ఒక రోజులో smarttelugu.com బ్లాగ్ నుండి 42240Rs ఎలా సంపాదించాను ?

1
HOW MONEY FROM BLOGGING

బ్లాగ్గింగ్ ద్వారా మనీ…….ఈ మాట కొంత మంది నమ్మలేదు.ఇంకొంతమందికి ఎలా అని డౌట్.అలాంటి వారందరి  కోసం smarttelugu.com నుండి మొదటి సంపాదన ఎలా సంపాదించానో చదవండి .

ఒక బ్లాగ్ ద్వారా మనీ చాలా రకాలుగా సంపాదించవచ్చు.వాటిలో ముఖ్యమయిన విధానాలు

 • యాడ్స్
 • Affiliate మార్కెటింగ్
 • బ్లాగ్ నుండి Freelancing సర్వీస్
 • బ్లాగ్ ద్వారా ట్రైనింగ్
 • ఏదయినా ప్రొడక్ట్స్ అమ్మడం(E-Books, CDs,DVDs,Videos etc.,)

నేను మొదట ముఖ్యంగా ” నాలోని పిచ్చిని”  ప్రపంచానికి తెలియజేయటానికి బ్లాగ్ మొదలుపెట్టాను. వన్ ఇయర్ నుండి బ్లాగ్ రాస్తున్నా గాని,ఇప్పటివరకు బ్లాగ్ ద్వారా మనీ మీద ఎక్కువ శ్రద్ద పెట్టలేదు.నేను చెప్పే విధానం నచ్చో..దానిలో సబ్జెక్టు నచ్చో క్రమంగా రీడర్స్ పెరిగారు.

క్రమంగా ఫాలోయర్స్ పెరుగుతున్నారు కాబట్టి ఈ న్యూ ఇయర్ నుండి  బ్లాగ్ మీద సంపాదిస్తూ …ఆ పద్దతులు అన్ని మీకు చెపుదాము అనుకున్నాను.దాని ముందు ఒక  ప్రయోగాత్మకంగా Thanks Giving Day  Deals  సందర్భాన్ని  ఉపయోగించుకున్నాను.

ఇంగ్లీష్ లో   రాసే బ్లాగ్స్ కి గూగుల్ యాడ్స్ పెట్టుకునే సౌలభ్యం ఉంది కాబట్టి మనీ త్వరగా వస్తాయి.నేను తెలుగులో రాస్తున్నాను కాబట్టి గూగుల్ యాడ్స్ పెట్టుకునే సౌలభ్యం తక్కువ.

మరి తెలుగు లో బ్లాగ్గింగ్ ద్వారా నాకు కనిపించిన మార్గాలు Affiliate మార్కెటింగ్, బ్లాగ్ నుండి ట్రైనింగ్, బ్లాగ్ నుండి Freelance సర్వీస్.

affiliate మార్కెటింగ్  అంటే ఏంటి ?

Affiliate మార్కెటింగ్ అంటే, ఒకరి ప్రోడక్ట్ లేదా సర్వీస్ మనం Refer చేస్తాము.మనం Refer చేసినప్పుడు ఎవరయినా మన ద్వారా ఆ ప్రోడక్ట్ కొంటె మనకు ఆ ప్రోడక్ట్ కంపెనీ కొంత మనీ ఇస్తుంది.

ఓహో ..ఇంతేనా. మనం Uber, కాష్ కరో లాంటి సర్వీసెస్ ని ఎలా Refer చేస్తామో,అలానే కదా అనుకోకండి.
దీనిలో చాలా సబ్జెక్టు ఉంది.

మన రీడర్స్ కి ఏది అవసరమో గుర్తించి దాని బట్టి మనం ప్రోడక్ట్ రిఫర్ చెయ్యాలి.ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ రిఫర్ చేయకూడదు. ముందు మనం ఆ సర్వీస్ ని  వాడి ఇంకొకరకి Recommend చేస్తే మంచిది. ఇదంతా ఒక క్రమంలో చేయటానికి ఒక వారధి కావాలి. దానికి బ్లాగ్ అనేది మంచి సదుపాయం.

స్మార్ట్ తెలుగు నుండి మనీ ఎలా వచ్చాయి ?

నేను 4 ఇయర్స్ నుండి ఈ-కామర్స్ ,స్టార్ట్ అప్, ఆన్ లైన్ బిజినెస్ ఇండస్ట్రీ ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు ఆ సబ్జెక్టు పైన మంచి పట్టు ఉంది. ఇంకా 3 ఇయర్స్ నుండి వెబ్ సైట్లు , హోస్టింగ్ లాంటి వాటి పైన పని చేస్తున్నాను కాబట్టి  ఏది ఎందుకు మంచిది , ఏది మంచిది కాదు లాంటి విషయ పరిజ్ఞానం ఉంది.

దానితో నేను వెబ్ హోస్టింగ్ , ఆన్ లైన్ బిజినెస్ టూల్స్ , మార్కెటింగ్ టూల్స్ , వర్డుప్రెస్సు టెంప్లేట్లు లాంటివి Recommend చేస్తున్నాను.

ఈ కింద మీరు చూస్తుంది హోస్ట్ గాటర్ ద్వారా వచ్చిన అమౌంట్ Rs 34,256…అది కాకుండా వర్డ్ ప్రెస్ థీమ్ MyThemeShop, వెబ్ సైట్ టెంప్లేట్ , TeamTreehouse వెబ్ సైట్ ద్వారా ఇంకా Rs 7984 అమౌంట్ వచ్చింది.మొత్తం 42,240 రూపాయలు.

