స్మార్ట్ తెలుగు నుండి గెస్ట్ రైటింగ్ కి తెర లేచింది. మాములుగా అయితే చాలా మంది బ్లాగర్ లు మొదట్లో గెస్ట్ ఆర్టికల్ ఇంకో పేరున్న బ్లాగర్ చేత మాత్రమే రాయిస్తారు. కానీ స్మార్ట్ తెలుగు నుండి నేను నా బ్లాగ్ చదివే రీడర్ కి  అ అవకాశం అందిస్తున్నాను.

అలానే ” స్మార్ట్ తెలుగు చదివి నేను ఈ రోజు ఆన్ లైన్ లో మనీ సంపాదిస్తున్నాను ” అని చెప్పిన కుమార్  కి థాంక్స్.

చాలా మంది రీడర్లు నా నుండి మంచి ఇన్ఫోర్మషన్ , FB లో చాటింగ్ చేస్తూ డౌట్స్ , పర్సనల్ గా కలిసి మంచి సలహాలు, సూచనలు పొందుతున్నారు గాని….కనీసం స్మార్ట్ తెలుగు ఆర్టికల్ ని వారి FB వాల్ పోస్ట్ లో షేర్ కూడా చేయట్లేదు. ఇలాంటి జనాభా మధ్యలో నా వలనే మనీ సంపాదిస్తున్నాను అని కుమార్ చెప్పిన  మాటలు  Boost లాంటి energy ఇచ్చింది.
” అన్నా , నీ బ్లాగ్ లో నేను ఒక ఆర్టికల్ రాయొచ్చా ” అంటూ ముందుకు వచ్చిన కుమార్ ని అభినందిస్తూ, విన్నూతమయిన కొన్ని పదాలతో తను రాసిన SEO Introduction in Telugu ఆర్టికల్ ఈ వారం మీ కోసం.

Introduction to SEO in Telugu

స్మార్ట్ తెలుగు రీడర్స్ కి నమస్కారం.

ఈరోజు స్మార్ట్ తెలుగు బ్లాగ్ లో మీకు search engine optimization గురించి పరిచయం చేస్తాను. ముందుగా నాకు ఈ బ్లాగ్ లో రాసే అవకాశం ఇచ్చిన రవి అన్నయ్యకు ధన్యవాదాలు. నా పేరు కుమార్ (పేరు పాతదే అయిన ఆలోచనలు కొత్తవి). నేను డిగ్రీ ఫెయిల్ . అవును!, ఇంటర్ వరకు బాగా చదివిన నేను డిగ్రీ కి వచ్చాక చదువు మీద ఆసక్తి పోయింది . డిగ్రీ మొదటి సంవత్సరం లో ఒక సబ్జెక్టు పోయింది . డిగ్రీ రెండవ సంవత్సరం లో రెండు సబ్జెక్టు లు దొబ్బినాయి. చివరి సంవత్సరంలో అసలు ఎగ్జామ్స్ రాయలేదు.

నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ ఇలా అంటాడు “ ఈ నేచర్ లో ఎక్కడో జరిగే మూమెంట్ ఇంకెక్కడో జరిగే మూమెంట్ ను డిసైడ్ చేస్తుంది”. ఈ డైలాగును Butterfly effect అనే సిద్ధాంతం ఆధారంగా “నాన్నకు ప్రేమతో “ సినిమా దర్శకుడు సుకుమార్ రాశాడు. ఇది 100% ఖచ్చితమైన సిద్ధాంతం. ఎందుకంటే సరిగ్గా ఎనిమిది నెలల క్రితం “ఎక్కడో హైదరాబాదు నుండి స్మార్ట్ తెలుగు బ్లాగ్ లో రవి అన్నయ్య రాసిన ఆర్టికల్ భద్రాచలం లో ఉన్న నన్ను మరియు నా భవిష్యత్ మూమెంట్ ని డిసైడ్ చేసింది”. ఆరోజు స్మార్ట్ తెలుగు బ్లాగ్ లో ఆర్టికల్స్ మొత్తం చదివేసాను. ఆన్ లైన్ లో  ఎలాగైనా సంపాదించాలి అని లక్ష్యం పెట్టుకున్న .

అప్పటి నుండి సరిగ్గా ఆరు నెలల తరువాత జూన్ నెల నుండి   ఆన్ లైన్ లో మంచి అమౌంట్ సంపాదిస్తున్నాను. రవి అన్నయ్య స్మార్ట్ తెలుగు బ్లాగ్ స్టార్ట్ చెయ్యకపోతే ఇప్పుడు నేను ఇలా సంపాదించే వాన్ని కాదు. నేను ఒక్కడినే కాదు, చాలా మంది తెలుగు వాళ్ళు స్మార్ట్ తెలుగు బ్లాగ్ వల్ల చాలా ఉపయోగం పొందుతున్నారు.

ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్దాం.

What is search engine optimization (SEO) (In Telugu)?

సింపుల్ గా చెప్పాలంటే “మనం మన వెబ్ సైట్ లో రాసే ఆర్టికల్స్ ను search engines ( Google,Yahoo,bing….etc) కు అనుకూలంగా మార్చే ప్రక్రియను search engine optimization అని అంటారు”.

