ఛీ పోండి ! మా గురించి మేమె చెప్పుకోవటమే అంటే కొద్దిగా సిగ్గు బాబు.
ఒరేయ్, మన గురించి మనం కాకపోతే దేశ ప్రధానో, రాష్ట్ర ముఖ్యమంత్రో చెపుతాడా ? ఛాన్స్ దొరికింది,కూత పెట్టండి !

ravikiran-koganti

రవి కిరణ్

స్మార్ట్ తెలుగుకి ఊపిరి పోసాడు.ఆకట్టుకునే కథ,కధనాలతో ఆర్టికల్ రాసి చదివే రీడర్ చేత అద్భుతహా : అనిపించటం, విన్నూతమయిన డిజిటల్ మార్కెటింగ్  టెక్నిక్స్ ఉపయోగించడం, కొత్త ఆలోచనలతో స్మార్ట్ తెలుగుని ముందుకు నడిపించటం … మొత్తానికి కర్త,క్రియ,కర్మ అంతా మనోడే.

చిన్నపుడు చదివిన బోలెడు జానపదకథల ప్రభావమేమోగాని కొత్తగానూ,వింతగానూ ఆలోచిస్తాడు.మీరు చూస్తున్న ఈ వెబ్ సైట్ కి మాటలు, స్టొరీ, దర్శకత్వం అంతా మనోడే.

Master of Computer Allications చేసాడు.ఐ.టిలో సాఫ్ట్ వెర్ డెవలపర్ గా 7ఏళ్ళు పని చేసాడు.Digital Marketingలోని ప్రముఖ సంస్థల నుండి మార్కెటింగ్ నిపుణుడిగా పట్టాలు పొందాడు.S.E.O మీద ట్రైనింగ్ ఇస్తాడు.

బాధ,సంతోషం,చిరాకు – ఇలా దేనికయినా మనోడికి మందు “సినిమా” లేదంటే “కధల పుస్తకాలు”. మనోడు ఏ బుక్ ఫెయిర్ లోనో తీరుగుతుంటాడు, కలవాలి అంటే ఏ రెస్టౌరెంట్లోనో మంచి ఫుడ్ ఉందని పిలవండి,క్షణంలో ముందుంటాడు.

SATYA

సత్య

స్మార్ట్ తెలుగుకి సూచనలు, నలుగురితో  మాట మంతి నిర్వహించేది సత్య .ఏదయినా కొత్త స్టార్ట్ ఐడియాకి చొక్కా పాంటు వేస్తే అది సత్యానే.సత్యాకి వచ్చే స్టార్ట్ అప్ ఐడియాలతోనే ఒక “ఐడియా  స్టార్ట్ అప్ ” మొదలుపెట్టొచ్చు.

భవిష్యత్తులో చాలా క్రేజీ ఐడియాలను స్టార్ట్ అప్ రూపంలో తీసుకురావటానికి కాళ్లకు చక్రాలు కట్టుకొని తీరుగుతున్నాడు.

ఆస్ట్రేలియాలో Master Degree on E-commerce చేసాడు.

బాధ,సంతోషం,చిరాకు – ఇలా దేనికయినా మనోడికి మందు “మంచి ఫుడ్ ..ఒక గ్లాస్ బీర్ “. బజ్జి బండి దగ్గరనుండి బావార్చి బిర్యానీ వరకు ఎక్కడ మంచి ఫుడ్ దొరికినా మనోడితో మీటింగ్ పెట్టుకోవచ్చు.

JAGADISH

జగదీశ్

అమెరికాలో  స్మార్ట్ తెలుగు మీటింగ్లు, NRIలకు  స్మార్ట్ తెలుగు గురించి మాట మంతి చెప్పేది మనోడే. యువతకి వినోదంతో కూడిన విజ్ఞానం ఎలా అందజేయగలమా అని శోదీస్తాడు.

