ఆన్ లైన్ బిజినెస్ కోసం వెబ్ సైట్ ఎలా ?

4
WEBSITE FOR ONLINE BUSINESS

చాలా మంది మంచి ఐడియా చెబుతారు.మేము ఈ ఐడియా మీద బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్నాము ఏలా అని అడుగుతారు.దానికి ఒక చిన్న వెబ్ సైట్ పెట్టుకోండి అంటే మాత్రం ఆలోచిస్తారు.

ఒక చిత్రకారుడి మదిలో ఉన్న ఆలోచన కాగితం మీద పెడితేనే కదా ప్రపంచానికి మంచి చిత్రం కనపడేది .లేదంటే ఎంత మంచి చిత్రం అయినా ఆ చిత్రకారుడి ఆలోచనలోనే ఉండిపోతుంది.

వెబ్ సైట్ కుడా అలాంటిదే…నీ ఐడియాకి ప్రతి రూపం.

చాలా ఆన్ లైన్ బిజినెస్ లకు వెబ్ సైట్ చాలా అవసరం. వెబ్ సైట్ లేకుండా కుడా ఆన్ లైన్ బిజినెస్ రన్ చెయ్యొచ్చు. కాని వెబ్ సైట్ అనేది కొన్ని బిజినెస్ లకి అనివార్యం..కొన్నిటికి ముఖ్యం…కొన్నిటికి మంచిది.
కాని చాలా మంది వెబ్ సైట్ రూపొందించుకోవాలి అంటే భయపడతారు .

దానికి కారణం………….
వారికి ప్రోగ్రాం స్కిల్స్ లేకపోవడం కావచ్చు లేదా దాని గురుంచి అసలు ఏ మాత్రం అవగాహన లేకపోవడం కావచ్చు.
మరియు వెబ్ సైట్ అంటే చాలా ఖర్చు తో కూడినది అనే అభిప్రాయం.

కాని ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకపోయినా వెబ్ సైట్ చేసుకోవచ్చు.చాలా తక్కువ ఖర్చుతో కుడా వెబ్ సైట్ పెట్టుకోవచ్చు.

మరి ఆ వెబ్ సైట్ గురుంచి ఈ వారం smarttelugu.com ఆర్టికల్ :

వెబ్ సైట్ కోసం ఏమి కావాలి?

మన బిజినెస్ కోసం వెబ్ సైట్ కావాలి అనుకుంటే, మన బిజినెస్ కి తగట్టు ఆ వెబ్ సైట్ కి ఒక మంచి పేరు సెలెక్ట్ చేసుకోవాలి.వెబ్ సైట్ పేరు కోసం “వెబ్ సైట్ డొమైన్ ” బుక్ చేసుకోవాలి.ప్రతి ఇయర్ దానిని రెన్యువల్ చేసుకోవాలి. లేదా ఒకే సారి 5 ఇయర్స్ కి , 10 ఇయర్స్ కి కొనుకోవచ్చు.

వెబ్ సైట్ పేరు తరువాత వెబ్ సైట్ ని(వెబ్ సైట్ ఫైల్స్ ) ఆన్ లైన్ లో పెట్టడానికి వెబ్ సర్వర్ కావాలి.ఇది కుడా ప్రతి  ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. లేదా ఒకేసారి 3 ఇయర్స్ కి, 5 ఇయర్స్ కి కొనుకోవచ్చు.

వెబ్ సైట్ పేరు,వెబ్ సైట్ సర్వర్ తీసుకున్నాక ..ఇప్పుడు వెబ్ సైట్ తయారు చెయ్యాలి.దానికి రొండు మార్గాలు.
ఒకటి ప్రోగ్రామింగ్ ద్వారా వెబ్ సైట్ రూపొందించడం.
ఇంకోటి రెడీ మేడ్ సాఫ్ట్ వేర్ ద్వారా వెబ్ సైట్ ని రూపొందించడం.

ఏది మంచిది?

పెద్ద అప్లికేషన్ లేదా టెక్నాలజీ మీద ఆధారపడిన బిజినెస్ కి కొద్దిగా ఖర్చు అయినా ప్రోగ్రాం ద్వారా వెబ్ సైట్ చేసుకోవటమే మంచి ఆప్షన్.

