వెబ్ సైట్ కోసం తీసుకునే వెబ్ హోస్టింగ్ ఎప్పుడయినా మొదటి సంవత్సరము మాత్రమే తక్కువ ఉంటది. ఆ తరువాత Renewal (పునరుద్ధరణ)చేసుకోటానికి కాస్ట్ ఎక్కువ ఉంటది.ఇక ముఖ్యంగా బ్లాక్ ఫ్రైడే లాంటి ఆఫర్స్ అప్పుడు హోస్టింగ్ తీసుకునే ఆ తరువాత రెన్యువల్ చేసేటప్పుడు ఇంకా ధర ఎక్కువ ఉంటది . అందుకే నేను ఆఫర్ లో వెబ్ హోస్టింగ్ తీసుకునేటప్పుడు త్రీ ఇయర్స్ వరకు ఒకే సారి తీసుకోమని చెపుతాను.

మరి అలా తీసుకొని వారి పరిస్థితి? ఎక్కువ కాలం తీనుకున్నా గాని టైం అయిపోయాకా పరిస్థితి?హోస్టింగ్ కంపెనీ చూపించే ఎక్కువ ధరకే రెన్యువల్ చేసుకోవాలా?

అక్కర్లేదు … కొద్దిగా కష్టపడితే మన జేబుకి చిల్లు పడకుండా తప్పించుకోవచ్చు.నేను మొన్న అలానే కొంత మనీ ఆదా చేసాను. ఎలాగో చెపుతాను.. మీలో చాలా మందికి ఉపయోగపడవచ్చు

నేను 2014 లో Black Friday offer   3years web hosting  8500Rs పెట్టి తీసుకున్నాను. మొన్న Nov27th హోస్టింగ్ రెన్యూ చెయ్యటానికి 25000Rs ఛార్జ్ చూపించింది. అదే సర్వర్ కి ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోవటం వేస్ట్ అనిపించింది.

అంత బడ్జెట్ పెట్టి తీసుకోవటం ఇష్టం లేక  సంవత్సరము blackfriday ఆఫర్ రోజున Hostgatorలో ఇంకో కొత్త సర్వర్ తీసుకున్నాను.పాత Hostagator సర్వర్ లో వెబ్ సైట్ మొత్తం బ్యాక్ అప్ తీసి ఆ ఫైల్స్ ని కొత్త Hostagator సర్వర్ లో కి మార్చాను.
ఇక్కడ కొద్దిగా కష్టపడాల్సింది ఏంటి అంటే … ఈ సర్వర్ లో ఉన్న వెబ్ సైట్ కొత్త సర్వర్ లోకి మార్చటం. టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఎక్కువ కష్టపడకుండానే నేను వెబ్ సైట్ మార్చాను.మార్చిన తరువాత వచ్చే కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ కోసం ఒక రెండు గంటలు కష్టపడవలసి వచ్చింది.

కొత్త సర్వర్ 10000Rs తీసుకున్నాను ..రెన్యువల్ సర్వర్ 25000rs ఉంది. అలా ఒక 15000Rs మనీ save అయ్యింది.

మరి మాకు టెక్నికల్ లేకపోతే ఎలా?   టెక్నికల్ బాక్గ్రౌండ్ లేని వారికి మార్కెట్ లో చాలా ఫ్రీ వర్డ్ ప్రెస్ ప్లగిన్స్ దొరుకుతాయి,వాటిలో పాపులర్ ప్లగిన్ Duplicator Plugin . ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి క్లిక్ చేస్తే అదే మన వెబ్ సైట్ మొత్తన్ని బ్యాక్ అప్ తీసి ఒక ఫైల్ లో ఇస్తుంది. ఆ ఫైల్ ని కొత్త సర్వర్ లో కి అప్ లోడ్ చెయ్యాలి. ఎలా మార్చాలి అనే దాని మీద యూట్యూబ్ లో బోలెడు వీడియోలు ఉన్నాయి.

ఇలా కొద్దిగా కష్టపడితే సర్వర్ రెన్యూల్స్ అప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆ ఈ కష్టం అంతా ఎందుకులే అనుకుంటే ఎక్కువ కాస్ట్ కి Renewal  చేసుకోవటం మంచిది.

***************************************************************************************************************************

My “how to start a Blog Video Course”

బ్లాగింగ్ అనేది ఒకప్పుడు సరదా … ఇప్పుడు బతుకు తెరువు చూపించే ఒక డిజిటల్ మార్గం. మరి బ్లాగ్ స్టార్ట్ చెయ్యాలి అంటే ఎలా ?కోడింగ్ తో పని లేకుండా బ్లాగ్ ఎలా రూపొందించాలి ?బ్లాగ్ లో మనకి ఉపయోగపడే మంచి plugins ఏంటి ? ….

ఇలా బ్లాగ్ గురించి ప్రాక్టికల్ గా వివరిస్తూ నేను చెప్పిన వీడియో కోర్స్ ఆన్ లైన్ లో ఉంది . ఈ లింక్ లో క్లిక్ చేసి కోర్స్ లో చేరితే రిజిస్ట్రేషన్ వివరాలు మీ ఏ-మెయిల్ కి వస్తాయి. ఆ వివరాలతో వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి ఎప్పుడు కావలి అంటే అప్పుడు కోర్స్ చూసుకోవచ్చు. కోర్స్ కొన్న గంటలలోపు కోర్స్ రిజిస్ట్రేషన్ వివరాలు మీ ఏ-మెయిల్ కి వస్తాయి.

కోర్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

Read Online Business Updates, Startup news in your E-mail

You have Successfully Subscribed!