సేర్చ్ ఇంజన్ కు మన ఆర్టికల్ ను అనుకూలంగా మార్చడం వల్ల మన వెబ్ సైట్ సెర్చ్ రిజల్ట్స్ లో మొదటి పేజి లో వస్తుంది. మొదటి పేజి లో మన వెబ్ సైట్ ఉంటేనే ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది.

ఉదాహరణకు “ ఒక అమ్మాయి  అందంగా వుందని నువ్వు లవ్ ప్రపోస్ చేస్తే తను ఒప్పుకోదు , తను ఒప్పుకోవాలంటే నీకంటూ ఒక స్టేటస్ ఉండాలి & ముఖ్యంగా నీ స్వబావమూ తనకి నచ్చె విధంగా మార్చుకోవాలి” .

సెర్చ్ ఇంజిన్ కూడా అంతే , సెర్చ్ ఇంజిన్ అల్గోరిథం(SEO Algorithm) కు  నీ బ్లాగ్ స్వభావం నచ్చే విధంగా మారిస్తే , నీ బ్లాగ్ మొదటి ర్యాంక్ లో వుంటది.

Types of SEO:

SEO రెండు రకాలు . 1)On page SEO 2)Off page SEO.వీటి గురించి ఈ ఆర్టికల్ లో లోతుగా చెప్పను. కాని వీటిని పరిచయం చేస్తా.

వీటి గురించి ఈ ఆర్టికల్ లో లోతుగా చెప్పను. కాని వీటిని పరిచయం చేస్తా.

On page SEO:

On page SEO మొత్తం వెబ్ సైట్ నిర్మాణం పై ఆధారపడి వుంటుంది. ఇందులో ముఖ్యమైన విషయాలు.

  •  వెబ్ సైట్ URL ను చిన్నగా మరియు మీరు మొదలు పెట్టబోయే టాపిక్ కు సంబంధించినదిగా వుండాలి.
  •  మీరు రాసే ఆర్టికల్ ను మీరు target చేసిన keyword తో మొదలు పెట్టాలి
  • WordPress software లో ఉండే H1, H2, H3 ట్యాగ్ లను ఉపయోగించడం .
  • మీరు రాస్తున్న ఆర్టికల్ కి సంబంధించిన మీ బ్లాగ్ లో వుండే ఇంకొక ఆర్టికల్ కి లింక్ ఇవ్వాలి.
  • ముఖ్యంగా మీరు రాస్తున్న ఆర్టికల్ క్వాలిటీ గా వుండాలి

Off page SEO:

Off page SEO మొత్తం లింక్ బిల్డింగ్ (Link building ) మీద ఆధారపడి వుంటుంది . పది సంవత్సరాల క్రితం మన గూగులమ్మ(Google) , Only “keywords” ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చేది. మార్పు అనేది చాలా సాధారణ విషయము, ఇప్పుడు గూగుల్ వాళ్ళు “ లింక్స్” ద్వారా ర్యాంకింగ్స్ ఇస్తున్నారు. మన వెబ్ సైట్ కు ఎన్ని లింక్స్ వేరే వెబ్ సైట్ నుండి వున్నాయి? మనం రాసిన ఆర్టికల్ కు ఎన్ని లింక్స్ వేరే వెబ్ సైట్ నుండి వున్నాయి ? అనే విషయాలు గూగుల్ సాఫ్ట్వేర్ అంచనా వేసి మన వెబ్ సైట్ కి ర్యాంక్ ఇస్తుంది.

ఇప్పుడు నేను చెప్పిన On & Off page SEO గురించి ముందే తెలిసిన వారు  ఉంటారు, మరియు తెలియని వాళ్ళు ఉంటారు. తెలియని వాళ్ళకి ఇది  అయోమయంగా అనిపిస్తుంది.ఈ సందర్బంగా మనం వేమన గారు రచించిన ఒక పద్యాన్ని గుర్తు చేసుకోవాలి “అనగననగ రాగ మతిశ…….”, గుర్తోచింది కదా? ఈరోజు మీకు నేను చెప్పిన SEO విషయాలు చాలా  తక్కువ. నేర్చుకోవలసింది చాలా  వుంది.

SEO మీకు అర్ధమవ్వాలని రవి అన్నయ్య SEO మీద వీడియోస్ చెయ్యబోతున్నారు. అప్పుడు ఇంకా క్లారిటీ ఉంటది. నాకు ఈ బ్లాగ్ లో రాసే అవకాశం ఇచ్చిన రవి అన్నయ్య కు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీస్కుంటున్నాను .

———————————-Article By Kumar.

ఇలా స్మార్ట్ తెలుగు లో మీరు కూడా గెస్ట్ పోస్ట్ లు రాయాలి అనుకుంటే…[email protected] కి ఈ మెయిల్ చెయ్యండి.మీ పేరు తో ఆర్టికల్ పబ్లిష్ చేస్తాను.

 

Comment using Facebook for quick reply

error: Content is protected !!
వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

వెబ్ సైట్ ఆర్టికల్స్ మీ Email కి పొందండి.

Read Online Business Updates, Startup news in your E-mail

You have Successfully Subscribed!