మీ బిజినెస్ ప్రత్యర్థులను ఎదురుకోనే ఎత్తుగడలు

0
Tactics to meet your business

ఇంటర్నెట్ ప్రపంచం చాలా పెద్దది. ఒకవేళ మీరు అక్కడికి ప్రవేశిస్తున్నట్లైతే గనుక మీరు అన్ని రకాలైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అక్కడ మీకు ప్రత్యర్దులు ఉంటారు, అలాగే మిమ్మల్ని ద్వేషిస్తూ మిమ్మల్ని పడేయటానికి ప్రయత్నించేవారు ఉంటారు. అయితే అలా ఆన్ లైన్ లో మీ ఉనికిని చాటుకొంటూనే మీ యొక్క కీర్తి ప్రతిష్టలకు ఎటువంటి భంగం కలుగకుండా ఉండేందుకు మిమ్మల్ని ద్వేషించేవారిని ఎదుర్కొనేందుకు మీరు అనుసరించవలసిన కొన్ని నియమాలను మరియు మీకు సహాయపడే కొన్ని మెళకువలను కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.

వారిని గురించి పెద్దగా ఆలోచించకండి:

డబ్బులు మరియు విజయం ఈ రెండు కూడా ఇతరుల దృష్టిని ఆకర్షిస్తాయి. అయితే ప్రత్యర్థుల దృష్టిని ఆకర్షించనిదే ఈ రెండిటిలో ఏ ఒక్కటి మీకు రాదు. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసిన కొన్ని విషయాలను గురించి ఇప్పుడు చూద్దాం.

  • మీరు ప్రతీ చిన్న విషయాన్నీ మనసుకు తీసుకోకూడదు. మీ ప్రత్యర్థులు మరియు క్రిటిక్ లు మిమ్మల్ని వేలు ఎత్తి చూపే ప్రతీసారి హేతుబద్ధంగా ఉండటానికి ప్రయత్నించండి, వారు చెప్పిన విషయాలను దృష్టిలోకి తీసుకుంటానని వారికి తెలియచెయ్యండి
  • ద్వేషించే వారిని చూసి భయపడకండి. మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని వెనక వెనకే ద్వేషిస్తూ తిట్టుకుంటూ ఉండే మీ ఆత్మీయులే ప్రత్యర్థుల కంటే మీకు ప్రమాదకరమైన వ్యక్తులు
  • మీరు ఏదైనా పనిని చెయ్యలేరు అని చెప్తున్న వారు ఇంతకు ముందే ఆ పనిని చేయడానికి ప్రయత్నించి విడిచివేసినవారే. అల ద్వేశాపూరిత మాటల ద్వారా చేష్టల ద్వార మిమ్మల్ని కూడా ఆ పనిని పూర్తి చేయ్యనివ్వకపోవడమే వారి ధ్యేయం. వారిని గెలవనివ్వకండి

ఎలా గెలవాలో వారికి చూపించండి:

మీరు మీ వ్యక్తిగత ఎదుగుదలకు మరియు మీ బిజినెస్ ను ముందుకు తీసుకువెళ్లేందుకు చేసే ప్రయత్నాలను చేస్తూ మీ ప్రత్యర్థులు మరియు మిమ్మల్ని ద్వేషించే వారు మీ మీద మీ వ్యక్తిత్వం మీద మానిసిక దాడులకు పాల్పడతారు. కాని అటువంటి విమర్శలను కేవలం మిమ్మల్ని అనిచివేయ్యడానికి చేసే ప్రయత్నాలను మీరు ఏమాత్రం పట్టించుకోకుండా పని పైన దృష్టిని పెట్టి మీ విజయ ధ్వని వారి విమర్శలకు సమధానం చెప్పేలా చెయ్యాలి. English లో ఒక సామెత ఉంది అదే Work hard in silence and let your success be your noise, అది ఇటువంటి పరిస్థితులలో ఉన్నవారికి సరిగ్గా సరిపోతుందనే చెప్పాలి.

వారిని ఇంధనంగా ఉపయోగించుకోండి:

ఏమి చెప్పకుండా ఉండిపోవటమే వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు సరైన ఉపాయం. అయితే వ్యతిరేకతను ఎవరు కోరుకోరు కాని ఇటువంటి బిజినెస్ లను నిర్వహించే స్థాయిలో ఉన్నపుడు వ్యతిరేకతను ఎదుర్కోకుండా ఉండాలని అనుకోవడానికి కుదరదు కనుక దానిని వేలినంత వరకు దగరకు తీసుకునేందుకు ప్రయత్నించాలి. ప్రతి వారికి వారి అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్చ ఉంటుంది అనే విషయాన్ని గ్రహించి మీ పనిని మీరు శ్రద్ధగా నిర్వహించడానికి ప్రయత్నించాలి. ఈ ఆలోచన విధానం కలిగి ఉంటే వారి నుంచి వచ్చే విమర్సలు మీకు ఇంధనంగా మారి మీ ఎదుగుదలకు ఉపయోగపడతాయి.

వేదింపులను పట్టించుకోకండి:

మిమ్మల్ని ద్వేషిస్తూ మీ పైన ప్రతీ విషయానికి ఆరోపణలను చేసే వారిని వీలైనంత వరకు పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. వారు చేసే పనులను ద్వేషపూరిత చర్యలను పెద్దగా పట్టించుకోకండి. మీకంటూ మిమ్మల్ని ఇష్టపడే వారు ఉంటారు వారికి తిరిగి ప్రేమను ఆప్యాయతను చూపించండి మీకు అవస్రమైనవాన్ని చెయ్యటానికి వారు సిద్ధంగా ఉంటారు.

Comment using Facebook for quick reply

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here