Software Job మానేసి Telugu Blog ఎందుకు స్టార్ట్ చేసాను?

9
WHY I STARTED AS TELUGU BLOGGER

సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి తెలుగు బ్లాగ్ ఏంటి రా… వీడికి పిచ్చి, వెర్రి, తిక్క అన్ని ఒకేసారి పట్టాయి అని నా ఫ్రెండ్స్ లో చాలా మంది అభిప్రాయం.

అసలు బ్లాగ్ అంటేనే మనలో చాలా మందికి తెలియదు.ఇక బ్లాగ్ మీద సంపాదించవచ్చు అంటే “Jungle Book”  సినిమాలో బలూని(ఎలుగుబంటి ) చూసినట్టు కామెడీగా చూస్తున్నారు.

అందులో తెలుగు బ్లాగ్ అంటే ఇంకా చిన్న చూపు. తెలుగు అంటేనే ఏదో లోకల్, చీప్ అనే భావన చాలా మందిలో కనపడుతుంది. తెలుగు తెలిసిన ఇద్దరు కాఫీ షాప్ లో కూర్చుని ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్న రోజులు ఇవి.

మరి ఈ లాంటి పరిస్థితిలో నేను సాఫ్ట్ వేర్ కెరీర్ వదిలేసి బ్లాగ్ ని కెరీర్ గా ఎందుకు ఎంచుకున్నాను అనేది చాలా మంది ప్రశ్న.అందులోనూ తెలుగు బ్లాగ్ ఎందుకు అని ? బ్లాగింగ్ భవిష్యత్తు ఏంటి ?

ఈ లాంటి  ప్రశ్నలకు  సమాధానలు మీ కోసం ఈ ఆర్టికల్ .

ముఖ్యగమనిక :

ఈ ఏప్రిల్ 15 నుండి బ్లాగ్ ని  ఫుల్ టైం వర్క్  గా తీసుకుంటున్నాను. అంటే ఎక్కువ సమయం దీని కోసమే కేటాయిస్తాను.

ఈ నూతన సంవత్సరం జనవరి నుండి స్మార్ట్ తెలుగు లో చేద్దాము అనుకుంటున్న కొన్ని పనులు చేయలేకపోయాను.కాని తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి దాని కోసం పని చేయటం ప్రారంభించాను.అందుకే లాస్ట్ వీక్ ఆర్టికల్స్ పబ్లిష్ చేయలేదు.

ఇక పై స్మార్ట్ తెలుగు బ్లాగ్ పోస్టింగ్స్ ఎలా ఉంటుందో చుడండి.రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.

  • ఇక పై వారానికి నాలుగు రోజులు (గురు,శుక్ర,శని,ఆది వారాలు) ఆర్టికల్స్.
  • బుధవారం వీడియో ఉంటుంది.
  • మార్నింగ్ 10.30 A.M కి పబ్లిష్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాను.
  • ఎప్పుడయినా ఆర్టికల్ పబ్లిష్ చేయలేని పక్షంలో బ్లాగ్ లో లేదా ఫేస్ బుక్ పేజి లో మెసేజ్ పెడతాను.
  • Weekday లో ప్రతి రోజు ఫేస్ బుక్ లో సాయంత్రం 7.30 నుండి 9.30PM లోపు స్టార్ట్ అప్ లేదా బిజినెస్ మీద పోస్ట్ ఉంటుంది.

బతకటానికి సాఫ్ట్ వేర్ జాబ్ ఎందుకు మానేసా ?

బతకటానికి జాబ్ చేస్తాము కాని, బతకటానికి జాబ్ మానెయ్యటం ఎంటిరా “వర్మా ” అని తలబాదుకోకండి.
రొటీన్ లైఫ్, ఏదో మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్, ఎందుకు పని చేస్తున్నామో తెలియని అయోమయం.

ఇలానే కొన్ని రోజులు ఉంటె శంకర్ సినిమాలో “రోబో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా” మనమే సరిపోతాం అని అర్ధం అయ్యింది. ఎందుకంటే, యాంత్రిక జీవితంలో పడిపోయి ఇప్పటికే ఒక చిన్న పాటి రోబోగా మారాను.

అందుకే నిజంగా బతకటానికి జాబు మానేసా.

జాబ్ మానేసి ఇంట్లో కూర్చుంటావా ?

ఇది నేను TCS కంపెనీలో Resign చేసినప్పుడు HR నన్ను వెటకారంగా అడిగిన తిక్క ప్రశ్న.
అవును ఇంట్లోనే కూర్చున్నాను….కాని ఇంట్లో కూర్చొనే సంపాదించాను.అది కుడా సాఫ్ట్ వేర్ జాబ్ శాలరీకి దీటుగా.

బయట ప్రపంచం పరిగెడుతుంది.జాబ్ లేకపోతే వణికిపోయే రోజులు ఎప్పుడో పొయ్యాయి.మనమే మన కోసం పని సృష్టించుకునే రోజులు వచ్చాయి.

