ఏంటి startup పెడుతున్నారా ?

2
ARE YOU START THE STARTUP?

ఒచ్చేశామండి ! startup మీద ఒక కొత్త శీర్షిక తో . ఆలస్యం లేకుండా విషయంలోకి వెళ్ళిపోదాం . పోయిన ఆర్టికల్ లో చెప్పినట్టు మనం startup గురించి మూడు ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నాం అవి :

1. ఎందుకు ?
2.ఏమిటి?
3 ఎలా?

ఈసారి మనం సమాధానం తెలుసుకోబోయే ప్రశ్న ఏమిటంటే ‘ఏమిటీ ‘ .

” ఏమిటీ, మీరు startup పెడుతున్నారా  ” అని సాగదీస్తూ మరీ నా దగ్గరికి వచ్చిన వారు నాకు ఇచ్చిన హిత బోధలు కింద రాస్తున్నాను . కొంచం గమ్మత్తు గా ఉంటాయి చదవండి మీరే

1. మా సొసైటీ ప్రెసిడెంట్ గారు ఇలా చెప్పారు ”చుడండి మీరు స్టార్ట్ అప్ ల గురించి కనుక్కుంటున్నారు అని విన్నాను . నిజమేనా ?  అయితే మీకీ విషయం నేను ముందెప్పుడూ చెప్పలేదు అనుకుంటా. మా బావమరిది పిన తండ్రి చిన్నకొడుకు మేనల్లుడు కూడా మీలాగే స్టార్ట్ అప్ అని ఒకటి పెట్టాడు. అంతే పెట్టి నెల రోజులు అయిందో లేదో పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయాడు . నా దగ్గరికి కూడా సహాయం చేయమని ఫోన్ ఒచ్చింది లెండి . మిమ్మల్ని నిరుత్సాహపరుద్దాం అని కాదు నాకు తెలిసింది చెప్తున్నాను అంతే ! ” .

2. ఈ విషయం ఎలా బైటికి వెళ్లిందో తెలీదు . మా నాన్నగారి స్నేహితుడు ఒక పెద్దాయన వచ్చేసారు ఒక రోజు మా ఇంటికి .  “ఏంటి స్టార్ట్ అప్ లు పెడ్తా అది ఇది అని తిరుగుతున్నావు అంట. మీ నాన్న గారు చెప్పారు నాతోటి .  పేపర్లలో చెప్పేటప్పుడు వినటానికి ఇవి బాగానే ఉంటాయి . ఇలాంటివి చేసేటప్పుడు నా లాంటి పెద్ద వారి సలహా తీసుకోవాలని తెలీదా నీకు ? సరేలే ఇప్పటికీ మించిపోయింది లేదు అందులో పెట్టేది ఎదో నాకు తెలిసిన ఒక బ్యాంకు మేనేజర్ ఉన్నారు ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యి నెలలు తిరిగేలోగా నువ్వేమి చేయకుండానే వడ్డీ వస్తుంది దానితో ఇంకొక ఫిక్స్డ్ డిపాజిట్ వేద్దువుగాని . ఇంకా తెలిసి తెలియక చేసిన ఆలోచనలు చాలు ” అని వెళ్లిపోయారు . నాకేమి మాట్లాడాలో అర్ధం కాలేదు !! ఆలా ఆలోచిస్తూ ఉండిపోయాను .

ఇక ఇలాంటి ప్రసంగాలకు నేను విశ్లేషించుకున్న సమాధానాలు చదవండి మీరే :

1. అవును మా సొసైటీ ప్రెసిడెంట్ లాంటి వారు చెప్పేది నిజమే కీడెంచి మేలెంచమంటారు కదా . కానీ అలాంటివి వినేటప్పుడే మనం ఒక విషయం మనసులో గుర్తుంచుకోవాలి . గొప్ప గొప్ప వారంతా మొదట ఓడిపోయిన వారే అలంటి వారి గురించి మనం ఎన్నో పుస్తకాలు చదివి ఉంటాం . సినిమాలు చూసి ఉంటాం . స్టార్ట్ అప్ విషయానికి వస్తే అప్పులపాలవుతాం అని వచ్చే దాక రానివ్వకుండా మనమే జాగ్రత్త పడాలి .

స్టార్ట్ అప్లు పెట్టాల్సిన విధానాలు , అందులో మంచి చెడులు , ముఖ్యం గా ఒక విషయం మొదలు పెట్టేటప్పుడు లోతుగా ఆ విషయం గురించి తెలుసుకోవాలి . అంటే స్టార్ట్ అప్ ఇప్పటికే పెట్టిన వారి సలహాలు, సూచనలు అన్ని తీసుకోవాలి .అంటే మనం ఒక కొత్త ప్రదేశానికి మన ఇంట్లో వారిని తీసుకెళ్లేటప్పుడు ఎన్ని జాగ్రత్త లు తీసుకుంటామో అంత కి వంద రేట్లు జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే విజయం మన సొంతం అవుతుంది . మా సొసైటీ ప్రెసిడెంట్ గారు చెప్పింది కూడా నిజమే జాగ్రత్త చాలా అవసరం .

2 . మా నాన్న గారి స్నేహితుడు చెప్పిన విషయానికి వస్తే అయన చెప్పిందీ నిజమే మరి!. ఎన్నో ఏళ్లుగా వారు పాటిస్తున్న సేవింగ్స్ పద్ధతిని నన్ను ఫాలో అవ్వమన్నారు . అయన చెప్పిన దాన్లో వాస్తవం ఉంది . కానీ ఆలా అని పెద్ద వారి మాటలని వినకుండా ఉండకూడదు , కొత్త పద్దతులు ఫాలో అవ్వటం మానకూడదు . దీనికి ఎం చేయాలో చెప్తాను వినండి :

  • స్టార్ట్ పెట్టిన వారి అనుభవాలను మనం పరిగణలోకి తీసుకోవాలి వారితో చర్చించాలి .
  • తరువాత మనకి ఉన్నదాంట్లో చిన్న మొత్తం లేదా జీరో ఇంటరెస్ట్ తో లాభాలు వచ్చే శాఖలలో మనం ముందు ద్రుష్టి పెడితే మంచిది .
  • ఆలా కుదరదు అనుకుంటే ముందు స్టార్ట్ అప్ పెట్టె వారి దగ్గర ఇంటర్న్ షిప్ తీసుకోవచ్చు . అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ ఎంత పెట్టుబడికి ఎంత లాభం అని మనకి అర్ధమవుతుంది .

మన దగ్గర ధనం ఉంది కదా అని దానిని ఎలా అంటే ఆలా వాడకూడదు . మనం పాటించే పద్ధతి తిండి కొద్దీ రొట్టె అన్నట్టు మాత్రమే ఉండాలి . మా నాన్న గారి స్నేహితుడు చెప్పినట్టు జీవితం లో సేవింగ్స్ , మరియు ముందు జాగ్రత్త చాలా అవసరం .

అవండి ఈ శీర్షిక విశేషాలు!  వచ్చే శీర్షిక లో అసలు ఇదంతా ఎలా , స్టార్ట్ అప్ ఎలా పెట్టాలి అని తెలుసుకుందాం . అప్పటి దాక మన స్మార్ట్ తెలుగు ఆర్టికల్స్ చదువుతూ ఉండండి . ఇక సెలవు .

Guest Article By Priyanka

Comment using Facebook for quick reply

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here