కాని అందరికి ప్రోగ్రాం రాదూ. మరి ఆ సమయంలో రెడీ మేడ్ వెబ్ సైట్ సాఫ్ట్ వేర్లు ఉపయోగించి చేసుకోవడం ఉత్తమం.
చిన్న మరియు మధ్య తరహా ఈ-కామర్స్ వెబ్ సైట్ లకి ఈ ఆన్ లైన్ సాఫ్ట్ వేర్లు చాలా ఉత్తమం.

అయితే రెడీ మేడ్ సాఫ్ట్ వేర్లు అన్ని బిజినెస్ లకి ..అందరి అవసరానికి సరిపోవు.వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి.కాని చిన్న బడ్గెట్ లేదా ఒక రాయి వేసి చూద్దాం అనుకునే వారికి ఇవి కరెక్ట్ గా సరిపోతాయి.

ప్రోగ్రాం ద్వారా వెబ్ సైట్ ఎలా చేసుకోవాలి?

వెబ్ సైట్ చేయటానికి HTML,CSS,JAVASCRIPT,JAVA, DOTNET,PHP ,SQL లాంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి.

చిన్న వెబ్ సైట్లు అయితే HTML,CSS,JAVASCRIPT లాంటి స్కిల్స్ ఉంటె చాలు.వీటిని టెక్నికల్ గా Front End ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంటారు.

JAVA, DOTNET,PHP లాంటి స్కిల్స్  టెక్నికల్ గా Back end  ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంటారు.

ఇక మనం వెబ్ సైట్ లో ఏదయినా డేటా ఉంటె (అంటే ఉదాహరణకి ఒక కస్టమర్ పేరు , అడ్రస్ ,ఆ కస్టమర్ ఇది వరకు కొన్న వస్తువుల లిస్టు. అలానే మనం అమ్మే వస్తువుల వివరాలు లాంటివి) డేటాబేస్ లో పొందుపరచాలి.
దానికి ORACLE లాంటి డేటా బేస్ లు కావాలి. అలానే ఆ డేటాబేస్ నిర్వహించటానికి  SQL, SQLSERVER లాంటి డేటాబేస్ స్కిల్స్ ఉండాలి.

పైన చెప్పిన లిస్టు లో ప్రోగ్రాంలు మనకి వస్తే మనమే చేసుకుంటాము.లేదంటే వెబ్ సైట్ చేసే వారికి కొంత మనీ ఇచ్చి చేయించుకోవాలి.

వెబ్ సైట్ చేయించుకునే ముందు ఏమి చూడాలి ?

బయట ఎవరిచేత అయిన మనం వెబ్ సైట్ చేయించుకుంటే వారు వెబ్ సైట్ డిజైన్, డెవలప్మెంట్ కి కొంత ఛార్జ్ చేస్తారు.కొంత మంది ప్రతి నెల Maintenance కోసం ఛార్జ్ చేస్తారు.మరి మీరు ఒకరికి వెబ్ సైట్ తయారికి మనీ ఇచ్చేముందు కింద విషయాలు తెలుసుకోండి.

  • వెబ్ సైట్ నిర్వహించటానికి ఏ వెబ్ సర్వర్ తీసుకున్నారు.
  • వెబ్ సైట్ చేసే వారి వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత?
  • వారు వెబ్ సైట్ Front End కోసం ఏ టెక్నాలజీ వాడుతున్నారు ?
  • వెబ్ సైట్  ప్రోగ్రామింగ్ కోసం ఏ టెక్నాలజీ వాడుతున్నారు ?
  • వెబ్ సైట్ లో ఏ డేటా బేస్ వాడుతున్నారు ?
  • అలానే వెబ్ సైట్ కి ఎక్కువ ట్రాఫిక్ వస్తే వెబ్ సైట్ డౌన్ అవకుండా పెర్ఫార్మన్స్(Performance) ఏలా చేస్తున్నారు?
  • వెబ్ సైట్ లో ఎర్రర్ లు వస్తే వెంటనే నివారిస్తారా?

చెపుతూ పోతే చాలా ఉన్నాయి..

