మీ బిజినెస్ ఐడియాతో మీరు మల్లగుల్లాలు పడుతూ ఉండవచ్చు. మీరు చాల కాలంగా ఎంతగానో ఆలోచన చేస్తున్న విషయం అదే అయ్యి ఉండవచ్చును. మీరు దాదాపు మీ బిజినెస్ ఐడియాను నిజం చేసే దిశగా కదులుతూ ఉండవచ్చును.

మీ ప్లానింగ్ స్టేజిలో భాగంగా మీరు అనేక వ్యక్తులతో, మనుషులతో మాట్లాడటం ద్వారా మీకు కావలసిన సమాచారాన్ని సేకరించంచి, రీసెర్చ్ చెయ్యడం ద్వారా మీ బిజినెస్ ఐడియా ఆచరనీయమైనదా కాదా అనే విషయాన్నీ నిర్దారించుకోవడం జరుగుతుంది.
అలా మీ బిజినెస్ ఐడియాకు నిజ రూపం కలిగించే ముందు మీరు సంప్రదించవలసిన కొంతమంది వ్యక్తులను గురించి ఇప్పుడు చూద్దాం.

మీ జీవిత భాగస్వామి:

మీ కొత్త వెంచర్ ను గురించి మీరు మొట్ట మొదట ముఖ్యంగా సంప్రదించవలసిన వ్యక్తి మీ జీవిత భాగస్వామి. ఇది అర్ధవంతగా కనిపించక పోయినప్పటికీ ఇది ఎంతో ముఖ్యం. చాల మంది తమ బిజినెస్ ఐడియా తమ పర్సనల్ రిలేషన్ షిప్ ల పైన ఎటువంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని గ్రహించారు. తమ భాగస్వామి తో తమ సంబధం పైన అది ఏ విధమైన ప్రభావం చూపుతుందనే విషయాన్ని పట్టించుకోరు.
మీ బిజినెస్ ప్రారంభించే సమయంలో మీకు మీ ఫ్యామిలీ యొక్క సహకారం, మీ జీవితభాగస్వామి యొక్క సహకారం ఉండటం ఎంతో అవసరం. మీరు తీసుకున్న ఈ డెసిషన్ తో మీ కమిట్మెంట్ కు మీ ఫ్యామిలీ సహకారం అందిస్తుందో లేదో తెల్సుకోవడం ముఖ్యం.

లాయర్:

బిజినెస్ ప్రారంభించడంలో కొన్ని చట్టపరమైన చర్యలు కూడా ఇమిడి ఉంటాయి. కనుక మీరు లాయర్ ను కూడా సంప్రదించడం అవసరం. కాబట్టి, మీరు బిజినెస్ ను మొదలుపెట్టే ముందు లాయర్ ను సంప్రదించడం ద్వారా లాయర్ మీకు అవసరమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ ను, సలహాలను ఇచ్చి మీ బిజినెస్ ప్ర్రరంభించడం లో సహాయపడతారు.
అది మాత్రమే కాకుండా బిజినెస్ కు సంబందించిన ఇతర విషయాలలో కూడా లీగల్ అంశాలకు సంబంధించి సలహాలను, సూచలను అందించడానికి లాయర్ లు దోహదపడతారు.

అకౌంటెంట్:

మీరు అప్పుడప్పుడే బిజినెస్ ప్రాంభమిద్దామనే ఆలోచనలో గనక ఉన్నట్లైతే, తప్పనిసరిగా మీరు సంప్రదించవలసిన వ్యక్తి ఒక అకౌంటెంట్. అకౌంటింగ్ అడ్వైస్ లను పొందటం కోసం ఒక అకౌంటెంట్ ను సంప్రదించడం ముఖ్యం.అకౌంటెంట్ లను కేవలం tax ల గురించి మాత్రమే సంప్రదిస్తామనేది చాలా మంది లో ఉన్న అపోహ. మీ బిజినెస్ ప్లాన్ ను చూసి అది విజయవంతంగా అవుతుందా లేదా లాభాలను ఆర్జిస్తుందా లేదా అనే విషయాన్ని ఒక అనుభవజ్ఞులైన అకౌంటెంట్ తప్పక చెప్పగలరు. మీ బిజినెస్ కు సంబందించిన అనేక అంశాలలో అకౌంటెంట్ మీకు సహాయపడతారు, పే రోల్ ను రూపొందించేందుకు, మీ బిజినెస్ లో ఆర్ధిక లావదేవేలను తావేజు వేసేందుకు, అదే విధంగా మీ బిజినెస్ tax విషయంలోను సహాయం చేస్తారు.

విశ్వసనీయ సలహాదారు లేదా వ్యాపార కోచ్:

బిజినెస్ ప్రపంచంలోని ఎవరైనా ప్రముఖుల నుండి సలహాను తీసుకోవడం ఒక మంచి పని అనే చెప్పాలి. మీరు బిజినెస్ కు కొత్త అయిన పూర్వ అనుభవం ఉన్నా బిజినెస్ లో ఎప్పుడూ ఇతరుల నుండి అభిప్రాయాలను, సలహాలను తీసుకోవడం మంచి పరిణామం.
మిమ్మల్ని గురించి మీ బిజినెస్ ను గురించి అవగాహన ఉన్న ఏ బిజినెస్ యజమాని నుంచైనా సలహాలను తీసుకోవచ్చును. అటువంటి వ్యక్తులు మీ బిజినెస్ ప్రారంభం లోనే కాదు బిజినెస్ అభివృద్ధిలోనూ మీకు అవసరమైన సలహాలను అందిస్తారు.

బ్యాంకర్:

చాలా మంది entrepreneur లు తమ బిజినెస్ లో ఎంతో కొంత భాగాన్ని సాంప్రదాయ బ్యాంకు ల ద్వారా లోన్ ల రూపంలో సమకూరుస్తారు. మీ బిజినెస్ అడ్వైసర్ ను, లేదా ఇతర సహచరులను ఒక మంచి బ్యాంకర్ ను సజెస్ట్ చెయ్యమని అడగవచ్చు.
బిజినెస్ ప్రారంభించడానికి మీరు చాలా సమాచారాన్ని సేకరించవలసి ఉంటుంది, అలా ఈ వ్యక్తులు మీకు అవసరమైన సమాచారాన్ని పొందడానికి మీ బిజినెస్ ప్రారంభించడానికి సహాయపడతారు.

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

Read Online Business Updates, Startup news in your E-mail

You have Successfully Subscribed!