నొప్పించకుండా ఒప్పించి నలుగిరితో పని చేయించే స్కిల్ మనవాడి సొంతం.

అమెరికాలో మాస్టర్స్ చేసి సాఫ్ట్ వెర్ ఉద్యోగం చేస్తున్నాడు.

బాధ,సంతోషం,చిరాకు – ఇలా దేనికయినా మనోడికి మందు “సినిమా “. అట్టర్ ప్లాప్ సినిమాలకి కూడా రెగ్యులర్ గా వెళ్లే ఆడియెన్సు లో మనోడు ముందుంటాడు. మనోడిని కలవాలి అంటే కొత్తగా వచ్చిన ఏదయినా సినిమా టికెట్ బుక్ చేసి పిలవండి

KAMESH

కామేష్

స్మార్ట్ తెలుగులో  దృశ్యాలు చిత్రించేది,కత్తిరించేది మనోడే. దృశ్యాలతో పాటు సాఫ్ట్ వెర్ కోడింగ్ కూడా చేస్తాడు.

ఐస్ మీద కూర్చున్నట్టు ఎప్పుడు కూల్ గా ఉంటాడు. విజ్ఞానాన్ని సరళంగా  దృశ్యరూపంలో అందజేయాలి అనేది మనవాడి తపన.

6 ఏళ్ళ నుండి UI  డెవలపర్ గా పని చేస్తున్నాడు.

బాధ,సంతోషం,చిరాకు – ఇలా దేనికయినా మనోడికి మందు ” camera “. పెళ్లి అయినా గాని ఎప్పుడు తన వైఫ్ తో కనిపించలేదుగాని , రోజు కెమెరాతో కనిపిస్తాడు. మనోడిని కలవాలి అంటే ఏదయినా ఈవెంట్ కి పిలవండి …కెమెరాతో క్లిక్ మనిపించటానికి  వచ్చేస్తాడు.

KARUN

కరుణ్

స్మార్ట్ తెలుగు బ్రాండింగ్ కోసం రంగులు గీసేది, బొమ్మలు గీసేది మనోడే.

ప్రపంచంతో నాకు పని లేదు అనుకుంటూ మెదడులోకి వచ్చిన ఆలోచనలకు డిజిటల్ కుంచెలతో రూపం ఇవ్వటం మనోడి ప్రత్యేకత.

ఫోటోషాప్ , illustrator డిజైనర్ గా 5 ఏళ్ళ నుండి వివిధ కార్పొరేట్ కంపెనీలకు పని చేసాడు.

బాధ,సంతోషం,చిరాకు – ఇలా దేనికయినా మనోడికి మందు “ఇంటర్నెట్ “. మనోడిని కలవాలి అంటే కష్టం , ఎప్పుడో కానీ బయట ప్రపంచానితో  హాయ్ అనడు.

ప్రియ

వందల మంది Male డైరెక్టర్స్ మధ్యలో ఒక్కరో ఇద్దరో Female డాక్టర్స్ ఉన్నటు ..టెక్నాలజీ టీంలో కూడా ఇలాంటి యువతులు ఉంటారు. స్మార్ట్ తెలుగులో  టెక్నాలజీ , స్టార్ట్ అప్ ఆర్టికల్స్ రాస్తూ యువతికి మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది.

M.COM, PDCA కంప్లీట్ చేసిన తిను2 ఇయర్స్ నుండి కంటెంట్ రైటింగ్ ఫీల్డ్ లో వర్క్ చేస్తుంది.స్త్రీ వాదాన్ని ప్రపంచానికి గట్టిగా వినిపించాలి అనే సంకల్పనతో ఉంది.

బాధ, సంతోషం, చీరాకు — ఇలా దేనికయినా తినకి మందు ఫుడ్ మరియు ట్రావెల్. ఆహ అనిపంచే వంటకాలు , ఔరా అనిపించే ప్రదేశాలు చూడటం అలవాటు.

error: Content is protected !!