దానిని ఓపెన్ చేసి కచ్చితంగా confirm చేయాలి.

Step 4  : ఇప్పుడు Entry Challenge హెడ్డింగ్ క్రింద ఉన్న (ఇతర మూడు) Phone Number Verification, Shipping Address details ,Social Network Sharing  పనులు చేయాలి.

Step 5: Social Network Sharing ద్వారా   ఆఫర్ వివరాలను షేర్ చేయాలి. మీరు సోషల్ మీడియాలో షేర్ చేసిన లింక్ ద్వారా ఎవరైనా కొత్త వాళ్ళు రిజిస్టర్ అయితే మీకు పాయింట్స్ వస్తాయి. కంపెని తెలిపిన సమాచారం ప్రకారం పాయింట్స్ పెరిగేకొద్దీ హై వాల్యూ ఐటెం కొనేందుకు అవకాశం ఉంటుంది.

ఎప్పుడు కొనవచ్చు ?

Dec 23 మరియు Dec 30 న కంపెని స్టోర్ లో మధ్యాహ్నం 12 నుండి సాయింత్రం 6 వరకూ ఈ సేల్స్ మొదలవుతాయి. ఇక మీరు సొంతం చేసుకున్న పాయింట్స్ కు అనుగుణంగా పైన చెప్పబడిన డేట్స్/టైమింగ్ లో Oneplus ఐటమ్స్(ear ఫోన్స్, 3T ఫోన్, టి షర్ట్స్, cases, బాగ్స్ etc) ను cart లో యాడ్ చేసుకోగలిగితే మీరు వాటిని 1rupee కే కొనే అవకాశం ఉంది.

దీనితో పాటు వీక్లీ ప్రైజ్ కూడా ఉంది. అంటే పాయింట్స్ తో సంబంధం లేకుండా రిజిస్టర్ అయిన యూసర్ కు, డిసెంబర్ లోని ప్రతీ శనివారం కంపెని రాండమ్ గా విన్నర్ ను ఎంచి, వాళ్ళకు oneplus 3T ను అందిస్తుంది. విన్నర్ కు మెయిల్ చేస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. ఏదో ఒక One plus Item 1 రూపాయికే కోనేయండి.

ఇలాంటి మంచి ఆన్ లైన్ ఆఫర్స్  గురించి తెలుసుకోటానికి అందరికి ఉపయోగపడే ఈ ఆర్టికల్ ని ఫేస్ బుక్, వాట్స్ అప్ లో   మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి.

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

Read Online Business Updates, Startup news in your E-mail

You have Successfully Subscribed!