Hostgator amount

 

మరి ఆ క్రమంలో smarttelugu నుండి ఎలా సంపాదించానో వివరంగా స్టెప్స్ లో చెప్పాను. మరి దానిని చదవాలి అంటే మీరు కింద  ఫేస్ బుక్ లో షేర్ చెయ్యండి. అప్పుడు మాత్రమే స్టెప్స్ కనపడతాయి.

కింద ఉన్న FB  Like,Share Buttons  రొండు  క్లిక్ చేస్తేనే మీకు స్టెప్స్ కనపడుతాయి.

[pwal id=”118287739″ description=”మనీ ఎలా సంపాదించానో చదవాలి అంటే కింద ఉన్న Facebook Like  and Share బటన్ రొండు క్లిక్ చేస్తే మాత్రమే స్టెప్స్ కనపడతాయి.”]

 • ముందుగానే నా బ్లాగ్ ద్వారా మంచి కంపెనీస్ తో జత కట్టాను.(Affiliate)
 • ఇక సైబర్ డీల్ టైం లో  ఎటువంటి  ఆఫర్లు ఉన్నాయో రీసెర్చ్ చేసాను.
 • వాటిలో మంచి ఆఫర్లు ఉన్న కొన్ని సర్వీసెస్ సెలెక్ట్ చేసాను.
 • దాదాపు ఆ సర్వీసెస్ అన్ని నేను ఇదివరకు వాడినవే.
 • అయితే వాటిలో కుడా smarttelugu రీడర్స్ కి ఉపయోగపడేవి మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను.
 • వాటి గురుంచి వివరంగా ఆర్టికల్ రాసాను. అవి కొంటె మనకి ఉపయోగం ఏంటి అనేది వివరించాను.
 •  ఆ ఆర్టికల్  సోషల్ మీడియా లో మార్కెట్ చేసాను.
 • సోషల్ మీడియా తో పాటు ఈ-మెయిల్ మార్కెటింగ్ చేసాను
 • బ్లాక్ ఫ్రైడే  రోజున ఆ సర్వీసెస్ అవసరం ఉన్న వారు నేను చెప్పిన లింక్స్ ద్వారా  సర్వర్లు,టెంప్లేట్లు కొన్నారు.
 • దానితో ఆ కంపెనీలు నాకు ప్రతి సేల్ కి కొంత అమౌంట్ అందించాయి.

నేను వెబ్ హోస్టింగ్ లో బాగా పాపులర్ అయిన సర్వీసెస్ తో  జత కట్టి ఉన్నాను . వాటిలో క్వాలిటీ , Budget ఇతర ప్రమాణాల పరంగా బ్లాగ్గింగ్ కి,వెబ్ సైట్ కి HostGator , BlueHost సర్వీసెస్ బాగుంటాయి.

మరి మొన్న జరిగిన Black Friday Deals లో నేను HostGator సర్వర్  Refer చేసాను. ఎందుకంటే 80% డిస్కౌంట్ ఇచ్చాడు.ఆ డిస్కౌంట్ కేవలం Black Friday కి మాత్రమే ఉంటుంది.

అలా ఒకే రోజు ఏడుగురు నా లింక్ ద్వారా సర్వర్ తీసుకున్నారు.అలానే వర్డుప్రెస్సు టెంప్లేట్ వెబ్ సైట్లు కుడా డిస్కౌంట్లు పెట్టాయి. అవి కుడా కొంత మంది తీసుకున్నారు.

మొట్ట మొదటి  స్మార్ట్ తెలుగు మనీ  3,240 Rs వచ్చాయి. అ తరువాత 24 గంటలలో నాకు  42,240 రూపాయలు వచ్చాయి.
అన్ని సర్వీస్ లు కలిపి మొత్తం 14 మంది నేను Refer చేసిన సర్వీసెస్ తీసుకున్నారు.

[/pwal]

అయితే ఇది గోరంత సంగతే…సాధించాల్సింది కొండంత ఉంది. బ్లాగ్ ద్వారా మనీ సంపాదించాలి అనుకునే వారికి ప్రోత్యాహంగా ఉంటుంది అని ఈ ఆర్టికల్ రాసాను.

 

మరి మీరు కుడా బ్లాగ్ ద్వారా సంపాదించాలి అంటే ముందు మంచి హోస్టింగ్ తీసుకోండి. వర్డుప్రెస్సు లో బ్లాగ్ రూపొందించుకోవటం మంచిది మరియు  మనీ సంపాదించటానికి అనువుగా ఉంటుంది.  మరి ఆ వర్డుప్రెస్సు ఇన్స్టాల్ చేయటానికి మంచి వెబ్ హోస్టింగ్ తీసుకోండి.వర్డుప్రెస్సు ఇన్స్టాల్ చేసుకోవటం, దానిలో బ్లాగ్ చేయటం చాలా తేలిక.

Click Here for HostGator Hosting .

మీకు వెబ్ హోస్టింగ్ తీసుకోవాలి అంటే నాకు Smarttelugu facebook పేజి లో మెసేజ్ పెట్టండి. ఎలా తీసుకోవాలో చెపుతాను. అలా నాతో మాట్లాడి  నా ద్వారా హోస్టింగ్ తీసుకున్న వారికి  ప్రీమియం వర్డుప్రెస్సు థీమ్ ఒకటి ఫ్రీ గా ఇస్తాను.

Comment using Facebook for quick reply

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here