నా  గురుంచి కొద్దిగా ?

పేరు – రవికిరణ్ కోగంటి.
Profession – Blogger & Digital Marketing Analyst.
అంతకు ముందు – రాజి పడలేని మాజీ సాఫ్ట్ వెర్
Education :మార్కుల కోసం  బట్టి పట్టిన చదువు M.C.A

Professional Career & Experience:

  • 7+ Years Total Experience in I.T.
  • Worked for TCS, HCL Technologies,Prius Infotech
  • Certified Digital Marketing Specialist from Digital Marketer Organization,USA.
  • Google Certified Ad words Professional.
  • Trainer – SEO,Digital Marketing, Blogging ట్రైన్ చేస్తాను.

Company Website www.smartlyweb.com

Smarttelugu Idea:

 సాఫ్ట్ వేర్  జాబు మానేసి   startup మొదలుపెట్టి ఫెయిల్ అయ్యాను. FAILURE అనేది  First Attempt In Learning. ఆ టైం లోనే  ఎక్స్పీరియన్స్, అవగాహన  లేకుండా స్టార్ట్ అప్ లు మొదలుపెట్టి టార్గెట్ మిస్ అవుతున్న వారిని గైడ్ చెయ్యాలి అనే ఐడియా వచ్చింది.ఆ ఐడియా రూపమే ఈ స్మార్ట్ తెలుగు వెబ్ సైట్.

Smarttelugu స్థాపించి ఆన్ లైన్ బిజినెస్ , entrepreneurship , ఆన్ లైన్ మార్కెటింగ్  టాపిక్స్ మీద రాయటం మొదలు పెట్టా…Smarttelugu ద్వారా తెలుగు వారిలో entrepreneurship ఆలోచనలు పెంచాలనేది నా గోల్ . మంచి స్టార్ట్ అప్ ఆలోచన ,టాలెంట్ ఉండి కుడా భుజం తట్టే వారు లేక ఆగిపోతున్న కొంత మంది ఔత్యాహికులకయినా   నా ఆర్టికల్స్ ద్వారా ఉపయోగపడాలనేది  టార్గెట్.

నా బ్లాగ్ రెగ్యులర్ గా చదువుతున్న  రీడర్స్ కోరిక మేరకు ఆన్ లైన్ బిజినెస్ , ఆన్ లైన్ మార్కెటింగ్ ఆర్టికల్స్ తో పాటు ఆన్ లైన్ మనీ, బ్లాగింగ్ టాపిక్స్ మీద కుడా ఆర్టికల్స్ రాస్తున్నాను.

ప్రొఫెషనల్ గా మీట్ అవ్వాలి అంటే …నా Linkedin ప్రొఫైల్ ఫాలో అవ్వండి.

Personal Life:

హాబీలు : ఒకటి – తెలుగు పిల్లల కథల పుస్తకాలు చదవటం. చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి,చిన్నారి లోకం, బుజ్జాయి,బాల భారతి,  బాల ప్రపంచం…ఇంకా ఉన్నాయి.
రొండు – T.V లో కత్తి కాంతారావు గారి సినిమాల దగ్గర నుండి చూడటం మొదలుపెట్టి ప్రతి తెలుగు సినిమా చూసేస్తా. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకొని ఇతర బాషలు కుడా కవర్ చేస్తా అనుకోండి.

Age : బాలల  పుస్తకాలు చదువుతా అంటే పిల్లోడు అనుకోకండి….కాంతారావుగారి సినిమా అంటే ఆయనంత ఏజ్ అనుకోకండి.  30 + లో ఉన్నా…

Status :  30 లోకి ఎంటర్ అయినా ..Unmarried

ఒక రోజు దేవడు కలలో కనిపించి… నీకు జీవితంలో రొండు options ఇస్తున్నాను.
తెలివయిన వాడిగా ఉంటావా ? లేక పెళ్లి చేసుకుంటావా ? అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ ఎంచుకున్నా….

బాగా నచ్చిన పని – పుస్తకాలు చదవడం , రాయటం, ఇంటర్నెట్ ని జల్లెడ పట్టడం. స్టార్ట్ అప్ లు  గురుంచి తెలుసుకోవటం.

ఖాళి సమయాల్లో : కథలు రాసుకోవడం, పుస్తకాలు,సినిమాలు, ముంతమసాల బండి దగ్గర  ఫ్రెండ్స్ తో మీటింగ్ .

ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఫేస్బుక్ ప్రొఫైల్ ని ఫాలో అవ్వండి.

error: Content is protected !!