“ఈజీ ఆన్ లైన్ మనీ ” స్కాం వలలో పడకండి

3
EASY ONLINE MONEY SCAME

శ్రీనివాస్ అమీర్ పెట్ మైత్రి వనం దగ్గర 10k బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు. హైదరాబాద్ వచ్చి 1 ఇయర్ అయ్యింది, ఇంకా ఎటువంటి ఉద్యోగం రాలేదు. కుటుంబ బాధ్యతల వలన డిగ్రీ సగంలోనే మానేసాడు. కనీసం డిగ్రీ కుడా లేకపోయే సరికి ఎవడు ఎటువంటి ఉద్యోగం ఇవ్వట్లేదు.
ఇంతలో బస్సు వచ్చి ఆగింది…పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ కోసం కొట్టుకున్నట్టు బస్సు లో సీట్ కోసం అందరు ఒకేసారి ఎగబడ్డారు.మనోడికి అప్పటికే దానిలో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది.ఎలాగో అలా సీట్ కొట్టేసాడు. హమ్మయ్యా ఇక నా స్టాప్ వచ్చే వరకు నిద్ర పోవచ్చు అనుకుంటూ విండో తెరవబోయాడు.ఆ విండో గ్లాస్ మీద పెద్ద ప్రకటన అంటించి ఉంది.
“మీరు ఇంటర్ ఫెయిల్ అయ్యారా ? 10 తో చదువు కి పుల్ స్టాప్ పెట్టారా? మీరు హౌస్ వైఫ్ ? మీ జీవితాన్ని మార్చే అవకాశం మా దగ్గర ఉంది”. ఇంటి దగ్గర కూర్చుని నెలకు వేలు సంపాదించండి. రోజుకి రొండు మూడు గంటలు  చాలు. దీనికి మీకు మీకు కావాల్సింది కొద్దిగా ఇంటర్ నెట్ బ్రౌసింగ్ మీద అవగాహన, ఒక వేళ మీకు ఇంటర్నెట్ మీద అవగాహన లేకపోతే మేము నేర్పిస్తాం. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చెయ్యండి “.

అంతే ఈ ప్రకటన చూడగానే మనోడిలో ఎక్కడో చిన్న ఆశ. ఆ యాడ్ గురుంచే ఆలోచిస్తూ ఉండి పోయాడు.నెంబర్ నోట్ చేసుకొని బస్సు దిగాడు. వెంటనే రూం కి వెళ్లి ఆ నెంబర్ కి call చేసాడు.
అవతల వ్యక్తి ఒక చిన్న పాటి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. అంతా అయిన తరువాత డిపాజిట్ కోసం ఒక 4000 కట్టాలి , నీకు నెల నెల 15000 వస్తాయి, ఆరు నెలల తరువాత ఆ 4000 కుడా తీరిగి ఇచ్చేస్తాం అని అన్నాడు “.

శ్రీనివాస్ ఆలోచనలో పడ్డాడు.అవతల వ్యక్తి “చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండి, మీకు ఇది మంచి అవకాశం. మీరు చెయ్యవలసినది మేమిచ్చే డేటా ఆన్ లైన్ లో ఎక్కించడమే. పెద్ద వర్క్ కుడా ఉండదు” అన్నాడు.

అంతే శ్రీనివాస్ వాడు ఇచ్చిన బ్యాంకు ఎకౌంటు నెంబర్ కి మనీ వేసాడు..ఒక వారం తరువాత పోస్ట్ లో ఏదో CD లు, మెటీరియల్ వచ్చింది.
దానితో శ్రీనివాస్ ఏదో పెద్ద కంపెనీ ఆఫర్ లెటర్ వచ్చినంత ఆనందంగా ఫీల్ అయ్యాడు. కాని ఆ తరువాత తనకు మనీ కట్టించుకున్న వ్యక్తి నుండి ఫోన్ రాలేదు, మనోడు తీరిగి కాల్ చేస్తే నెంబర్ పని చెయ్యట్లేదు.
వాడు చెప్పిన వెబ్ సైట్ లో చూస్తే అడ్రస్ ఏమి లేదు.అప్పుడు అర్ధం అయ్యింది శ్రీనివాస్ కి ఆన్ లైన్ మనీ స్కాం లో పడ్డాను అని.

తరువాతి రోజు ఊరు వెళదామని స్టేషన్ కి సిటి బస్సు ఎక్కాడు ..ఆ బస్సులో కుడా ఇదే తరహా యాడ్ కనిపించింది. శ్రీనివాస్ ముందు కూర్చున్న వ్యక్తి “ఆ యాడ్ లో ఫోన్ నెంబర్ ఎక్కించుకుంటున్నాడు”. అద్ చూసి శ్రీనివాస్ నవ్వుకొని ” నేనే కాదు నాలా చాలా మంది ఉన్నారు…పర్లేదు అని సంతృప్తి చెందాడు” అంతే గాని ఎదుటవాడికి అది ఒక స్కాం రా అని చెప్పలేదు. ఎందుకంటే మనం ఒక్కడిమే మోసపోతే బాధ, మన పక్కనొడు కుడా పోతే తోడు అనే ఆనందం”.