లాప్ టాప్, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండి, ఏదయినా మంచి స్కిల్ బుర్రలో ఉంటె…డబ్బులు జేబులోకి వచ్చిపడుతున్నాయి.

బ్లాగ్ ని కెరీర్ గా ఎందుకు ఎంచుకున్నాను?

నేను బ్లాగ్ మొదలుపెట్టినప్పుడు దీని మీద మనీ సంపాదించాలి లేదంటే కెరీర్ గా మార్చుకోవాలి అనే ఐడియా లేదు.
నా ఆలోచనలు, స్టొరీ రాసే పిచ్చ ఉన్న నాలో ఒకడిని బయటకు తీసుకువద్దాము అనే తపన, నేను చేసిన కొన్ని బిజినెస్ తప్పులు ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనే ఐడియా మాత్రమే ఉన్నాయి.

అప్పటికే బ్లాగ్ ద్వారా సంపాదించవచ్చు అని తెలుసు కాని…ఎలానో తెలిసేది కాదు.కాని ఇష్టంతో బ్లాగ్ రాసుకుంటూ పోతే ఆ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది అని తరువాతే తెలిసింది.బ్లాగ్ మీద బతకచ్చు అనే నమ్మకం కుదిరింది.

బ్లాగ్గింగ్ అనేది ఒక “మంచి వ్యసనంగా” మారింది. పుస్తకం చదవటంతో పాటు బ్లాగ్ రాయటం అనే ఇంకో మంచి  వ్యసనం నా జీవితంలో చేరింది.అన్నిటికి మించి నేను చేసే పనిలో నాకు ఆనందం దొరికింది.అందుకే బ్లాగింగ్ ని కెరీర్ గా ఎంచుకున్నాను.

బ్లాగింగ్ కి భవిష్యత్తు ఉందా ?

పుష్కలంగా ఉంది.

ఈ రోజు ప్రతి కంపెనీ, ప్రతి బిజినెస్ కి వెబ్ సైట్ కావాలి. అయితే వెబ్ సైట్ ఉంటె అమ్మటం జరగదు. మనం కస్టమర్ ముందుకు వెళ్ళాలి. వాడికి ఏది అవసరమో గుర్తుంచి దాని గురించి వివరించాలి.
అలా వివరిస్తే, ఆ  కస్టమర్ ఎదురు వచ్చి మన సర్వీస్,వస్తువు తీసుకుంటాడు. ఇదంతా జరగాలి అంటే ఉండాల్సిన ప్రధమ ఆయుధం “Blogging”.

దీనిని ఇప్పుడు కంపెనీలు ,ఈ-కామర్స్ బిజినెస్లు, వెబ్ సైట్లు, స్టార్ట్ అప్ లు , ఆన్ లైన్ బిజినెస్లు గుర్తించాయి.అందుకే Blogging కి డిమాండ్ పెరిగింది.

బ్లాగ్ నిర్వహించేవారికి, బ్లాగ్ రాసే వారికి, కంటెంట్ రైటర్ లకి, SEO లాంటి టెక్నికల్ వర్క్ వచ్చిన వారికి  మంచి గీరాకి  ఏర్పడింది.

మరి తెలుగు బ్లాగ్ ఎందుకు ?

మొదట కారణం తెలుగుంటే ఇష్టం.
అలా అని ఇంగ్లీష్ పదాలు వాడను ,ఇంగ్లీష్ మాట్లాడను అని చెప్పను.
ఇంగ్లీష్ అనేది అవసరం. తెలుగు అనేది ఆత్మ. ఆత్మని ప్రేమిస్తాను. అవసరాన్ని వాడుకుంటాను.

తెలుగు బ్లాగ్ అంటే చిన్న చూపు చూసే రోజులు పోయేకాలం దగ్గరలోనే ఉంది. ఎందుకంటే భవిష్యత్తు ఇంటర్నెట్ మార్కెట్ అంతా Local Languageల మీద ఆధారపడుతుంది.
ఇండియాలో ని విభిన్న బాషలలో కంటెంట్ అవసరం ఏర్పడబోతుంది.లోకల్ లాంగ్వేజ్ స్టార్ట్ అప్ కంపెనీలు కుడా ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్నాయి.

మరి 10 ఇయర్స్ తరువాత  మార్కెట్  ఎలా ఉంటుందో ఈ రోజు ఊహించి అడుగు వేసినప్పుడే విభిన్నంగా ఉండగలము.

నన్ను నాకు కొత్తగా పరిచయం చేసింది?

అసలు నా మీద నాకే నమ్మకం లేని మనిషిని. ఆత్మ విశ్వాసం అంటే మనకి అర్ధం కాని పదం అని…కొంతమందికి మాత్రమే ఉంటుంది అనుకునే వాడిని.

