మీరు చేసే కొన్ని ఉల్లంఘనలు మీ వెబ్ సైట్ ను Google లో పాతేస్తాయి

google guidelines in telugu

బిజినెస్ లకు వెబ్ సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది, Entreprenuerలు తమ బిజినెస్ ను ప్రజలలోకి తీసుకొని వెళ్ళటానికి వారి బిజినెస్ కు మార్కెటింగ్ చేసేందుకు సహాయపడుతుంది. అయితే ఒక వెబ్ సైట్ ను డిజైన్ చేసి నిర్వహించడం అంత సులభం ఏమి కాదు, అలా వెబ్ సైట్ లను రూపొందించి వాటిని maintain చేసే సమయంలో కొన్ని రూల్స్ కు లోబడి అనుసరించవలసి ఉంటుంది. అలా లేనిచో మీ వెబ్ సైట్ కు మీరే సమాధి చేసినంత పని అవుతుంది.
వెబ్ సైట్ మేనేజ్మెంట్ లో Google గైడ్ లైన్స్ లను ఏమాత్రం విస్మరించకూడదు.అలా సాధారణంగా జరిగే పొరపాట్లను మీరు చెయ్యకుండా జాగ్రత్త పడేందుకు ఈ క్రింది పేర్కొనడం జరిగింది.

Black hat SEO:

చాలా వెబ్ సైట్ లు Google నుంచి పెనాల్టీ శిక్షను ఎదుర్కోవడానికి గల కారణం Black hat SEO. అడ్డదారులను తొక్కడం ద్వారా, మోసపూరిత చర్యల ద్వారా, కీవర్డ్ లను కారుండి ఇరికించడం ద్వారా SEO లో మంచి ఫలితాలను పొందటానికి ప్రయత్నించే వెబ్ సైట్ లు Google కు అడ్డంగా పట్టుబడతాయి. SEO కంపెనీ లు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటాయి కనుక బిజినెస్ ownerలు తాము ఎంచుకొన్న SEO కంపెనీ ను గురించి కాస్త దృష్టి సారించవలసి ఉంటుంది.

Duplicate content:

డూప్లికేట్ కంటెంట్ లను కలిగి ఉండటం వలన కలిగే నష్టాలను చాలా వరకు వెబ్ సైట్ ఓనర్ లు గ్రహించరు. ప్రోడక్ట్ లిస్టింగ్స్ అనేకం కలిగి ఉండే ఈ-కామర్స్ వెబ్ సైట్ లు కొత్త మరియు అయిన ఒరిజినల్ కంటెంట్ సమకూర్చలేవు కనుక వారి విషయంలో ఇది చాలా వరకూ నిజం అవుతుంది. కాని Google అలా ఉన్నా douplicate కంటెంట్ అంతటిని users లకు ఎటువంటి ఉపయోగం లేని కంటెంట్ గానూ, పూర్ క్వాలిటీ కంటెంట్ గాను పరిగనిస్తుంది.

పెర్ఫార్మన్స్ బాగాలేని సైట్:

Google చాలా రెగ్యులర్ గా సైట్ ల functionality మరియు accessibility పరిశీలన చేస్తూ ఉంటుంది. పేజి లోడింగ్ కు ఎక్కువ సమయం పట్టినా లేదా పేజీలనునావిగేట్ చెయ్యటం కష్టతరంగా ఉన్నా Google మీ సైట్ ను యూసర్ లకు అనుకూలమైన సైట్ కాదని భావంచి సెర్చ్ result లలో మీ వెబ్ సైట్ ను చూపించదు.

Hack అయిన వెబ్ సైట్:

Google దృష్టిలో సెక్యూరిటీ కి పెద్ద భాగమే ఉంటుంది. యూసర్ సమాచారం చాలా సురక్షితంగా ఉండాలని google భావిస్తూ ఉంటుంది. Google లో తమ వెబ్ సైట్ విజయవంతంగా ఉండాలనుకునే వెబ్ సైట్ ownerలు అందరు తమ వెబ్ సైట్ ను సురక్షిత పరుచుకోవాలి. కాబట్టి వెబ్ సైట్ ను హకెర్స్ నుండి కాపాడుకుంటూ యూసర్ లకు సురక్షిత బ్రౌసింగ్ ను అందించినట్లైతే Google వేసే penality నుండి విముక్తి పొందవచ్చును.

మొబైల్ వెర్షన్ :

దీని వలన డైరెక్ట్ గా పెనాలిటీ పాడకపోయినా గాని , గూగుల్ నిబంధనల ప్రక్రారం ఇప్పుడు ప్రతి వెబ్ సైట్ కి కూడా మొబైల్ వెర్షన్ సైట్ ఉండటం అనివార్యం.

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here