ఇవ్వని మాకెందుకు,డబ్బులు ఇస్తాము వారే చేసి ఇస్తారు అనుకుంటే మీరు “వెబ్ బురదలో ” కాలు వేసినట్టే.ఎందుకంటే వెబ్ సైట్ ఒకరు చేసాక ఏదయినా ప్రాబ్లం వస్తే, ఇంకొకరు చేయటానికి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది.అందుకే కొంత ఇన్ఫర్మేషన్  ముందే  తెలుసుకోండి.
అలానే వెబ్ సైట్ అయ్యాక కొన్ని ఎర్రర్ లు వస్తాయి.అలానే కొన్ని మార్పులు చేయవలసి వస్తుంది.
దానికి వెబ్ సైట్ చేసిన వారే ప్రతి నెల కొంత అమౌంట్ తీసుకుంటారు. ఇది చూడటానికి పెద్ద అమౌంట్ లా అనిపించదు కాని మీరు వెబ్ సైట్ రన్ చేస్తున్నంత కాలం ఇది కావాలి. అందుకే ఆ సరిగ్గా అందించే వెబ్ సైట్ కంపెనీని సెలెక్ట్ చేసుకోండి.

 

 వెబ్ సైట్ టూల్స్ :

చిన్న ,మధ్య తరహా వెబ్ సైట్ ఆలోచన అయితే మీరు రెడీ మేడ్ వెబ్ సైట్ సాఫ్ట్ వేర్ ల పైన ఆధార పడచ్చు.
అయితే ఇవి అందరి అవసారాలకి సరిపోవు.అలానే ఈ టూల్ లను వాడటం కుడా నేర్చుకోవాలి. కాని ప్రోగ్రామింగ్ తో పని లేకుండా  మంచి వెబ్ సైట్ మీరే చేసుకోవచ్చు.

Free CMS సాఫ్ట్ వేర్ లు :
అలాంటి వాటిలో ముందు ఉండేది “WordPress CMS” .దీనితో ప్రోగ్రాం స్కిల్స్ లేకుండా మంచి వెబ్ సైట్ చేసుకోవచ్చు.ఒక వేళ ప్రోగ్రాం స్కిల్స్ ఉంటె  పెద్ద వెబ్ అప్లికేషన్ లు కుడా అదరగొట్టచ్చు.

చాలా మంది వర్డుప్రెస్సు ని బ్లాగ్ కోసం వాడుతారు. బ్లాగ్ Platform కి  నెంబర్ 1 అని చెప్పొచ్చు. అయితే ఈ-కామర్స్ వెబ్ సైట్ లకి , చిన్న మధ్య తరహా వెబ్ సైట్ లకి కూడా ఇది మంచి ఆప్షన్.

అయితే WordPress తో పాటు Magento ,Drupal లాంటి ఇతర Free CMS Software లు కుడా ఉన్నాయి.

కోడింగ్ లేకుండా వెబ్ సైట్ :

ఎవరితో పని లేకుండా మీ అంతంట మీరే వెబ్ సైట్ చేసుకోవాలి అంటే ఇది మీకోసమే.ఇంకా అసలు ఏమి ఆలోచించకుండా మౌస్ కదిలిస్తూ కొన్ని ఎలెమెంట్స్ ని కావాల్సిన చోటుకి లాగి పడేసే పద్దతులలో కొన్ని రెడీ మేడ్ సాఫ్ట్ వేర్ లు ఉన్నాయి.వీటికి కొంచం ఓపిక, సృజనాత్మకత, ఇంటర్నెట్ మీద మంచి అవగాహాన ఉంటె చాలు.

వాటిలో ముఖ్యమయినది మరియు బాగుండేది Weebly అనే ఆన్ లైన్ సర్వీస్ .
Weebly  లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

దీనితో  ఎవరి సహాయం అక్కర్లేకుండా వెబ్ సైట్ రూపొందించుకోవచ్చు.

దీనిలో ఫ్రీ ఆప్షన్ ఉంది. మంచి ఫీచర్లు కావాలి అంటే నెల వారి అమౌంట్ కట్టొచ్చు.కోడింగ్ లేకుండా వెబ్ సైట్ కావాలి అనుకునే వారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ .

మరి ఈ ఆర్టికల్ అందరితో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఆర్టికల్ తో వస్తా.

 

Comment using Facebook for quick reply

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here