కాని బ్లాగ్ మొదలుపెట్టిన తరువాత నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. ప్రతివాడిలో ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది.కాని రొటీన్ లైఫ్ లో  పడి దానిని వదిలేస్తున్నాము.ఆర్ట్ తో పాటు కష్టపడేతత్వం, ఓపిక ఉండాలి అనేది అర్ధం అయ్యింది.

నచ్చిన పనిలో ఉండే ఆనందం వేరు.కవులు, రచయితలు, సినిమావారు, క్రీడాకారులు ఎందుకు తమకు నచ్చిన పని కోసం అన్ని పాట్లు పడతారో అర్ధం అయ్యింది. ఆ కిక్కే వేరప్ప.

జీవితంలో మొదటి జీతం అందుకున్న క్షణం అంతగా గుర్తులేదు గాని ……”మొదటిసారి ఎక్కడ నుండో వచ్చి నన్ను కలిసిన రీడర్, నా బ్లాగ్ లో మనీ వచ్చిన రోజు, నేను ఇన్స్పిరేషన్ అన్న మొదటి వ్యక్తి ” ఇలాంటి మాత్రం నాకు బాగా గుర్తున్నాయి.

నాలో ఆత్మ విశ్వాసం నింపిన బ్లాగింగ్ “నన్ను నాకు కొత్తగా పరిచయం చేసింది”.

మరి సంపాదన?

అన్ని సరే నప్పా…మనిషి మనసులో ఉన్న కళ కంటే, జేబులో ఉండే డబ్బుకు విలువిచ్చే ఈ రోజుల్లో మరి దాని సంగతి ఏంటి అని అడుగుతారా?

పర్లేదు..బ్లాగ్గింగ్ మీద సంపాదిస్తున్నాను. నా సాఫ్ట్ వేర్ జాబు కంటే బానే సంపాదిస్తున్నాను.ఒక్కపుడు జీతం అందుకున్న నేను ఇప్పుడు ఇంకో నలుగురికి జీతం ఇస్తున్నాను.

మరి ఎవరయినా బ్లాగ్ మీద బతకవచ్చా?

చదివిన ప్రతి వాడికి ఉద్యోగం రాదూ. సినిమాలో ట్రై చేసే ప్రతి వాడికి పాత్ర దొరకదు. బిజినెస్ చేసే ప్రతి వాడు లాభం పొందలేడు.అలానే బ్లాగింగ్ కుడా అంతే… కష్టం,ఓపిక ,నైపుణ్యం ఉండాలి.

రాసే విషయంలో స్పష్టత….చదివే రీడర్ కి కనెక్ట్ అయ్యే విధంగా రాయగలగాలి. బ్లాగ్ చదివే రీడర్ కి నీ ఆర్టికల్ లేదా సర్వీస్ ద్వారా ఉపయోగం కలగాలి.
అలా ఉంటె Food, Fashion, Technology,Mobiles,I.T, Reviews,Finance లాంటి విషయాల పైన బ్లాగ్ రాస్తూ సంపాదించవచ్చు.

చివరగా ఒక మాట. అవును నేను బ్లాగర్ ని …తెలుగు బ్లాగర్ ని.
నేను బతుకుతున్నాను…నచ్చిన పని చేస్తూ నిజంగానే “బతుకుతున్నాను”.

బ్లాగింగ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే మీరు ఈ లింక్ లో ఉన్న స్మార్ట్ తెలుగు ఫేస్ బుక్ పేజి ని Like చెయ్యండి.

https://www.facebook.com/smartteluguofficial/

అలానే ఇదివరకు మీ మెయిల్ ఐ డి ఈ వెబ్ సైట్ లో ఇవ్వక పోతే కింద ఇచ్చిన బాక్స్ లో మీ పేరు ఈ-మెయిల్ వివరాలు ఇచ్చి రిజిస్టర్ అవ్వండి. 

[wp-subscribe]

Comment using Facebook for quick reply

9 COMMENTS

  1. Hi sir article bagane undhi….but telugulo blogs rasevallaki Google Adsense approval ivvadhanta kadha….asalu bloglo thelugulo rasthe edho code languageslo vasthundhi..vitiki solutions enti

  2. రవికుమార్ గారు మీ బ్లాగు చాలా ఉపయోగం గా ఉంది. నాకు బ్లాగు తాయారు చెయ్యాలని బాగా కోరిక నాకు ఫాబ్రిక్ ప్రింటింగ్ తెలుసు దాని మీద చేస్తే ఎలా ఉంతుంది ప్లీజ్ సలహా ఇవ్వరు.

  3. రవికిరణ్ గారు నమస్కారములు…….! మీరు తెలుగు లో బ్లాగ్ లు రాస్తున్నారు కదా ..గూగుల్అద్సేన్సే కు అప్లై అవ్వదు కదా..మరి మీకు ఇన్కమ్ ఏ విదంగా వస్తుందో కాస్త చెప్పగలరా….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here