దానినే కొంత మంది “ప్లాస్టిక్ కవర్ పర్యావణానికి చేటు అని” ఏకంగా మీమ్మల్ని తమ బుట్టలో వేసుకుంటున్నారు.

మరి ఇటువంటి ఆన్ లైన్ మనీ స్కాం గూర్తించటం ఎలా ?

జనరల్ గా ఇటువంటి స్కాం చేసే వారు , ముందు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకుంటారు.
రొండు మూడు రోజుల తరువాత ఆ కంపెనీ ఎక్ష్చెచుతివె అని ఎవరో మీకు ఫోన్ చేసి మాట్లాడుతాడు. మీకు ఈ అవకాశం రావాలి అంటే చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది అన్ చెపుతాడు.
ఆ ఇంటర్వ్యూలో కింద చూపిన ప్రశ్నలు లేదా దాదాపు వీటికి దగ్గరాగా ఉండే వేరొక ప్రశ్నలు అడుగుతారు.

 • How much Time Do you Spend on the Internet?
 • Do you make Payments Online?
 • Do you know how to build a website?
 • Have you worked online before ?
 • Do you have a Debit Card ?

ఇంటర్వ్యూ అయిన 15 నిముషాలకి ఫోన్ చేసి..మీరు ఈ ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేయాటానికి అర్హత పొందారు అని, మీకు వర్క్ గురుంచి, వర్క్ ఎలా చేయాలో నేర్పించటానికి ఒక కిట్ ఉంటుంది అని. దానికి మీరు 3000 వేళ నుండి 5000 వరకు అమౌంట్ కట్టాలి అని చెపుతారు.
కొంత మంది అనుమానంతో ఆగిపోయినా , పైన చెప్పుకున్న శ్రీనివాస్ లాంటి చాలా మంది ఆ అమౌంట్ కడుతారు.

కొన్ని రోజులకి ఆ చద్ లు , కిట్ మన ఇంటికి వస్తుంది. కాని ఆ తరువాత ఆ వెబ్ సైట్ నుండి మనకి ఎటువంటి వర్క్ రాదూ.
ఒక వేళ ఏదయినా ఇచ్చినా..మొదటి నెల వర్క్ ఇస్తారు కాని నెల చివరకి మనీ ఇవ్వరు.

అయితే ఇటువంటి ఆన్ లైన్ వర్క్ లేదా మనీ వెబ్ సైట్ల లో అన్ని వెబ్ సైట్ లు స్కాం అని అనుకోలేము… కొన్ని రియల్ గా వర్క్ ఇచ్చి మనీ ఇచ్చే వారు ఉన్నారు.

మరి ఎటువంటి సందర్భంలో స్కాం అనుకోవచ్చు?

 • ముఖ్యంగా ముందుగానే మనీ కట్టమంటే ….
 • మీరు చేయబోయే వర్క్ గురుంచి సరయిన ఇన్ఫర్మేషన్ లేకపోతే…
 • వెబ్ సైట్ లో ఎటువంటి అడ్రెస్స్ లేకపోతే …..

మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు…..

 • మంచి లుక్ తో వెబ్ సైట్ హై లెవెల్ లో ఉండటం చూసి అదేదో పెద్ద కంపెనీ అనుకోకండి.
 • వర్క్ చేసే ముందు అసలు ఆ సంస్థ లేదా వెబ్ సైట్ గురుంచి ఆన్ లైన్ సెర్చ్ చెయ్యండి.
 • ఒక వేళ ఆ వెబ్ సైట్ వారు కాంటాక్ట్ పేజి లో ఏదయినా అడ్రెస్స్ ఉంచితే…ఆ అడ్రెస్స్ కి వెళ్లి చూడండి.
  ఇచ్చే వర్క్ గురుంచి పూర్తిగా వివరాలు అడగండి.
 • చేసే పనికి ముందుగానే కొంత అడ్వాన్సు తీసుకోండి.

 

నిజంగా చెప్పాలి అంటే ఆన్ లైన్ మనీ స్కాం కాదు …ఆ పేరు చెప్పి స్కాం చేస్తున్నారు. ఆన్ లైన్ లో మనీ సంపాదిస్తూ జాబులు మానేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

కాని ఒకటే రూల్ … ఆన్ లైన్ లో మనీ ఈజీ కాదు. దానికి ఏదో ఒక స్కిల్ ఉండాలి.
నీకు ఏదో ఒక స్కిల్ లేకుండా పని చెయ్యలేవు, మరి పని చెయ్యకుండా మనీ రాదూ. అలా ఈజీ గా వచ్చే మనీ కోసం చూస్తే మటుకు నువ్వు స్కాం చేసే వారి వలలో పడటానికి రెడీ గా ఉన్నట్టే….

Comment using Facebook for quick reply

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here