ఆన్ లైన్ షాపింగ్ లో మనీ ఆదా చేయటం ఎలా?

1
SAVE MONEY IN ONLINE SHOPPING

రామారావు పండగకి T.V కొందామని ఒక షాప్ కి  వెళ్ళాడు…అన్ని వివరాలు తెలుసుకున్నాక , రేటు అడిగాడు.
సరే నండి,రేపు మా వైఫ్ తో కలిసి వస్తాను..తను కుడా చూడాలి అంటూ ఆ షాప్ నుండి జారుకున్నాడు.

వెంటనే ఇంకొంత దూరంలో ఉన్న వేరే షాప్ కి వెళ్లి అక్కడ ఎంత రేటు ఉందో కనుకున్నాడు.
ఇలా సిటీ లో ఉన్న నాలుగైదు షాప్ లు తీరిగి అన్ని షాప్ లలో రెట్లు గుర్తుపెట్టుకొని , కొద్దిగా తక్కువ రేటు చెప్పిన షాప్ లో కొన్నాడు.

పండగకి T.V  కొన్న ఆనందం కంటే , కొద్దిగా తక్కువ రేటుకి కొని డబ్బులు ఆదా చేసాను అనే ఆనందం ఎక్కువ ఉంది.

మనలో చాలా మంది రామారావులు ఉన్నారు…అయినా నాలుగైదు షాప్లు తీరగకుండా వస్తువు కొంటె మనకి ఆ తృప్తి ఉండదు.
అవును మరి… డబ్బులు సంపాదించటం ఎంత ముఖ్యమో, ఆదా చేయటము  కుడా అంతే  ముఖ్యం .

మరి ఆన్ లైన్ లో ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు మనీ  ఎలా ఆదా చెయ్యొచ్చో  చూద్దాం.

బయట ఒక షాప్ కి ఇంకో షాప్ కి రేటులో కొద్ది తేడా మాత్రమే ఉంటుంది , కాని ఆన్ లైన్ లో అలా కాదు , ఒక ఆన్ లైన్ షాప్ కి ఇంకో ఆన్ లైన్ షాప్ కి చాలా తేడా ఉంటుంది.

ఆన్ లైన్ షాపింగ్ లో సైట్ కి సైట్ కి మధ్య  కొన్ని తేడాలు:

ఒక్కో సైట్ లో ఒక్కో ధర.
ఒక చోట దాని మీద free shipping ఉంటె , ఇంకో సైట్ లో ఉండదు.
ఒక సైట్ లో దాని మీద ఆఫర్ ఉంటె , ఇంకో సైట్ లో ఉండదు.
ఒక సైట్ లో ఆ వస్తువు seller మీద మంచి రివ్యూ ఉంటె…ఇంకో సైట్ అదే వస్తువు అమ్మే seller  మీద నెగటివ్ రివ్యూ ఉంటుంది.

ఇలా ఒకటా రొండా, చాలా ఆన్ లైన్ సైట్లు పుట్టుకొచ్చాయి. మరి ప్రతి సైట్ ఓపెన్ చేసి పక్క పక్కనే పెట్టుకునే చూడలేము….మహా అయితే రొండు మూడు సైట్ లు చూసి వాటిల్లో దేనిలో తక్కువ ఉందో చూసుకొని కొంటాం.

మరి ఈ బాధను నివారిస్తూ ఆన్ లైన్ Price comparision (ధరలో తేడా చూపించే ) సైట్స్ అనేవి వచ్చాయి .

ఈ వెబ్ సైట్ల వలన ఉపయోగం ఏంటి ?

వీటి పని ఏంటి అంటే, మనం షాపింగ్ చేసే ముందు ఈ వెబ్ సైట్ల కి వెళ్లి మనం కొనాలి అనుకున్న వస్తువు గురుంచి వెతికితే , ఆ వస్తువు ఏ వెబ్ సైట్ లో తక్కువ రేటుకి దొరుకుతుంది అని చూపిస్తాయి.
దానితో పాటు ఆ వస్తువు మీద ఆ వెబ్ సైట్లో free shipping ఉందా, రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఆఫర్ ఏమయినా ఉందా అని చూపిస్తాయి.

మరి ఈ వెబ్ సైట్ల లో బాగా పాపులర్ అయినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటో చూసి ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు  మీ మనీ ఆదా చేసుకోండి.

www.mysmartprice.com
బుక్స్ ధరల లో తేడా చూపించే వెబ్ సైట్ గా స్టార్ట్ అయిన ఇది …ఇప్పుడు టాప్ సైట్ గా మారింది. ఇంకో విషయం ఏంటి అంటే … ఇది మన హైదరాబాద్ కంపెనీ.

www.buyhatke.com

ఏ సైట్లో ధర తక్కువగా ఉందో సులభంగా తెలుసోకోవచ్చు.దీనికి అనే బ్రౌజరు extension కుడా ఉంది ..అది మీ ఇంటర్నెట్ బ్రౌజరులో  ఇన్స్టాల్ చేసుకుంటే,మీరు  ఒక షాపింగ్ సైట్ లో వస్తువు చూస్తునప్పుడు అది ఇంకో సైట్లో ఎక్కడ తక్కువ ధర ఉందో అక్కడే  చెప్పేస్తుంది.

www.pricedekho.com

దీనికో ప్రత్యేకత ఉంది ..ఇది ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ అంటే మీ సిటీ లో ఉన్న షాప్స్ లో కుడా రేటు Compare చేసి చూపిస్తుంది.

www.junglee.com
ఇది amazon వారి  సర్వీస్. మీరు గమనిస్తే ఈ మధ్య  T.Vలలో  దీని యాడ్  ఎక్కువగా  వస్తుంది .

www.smartprix.com

మొబైల్స్,కంప్యూటర్స్ ,కెమెరాలు  ఇలా  ఎలక్ట్రానిక్స్ ఏదయినా సరే ధరలు చూడవచ్చు.

www..compareraja.in

పేరు కి తగ్గట్టే రాజా లా ధరల తేడా చుడండి.

 

ఇవి కాకుండా ఇంకా ఇటువంటివి కొన్ని సైట్స్ ఉన్నపటికీ…పైన చెప్పుకున్నవి పాపులర్ సైట్స్.మరి వాటితో మీ ఆన్ లైన్ షాపింగ్ మనీ ఆదా చేసుకోండి.

ఈ ఆన్ లైన్ ఆదా గురుంచి మీ ఫ్రెండ్స్ తో కుడా షేర్  చేసుకోండి.

Comment using Facebook for quick reply

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here